.
Pardha Saradhi Upadrasta … రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కొత్త ఆంక్షలు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో బిల్లు ఆమోదం…
అమెరికా కాంగ్రెస్‌లో రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026 కు కీలక ముందడుగు పడింది. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెప్టెంబర్ 16న 262–159 ఓట్లతో బిల్లును ఆమోదించింది. ఇప్పుడు అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదానికి వెళ్తుంది.
భారత్, చైనాపై ఏం ప్రభావం?
ఈ బిల్లు చట్టంగా మారితే, రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు లేదా గ్యాస్ కొనుగోలు చేసే దేశాల దిగుమతులపై 100% వరకు అదనపు టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. భారత్, చైనా వంటి రష్యన్ ఎనర్జీ కొనుగోలుదారులు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
Ads
అమెరికా సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ కూడా భారత్, చైనా వంటి దేశాలు రష్యన్ ఎనర్జీ కొనుగోళ్లను తగ్గించి ఇతర వనరుల నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయాలని వ్యాఖ్యానించారు.
ప్రధానంగా లక్ష్యంగా ఉన్న దేశాలు (Top Targets) రష్యా ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తూ, 100% వరకు అమెరికా టారిఫ్‌లను ఎదుర్కొనే ప్రమాదంలో ఉన్న దేశాలు: భారతదేశం, చైనా, బ్రెజిల్
నిఘా/ ప్రభావంలో ఉన్న ఇతర దేశాలు (Under Scrutiny) రష్యా ఇంధన దిగుమతులు లేదా వాణిజ్య సంబంధాల కారణంగా బిల్లు పరిధిలోకి వచ్చే దేశాలు: టర్కీ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) , హంగేరి , స్లోవేకియా , సింగపూర్ , అజర్‌బైజాన్, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్
ప్రత్యక్ష ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశం ఇరాన్ (మిలిటరీ , ఎనర్జీ సెక్టార్‌పై నేరుగా ఆంక్షలు)
మినహాయింపులు లభించే అవకాశం ఉన్న దేశాలు (Exemptions) రష్యా గ్యాస్ దిగుమతులను 15% కంటే తక్కువకు తగ్గించుకున్న దేశాలు: జపాన్, ఫ్రాన్స్, బెల్జియం , ఇతర 12 యూరోపియన్ దేశాలు.
భారత్ వెంటనే స్పందించింది , దాని స్పందన మాత్రం స్పష్టంగా ఉంది…
“భారత్ తన 1.4 బిలియన్ ప్రజల ఇంధన భద్రతను నిర్ధారించడంలో దృఢంగా కట్టుబడి ఉంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, విభిన్న వనరుల నుంచి ఇంధనాన్ని సమకూర్చుకోవడం కొనసాగిస్తుంది…”
భారత్ ఇప్పటికే రష్యాతో పాటు సౌదీ అరేబియా, UAE, బ్రెజిల్, అమెరికా, నైజీరియా తదితర దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇటీవలి డేటా కూడా భారతదేశం బహుళ వనరుల నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు చూపుతోంది.

అసలు విషయం ఏమిటంటే?
భారత్‌కు ఇది కేవలం రష్యా– అమెరికా సమస్య కాదు. భారత్‌కు Energy Security అత్యంత కీలకం. భారత్ తన అవసరాల్లో సుమారు 88.7% ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల ఏ ఒక్క దేశంపైనైనా పూర్తిగా ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు కొనుగోలు చేయడం భారత ఇంధన వ్యూహంలో కీలకంగా మారింది.
ఇప్పుడు ప్రశ్న: భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఎంతవరకు కొనసాగిస్తుంది? భారత్ రష్యా ఇప్పటికే రూపాయి, రూబుల్ లలో చమురు కొనుగోళ్లను చేస్తుండటం వల్ల ఈ ఆంక్షలు ఎంత వరకు ప్రభావితం అవుతాయి?
ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేస్తారా?
రష్యన్ చమురుకు బదులుగా భారత్ ఏ దేశాల నుంచి దిగుమతులు పెంచుతుంది?
ఈ పరిణామం భారత్‌లో ఇంధన ధరలు, దిగుమతి బిల్లు, రూపాయి , ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం భారత్– అమెరికా వాణిజ్య సంబంధాలకు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. భారత్ ఇంధన భద్రత — దేశ ప్రయోజనమే మొదటి ప్రాధాన్యం…. — ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #India #USA #Russia #RussianOil #Trump #LindseyGraham #RichardBlumenthal #EnergySecurity #CrudeOil #IndiaRussia #IndiaUSA #Geopolitics #Sanctions #Tariffs #BRICS
Share this Article