Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నేనే తారలాగా వచ్చా నీ కోసం – నన్నే ఆదుకున్న నీవే ఆకాశం

May 29, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. ప్రేమ . Eternal virus . ప్రేమ అనే పదంతో ప్రారంభమయ్యే సినిమాలు తెలుగులో సుమారు ఇరవై దాకా వచ్చి ఉంటాయి . ఇవి కాకుండా ప్రేమ చుట్టూ వందల సినిమాలే వచ్చి ఉంటాయి . 1952 లో ప్రేమ అనే టైటిలుతో వచ్చిన సినిమాలో ఏయన్నార్ , సావిత్రి నటించారు . తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్ బస్టర్లు ప్రేమ నగర్ , ప్రేమాభిషేకం . ప్రేమ నగర్లో ఏయన్నార్ , వాణిశ్రీ ; ప్రేమాభిషేకంలో ఏయన్నార్ , జయసుధ , శ్రీదేవి .

1992 లో వచ్చిన ఈ ప్రేమ శిఖరం మరో లేత వయసు ప్రేమ సినిమా . Another beautiful teenage love story . ప్రశాంత్ , మమతా కులకర్ణి . ఇద్దరూ లేతలేతగా , అందంగా ఉంటారు . మమతా కులకర్ణి అయితే తాజ్ మహల్ సినిమాలో మౌనికా బేడీ లాగా చాలా gracious గా ఉంటుంది ఈ సినిమాలో .

Ads

తెలుగు , హిందీ భాషలలో ఏకకాలంలో నిర్మించబడింది ఈ సినిమా . హిందీలో అనోఖా ప్రేమ యుధ్ధ్ అనే టైటిలుతో వచ్చింది . తర్వాత కాలంలో తమిళంలోకి కూడా డబ్ చేయబడింది . దర్శకుని పేరు సత్య గోపాల్ రాం . బి కృష్ణారెడ్డి , మనోజ్ భట్నాగర్ నిర్మాతలు . డైలాగులను జంధ్యాల వ్రాసారు .

టూకీగా కధ ఏంటంటే హీరో ప్రశాంత్ కాలేజీలో మమతా కులకర్ణి వెంటపడి ప్రేమలోకి దిగబడి పోతాడు . ప్రేమ అనే మాట వింటేనే మండిపడతాడు ఆమె తండ్రి . ప్రశాంతుని లేపేయటానికి రౌడీలను పంపుతాడు . ఆ రౌడీల దాష్టికంలో ప్రశాంత్ బామ్మ చనిపోతుంది .

హీరోయిన్ తో ఉడాయిస్తాడు హీరో . ఈ ఇద్దరికీ అరుణ్ పాండియన్ ఆశ్రయం ఇస్తాడు . అతని విరోధి అయిన రామిరెడ్డిని జైలు నుండి బయటకు తెప్పిస్తాడు హీరోయిన్ తండ్రి రంగనాథ్ . గతంలో అరుణ్ ప్రియురాలు సితారను రామిరెడ్డి చంపి జైలుకు వెళతాడు .

అరుణ్ ఆశ్రయం నుండి బయటకు వచ్చేలా చేసి మేనల్లుడు సుధాకర్ తో బలవంతపు పెళ్ళిని ఏర్పాటు చేస్తాడు ప్రేమ విలన్ తండ్రి . ప్రశాంత్ దోస్తులు , అరుణ్ పాండియన్ , ప్రశాంత్ అందరూ కలిసి ఆ బలవంతపు పెళ్ళిని భగ్నం చేసి విలన్లను తుదముట్టించి ప్రశాంత్ , మమతా కులకర్ణి పెళ్లి జరిపిస్తారు . అయితే ఆ ఘర్షణలో విలన్లతో పాటు అరుణ్ పాండియన్ కూడా చనిపోతాడు .

ప్రశాంత్ , మమతా కులకర్ణిలు లేతగా చక్కగా అందంగా నటించారు . అరుణ్ పాండియన్ నటన బాగుంటుంది . అతనికి హస్కీ వాయిస్ పెట్టారు ఎందుకో మరి ! దోస్తులలో ఆలీ , ఉత్తేజ్ ఉంటారు . ఇతర ప్రధాన పాత్రల్లో రంగనాథ్ , నిర్మలమ్మ , బ్రహ్మానందం , బాబూమోహన్ , సుధాకర్ , ఫణి , సి యస్ రావు , జయశీల తదితరులు నటించారు .

ఈ సినిమాకు లేత మొహాలతో పాటు పెద్ద ఆకర్షణ మనోజ్ శరణ్ సంగీతం . Very melodious . ముఖ్యంగా అరుణ్ , సితార మీద నేనే తారలాగా వచ్చా నీ కోసం ; నన్నే ఆదుకున్న నీవే ఆకాశం పాట చాలా శ్రావ్యంగా ఉండటమే కాకుండా చిత్రీకరణ కూడా అందంగా ఉంటుంది .

కాలేజీ అనగానే బాయ్స్ గర్ల్సునో , గర్ల్స్ బాయిస్నో టీజ్ చేస్తుంటారుగా . ఆ సాంగ్ కాలేజీ లేడీస్ అంటూ హుషారుగా సాగుతుంది . మిగిలిన పాటలు ప్రశాంత్ , మమతా కులకర్ణి మీద డ్యూయెట్లుగా చాలా బాగుంటాయి . కస్సుమనే కౌగిలిలో , హోరుగాలి జోరులో ఊగే పూల తీగెలా , ప్రకృతి లోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి , సుఖాల చుక్కలా నా చెంతకు చేరావే అంటూ సాగుతాయి . సినిమా యూట్యూబులో ఉంది . చూసిఉండని వారు ట్రై చేయవచ్చు . చూడబులే .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెద్ది సుదర్శన్ రెడ్డి కాలధర్మం ! ఫలించని ఆధునిక వైద్య చికిత్స !
  • తెలంగాణ ప్రభుత్వమా… బహుపరాక్! నీళ్లను జనరేట్ చేయలేం..!!
  • ఒక సిద్ శ్రీరామ్ – ఒక ఎస్పీ బాలు … పూర్తి కంట్రాస్టు ఉచ్చారణ…
  • ‘‘ఇలా కేసులు పడితే, ఇక ఎవరూ దేవుళ్ల మీద సినిమాలు తీయలేరు’’
  • లైక్స్, వ్యూస్ కోసం వెంపర్లాడితే… ఇదుగో ఇలాంటి ప్రమాదాలే !!
  • కథ, సంకల్పం మంచివి! కథ చెప్పే విధానం తెలియక డిజాస్టర్!!
  • మరో వారసుడి నిరాశాపూరిత ఎంట్రీ – మోహన్‌ బాబునూ వాడుకోలేదు !!
  • డీఎంకే స్టాలిన్‌తో స్ట్రెయిట్ ఫైట్‌కే విజయ్ రెడీ! ఇలా మొదలైంది!!
  • ప్రియాంక వ్యంగ్య వ్యాఖ్యలు తప్పు! మేధస్సును అవమానించడమే!!
  • ‘అవతార్’ మార్క్ హై గ్రాఫిక్స్ – ‘ఆది పురుషుడు’ రక్షింపబడ్డాడు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions