Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథ బాగుండాలే గానీ… చిరంజీవి సినిమాను కూడా బీట్ చేయొచ్చు..!!

April 23, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మరో స్టూవర్ట్ పురం సినిమా ఇది . యాదృచ్చికంగా ఈ స్టూవర్ట్ పురం దొంగలు సినిమా కూడా 1991 జనవరిలోనే చిరంజీవి సినిమా స్టువర్టుపురం పోలీస్ స్టేషన్‌తో పాటే విడుదలయింది . ఈ సినిమా నిర్మాత , దర్శకుల ధైర్యానికి మెచ్చుకోవచ్చు . చిరంజీవి సినిమా బాగా ఆడకపోయినా ఈ సినిమా బాగానే ఆడింది .

ముందుగా ఈ సినిమా కధను , స్క్రీన్ ప్లేని బిర్రుగా తయారు చేసుకున్న దర్శకుడు సాగర్ ని అభినందించాలి . ఫేమిలీ సెంటిమెంటుతో ఓ స్టూవర్ట్ పురం దొంగ కధని జోడించి కధను నేసారు సాగర్ . It’s more a family sentiment-oriented action movie rather than a story around Stuvart Puram Dacoits .

Ads

ఏది ఏమయినా ప్రేక్షకులను రంజింపచేసిందా లేదా అనేదే ముఖ్యం . ఆ టెస్టులో ఈ సినిమా పాసయినట్లే . టూకీగా కధ ఏంటంటే : కోటిగాడు అనే స్టూవర్ట్ పురం దొంగను ఓ వ్యాపారస్తుడు , ఓ పోలీసాయన , ఓ రాజకీయుడు ఉపయోగించుకుంటూ ఉంటారు . అతనికి ఇద్దరు కొడుకులు , ఓ కూతురు . ఈ పెద్దోళ్ళు కోటిగాడిని చంపేయటం చూసిన పెద్ద కొడుకు భానుచందర్ ఆ ముగ్గురి మీద పగ పెంచుకుంటాడు .

రెండో కొడుకు దగ్గుబాటి రాజా తన తల్లిని అత్యాచారం చేయబూనిన వ్యక్తిని చంపి బాల నేరస్తుల స్కూలుకు చేరతాడు . కూతురు కానిస్టేబులుగా పనిచేస్తున్న సుత్తి వేలు వద్ద పెరుగుతుంది . భానుచందర్ తండ్రి లాగానే దొంగ అవుతాడు . చిన్న కొడుకు ఇనస్పెక్టర్ , కూతురు కలెక్టర్ అవుతుంది . భానుచందర్ ముగ్గురినీ చంపేసి తన పగ తీర్చుకుంటాడు . ఆ క్రమంలో తన ప్రాణాలను కోల్పోతాడు .

సినిమా చూస్తున్నప్పుడు అన్నదమ్ముల అనుబంధం , భలే అబ్బాయిలు లాంటి సినిమాలు కాస్త గుర్తుకొస్తాయి . విలన్లుగా నాజర్ , వల్లభనేని జనార్దన్ , బాబూమోహన్లు నటించారు . ఇతర పాత్రల్లో చరణ్ రాజ్ , బెంగుళూరు పద్మ , లిజీ , ఈశ్వరీరావు , ధర్మవరపు సుబ్రమణ్యం , రాజేష్  తదితరులు నటించారు .

రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో వేటూరి , సాహితి పాటల్ని వ్రాసారు . వి యస్ రామిరెడ్డి , వీరారెడ్డి నిర్మాతలు . సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంతుడు ఒక యోగీ కాగలడా..? షాబాద్ కిల్లర్‌కు బతికే అర్హత ఉందా?
  • జానకమ్మను తెలుగు జాతి ఓన్ చేసుకోలేదా..? ఏది నిజం? ఏది అబద్ధం?
  • తనను స్వాగతిస్తున్నవేళ – మోడీ కిందకు వంగి ఏం చేస్తున్నాడు?!
  • నాగార్జున అడగాలే గానీ… రోజా కూడా గెస్ట్ సాంగ్‌లో స్టెప్పులేయదా మరి!
  • Pure High Hypocrisy – ‘గులాబీ పులి గోళ్ల’కు నెత్తురే అంటలేదా!?
  • డీకే శివకుమార్- ఓ పాత యెజ్డి బైక్ కథ! అప్పట్లో ఆ బైక్స్ రేంజే వేరు!!
  • సచిన్, కోహ్లీ కూడా చేయలేని సెంచరీ ఫీట్- ఈమె చేసేసింది!
  • మన వుమెన్ లార్డ్స్! ఒకే మ్యాచులో ఇద్దరు ఆనర్స్ బోర్డ్స్!!
  • పాడటం వేరు! పద ఉచ్చారణలో భావం పండించడం వేరు!
  • అబ్బో, అహం దెబ్బ తింటే పంతమే! జానకమ్మ మరో కోణం ఇది!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions