Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సతీ లీలావతి..! తెలుగు టీవీ సీరియళ్లు ఇష్టపడేవారి కోసం..!!

May 9, 2026 by M S R

.

సతీ లీలావతి… గతంలో కమల హసన్ సినిమా కూడా ఏదో ఉన్నట్టు గుర్తు… ఈ కొత్త సతీ లీలావతి కొణిదెల లావణ్య త్రిపాఠీ… అంతకుముందు పెద్దగా పాపులర్ నటి కాదు గానీ… కొణిదెల ఫ్యామిలో చేరాక పాపులారిటీ పెరిగింది… సహజం… ఆమే ఈ సినిమాకు అట్రాక్షన్ పాయింట్… తగినట్టే ఆమే సినిమాను మోసే ప్రయత్నం చేసింది కూడా…

కానీ కథాకథనాలు పూర్… అక్కడక్కడా కొన్ని కామెడీ మెరుపులు తప్ప ఓవరాల్‌గా సినిమా ఓ జీతెలుగు సాగదీత సీరియల్‌లా అనిపిస్తుంది… ఓటీటీల్లో, వెబ్ సీరియళ్లలో, టీవీ సీరియళ్లలో చూస్తున్నవే… సినిమా పరిశ్రమలో దర్శకురాలిగా ఉన్న లీలావతి (లావణ్య త్రిపాఠి) కి చిన్నతనం నుంచి సైకాలజికల్‌గా ఓ సమస్య…

Ads

తన సమస్యను అధిగమించేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్)ను సంప్రదిస్తుంది… రామ్ సేతుతో పరిచయం ప్రేమగా మారుతుంది… తండ్రి (వీకే నరేష్) అనుమతితో రామ్ సేతును లీలావతి ప్రేమించి పెళ్లి చేసుకొంటుంది… కానీ మూడేళ్ల తర్వాత నర్స్‌గా పనిచేసే నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్)తో రామ్ సేతు ప్రేమలో పడతాడు… దాంతో వారి మధ్య దాంపత్యపరమైన విభేదాలు చోటు చేసుకొంటాయి… లీలావతికి రామ్ సేతు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవుతాడు…

ఆ సమస్య ఏమిటి…? మొగుడితో సమస్య ఏమిటి..? నర్సుతో ప్రేమ యవ్వారం ఏమిటి..? అనేది కథ… కానీ రక్తికట్టలేదు… కాసేపు నరేష్ ఆయన సఖి పవిత్ర నవ్వించే ప్రయత్నం చేస్తారు… దర్శకుడు తాతినేని సత్య ఏదో ఓ పాత కథను రక్తికట్టించాలని ప్రయత్నించినా సరే కొత్తదనం లోపించి సినిమా ఆసక్తికరంగా అనిపించదు…

కథ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది… భార్యాభర్తల ఘర్షణను త్వరగానే తీసుకొచ్చినా, ఆ తరువాత సన్నివేశాలు, ఎమోషన్స్ పండలేదు… సెకండాఫ్‌లో బాత్రూమ్ డ్రామా ఫర్వాలేదనిపించింది… సప్తగిరి, మెట్ట రాజేంద్రన్ క్యారెక్టర్లు ఈ సినిమాకు కాస్త పాజిటివ్‌…

డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను చాలా సులభంగా లావణ్య త్రిపాఠీ పోషించింది కానీ అసలు కథలోనే దమ్ము లేనప్పుడు ఏం ఫాయిదా..?

లావణ్య పక్కన  దేవ్ మోహన్ ఆడ్‌గా ఉన్నాడు… నర్స్ మడోన్నా సెబాస్టియన్ పాత్ర నిడివి తక్కువ… ఇంపాక్ట్ తక్కువ… లావణ్య, దేవ్, మడోన్నా మధ్య డ్రామా ఇంకాస్త పెరిగి ఉంటే బాగుండేది… సప్తగిరి లేకపోతే సినిమా మరింత నీరసంగా తయారయ్యేది… కథనంలోనే దమ్ము బాగా లేనప్పుడు మిక్కీ జే మేయర్ సంగీతం అయినా ఇంప్రెసివ్ అనిపించదు…

పెళ్లయ్యాక కూడా లావణ్య త్రిపాఠీ సినిమాలు చేయడానికి అంగీకరించడం పట్ల వరుణ్ తేజ్‌ను అభినందించాలి… చాలా హైప్రొఫైల్ సినిమా సెలబ్రిటీల ఇళ్లల్లో ఇలాంటి పెళ్లిళ్ల తరువాత ఇక సినిమాలు చేయనివ్వరు, చాలా ఉదాహరణలు… కానీ దాన్ని లావణ్య సద్వినియోగం చేసుకోవాలి, మరీ సతీ లీలావతి సినిమాలు కాదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సతీ లీలావతి..! తెలుగు టీవీ సీరియళ్లు ఇష్టపడేవారి కోసం..!!
  • బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు… ఓ అమ్మాయిపై ఘాతుకం…
  • అతిశయం, ఆభిజాత్యం… వాణిశ్రీకి సరిగ్గా నప్పే ప్రౌఢ పాత్ర…
  • నంబర్లాట- నవ్వులాట..! అనామక పార్టీలూ ‘ఆడుకుంటున్నయ్’…!!
  • ఇదేం సినిమా రవిబాబూ..? థియేటరంతా నెత్తుటి కమురు వాసన…!
  • పరివార్‌వాద్… వారస రాజకీయాలు… ఏ పార్టీ మినహాయింపు కాదు…
  • సువేందు..! మరో సంఘేతర బీజేపీ సీఎం..! నాన్- భద్రలోక్ కూడా..!!
  • తమిళ రాజకీయ తెరపైకి హఠాత్తుగా రజినీకాంత్… ఉమ్మడి సర్కారు…
  • బెంగాల్‌ కమల వికాసం… చదివి తీరాల్సిన ఓ పొలిటికల్ పోస్ట్‌మార్టం…
  • డ్రగ్స్ తంబాకు కాంబో… కరీంనగర్‌లో సైడ్ ఎఫెక్ట్స్… కేటీయార్‌కు తల్నొప్పి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions