Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!

October 7, 2026 by M S R

.

అసలు టీటీడీ దర్శనం టికెట్ల బుకింగ్‌లో ఏం జరుగుతోంది? ఈ ప్రశ్న కొన్ని లక్షల మంది నుంచి వస్తోంది… వీర సనాతని పవనుడిని ప్రశ్నిస్తోంది… తెలిసీ తెలియనట్టు నటించే చంద్రబాబును ప్రశ్నిస్తోంది… నేను ఎఐ సిస్టం తీసుకొచ్చి, ఇలా క్యూలో నిలుచుకోగానే అలా దర్శనం లభించేలా చేస్తానని బీరాలు పలికిన ఓ అసమర్థ టీటీడీ చైర్మన్‌ను ప్రశ్నిస్తోంది… కాదు, వెక్కిరిస్తోంది…

తిరుపతిలో రైలో, బస్సో దిగింది మొదలు… తిరుగు ప్రయాణం ప్రారంభమయ్యేదాకా… తిరుమలలో ప్రతిదీ దోపిడీయే… అందరికీ తెలుసు… చంద్రబాబు తరం కాదు చక్కదిద్దడం, చంద్రబాబు ఆలోచనల్లోనే ఉండదు దిద్దుబాటు… తను ఎంపిక చేసిన మీడియా నాయుడు కాదు కదా, రేప్పొద్దున ఓ కూచి లోకాద్రినాయుడు చైర్మన్ అయినా సరే, ఈ దురవస్థ మారదు…

Ads

అవును, టీటీడీ దర్శనం టికెట్ల జారీ తేదీలు ప్రకటించాక, సమయానికి కొన్నివేల మంది కంప్యూటర్ల ముందు కూర్చుంటారు… వెయిట్ చేస్తుంటారు… తీరా చూస్తే… ఒక్క నిమిషంలోనే 12 వేల టికెట్లు, నాలుగు నిమిషాల్లోనే 60 వేల టికెట్లు పూర్తవడం ఎలా సాధ్యమవుతోంది..? దీని వెనుక ఏం దందా ఉంది..? టీటీడీకి సపరేట్ విజిలెన్స్ విభాగం కూడా ఉంది కదా… ఏపీలో కూడా సైబర్ క్రైం పోలీస్ విభాగం కూడా ఉంది కదా… కోరితే సాయం చేయడానికి కేంద్రమూ సిద్ధమే కదా… మరెందుకు ఇది చక్కబడటం లేదు..?

ttd

ఇక టీటీడీ ఎఐ సాయం తీసుకుని, అలవోక దర్శనాల సిస్టం తీసుకొస్తుందట, భక్తజనం నమ్మాలట… ఒక నాయుడు, ఎంపిక చేసిన నాయుడు, రాబోయే నాయుడు సంగతి వదిలేద్దాం, చంచల పవనుడినీ వదిలేద్దాం… కాబోయే ముఖ్యమంత్రి అని నీరాజనాలు అందుకుంటున్న, టెక్ జ్ఞానమున్న లోకేష్ నాయుడికి ఎందుకు పట్టడం లేదు..?

సాధారణ భక్తులు బుకింగ్ ప్రారంభించిన వెంటనే ప్రయత్నించినా టికెట్లు దొరకకపోతే, ఇంత భారీ సంఖ్యలో టికెట్లు ఎవరు, ఎలా బుక్ చేస్తున్నారు? అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దళారులు పెద్ద ఎత్తున టికెట్లు దక్కించుకుంటున్నారనే అనుమానాలు భక్తుల్లో ఎందుకు కలుగుతున్నాయి? టీటీడీ దీనిపై సమగ్ర విచారణ ఎందుకు చేపట్టడం లేదు?

బుకింగ్ వ్యవస్థలో బాట్స్, ఆటోమేటెడ్ బుకింగ్ లేదా ఇతర మార్గాల ద్వారా టికెట్లు ముందుగానే దక్కించుకుంటున్నారా? టీటీడీ వద్ద దీనిపై పర్యవేక్షణ ఉందా? లేక పట్టుకోలేని అసమర్థతా, అన్నీ తెలిసి పాటిస్తున్న మౌనమా..? భాగస్వామ్యమా..? ఇందులో ఎవరి పాపం ఎంత..?

అవును బాబు గారూ… సోకాల్డ్, జగన్, భూమన, చెవిరెడ్డి, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి ఎట్సెట్రా రెడ్లందరూ తిరుమలను భ్రష్టుపట్టించారు, నిజమే, అంగీకరిస్తాం… మరి ఈ రెండేళ్లలో మీరిద్దరు నాయుళ్లు ఏం ఉద్దరించారు సారూ..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కడా?!
  • క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!
  • లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!
  • 100 రోజుల బందిఖానా కాదు… 4 వారాల్లోనే ‘ఖేల్ ఖతం’!
  • విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!
  • “ఖాన్‌తో గేమ్స్ ఆడకు… శాల్తీలు లేచిపోతాయ్”
  • రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!
  • భేష్ మృణాల్… కథ తడబడినా… నటన తగ్గనివ్వలేదు!
  • నేను రెడీ’ అని స్మృతి చెప్పింది.. మూడు నెలలకే హర్మన్ తప్పుకుంది!
  • అబ్బురపరిచే సినిమాటిక్ ‘ఎదుగుదల’..! ఎవరీ ‘పవర్‌ఫుల్ కేరక్టర్..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions