Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!

October 7, 2026 by M S R

.

విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది! ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం. రాత్రి 11 గంటలు.

మాధురి, ఐశ్వర్య ఇద్దరూ న్యూయార్క్ వెళ్లాల్సిన ఒకే విమానానికి కన్ఫర్మ్‌డ్ టికెట్లు తీసుకున్నారు. టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.2.5 లక్షలు. మరుసటి ఉదయం మాన్‌హాటన్‌లో ఇద్దరికీ కీలకమైన బిజినెస్ ప్రెజెంటేషన్లు ఉన్నాయి.

Ads

బోర్డింగ్ గేట్ దగ్గరకు వెళ్లగానే ఇద్దరికీ షాక్. “విమానం ఓవర్‌బుక్ అయింది. మరో 14 మంది ప్రయాణికులకు సీట్లు లేవు. సిస్టమ్ మిమ్మల్ని బంప్ చేసింది. రేపటి విమానంలో పంపిస్తాం. ఇప్పటికి ఫుడ్ వోచర్ తీసుకోండి.”

మాధురి ఆందోళనకు గురైంది. వాదించింది. ఏడ్చింది. గంటల తరబడి గొడవ జరిగింది. చివరకు సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ రాత్రి విమానాశ్రయంలోనే గడిచింది. మరుసటి రోజు కార్యక్రమం మిస్సయింది.

ఐశ్వర్య మాత్రం పెద్దగా గొడవ చేయలేదు. ఆమె మూడు విషయాలు మాత్రమే అడిగింది. “నేను స్వచ్ఛందంగా నా సీటు వదులుకోవడం లేదు. నన్ను ఓవర్‌బుకింగ్ కారణంగా ప్రయాణానికి నిరాకరిస్తున్నట్లయితే అది రాతపూర్వకంగా ఇవ్వండి. నా ప్రత్యామ్నాయ ప్రయాణం, పరిహారం గురించి కూడా రాతపూర్వకంగా చెప్పండి.”

flight over booked

అక్కడి నుంచి పరిస్థితి మారిపోయింది. ఇదే ఈ కథలోని అసలు పాయింట్. విమాన సంస్థ మిమ్మల్ని ప్రయాణం నుంచి తప్పించాలనుకున్నప్పుడు… మీరు ‘వాలంటీర్’ అవుతున్నారా, లేక సంస్థే మిమ్మల్ని ‘ఇన్‌వాలంటరీగా డినై’ చేస్తుందా అన్నదే కీలకం.

విమాన సంస్థలు ఓవర్‌బుకింగ్ చేయడం కొత్త విషయం కాదు. కొంతమంది ప్రయాణికులు చివరి నిమిషంలో రాకపోవచ్చనే అంచనాతో, విమానం సామర్థ్యానికి మించి టికెట్లు విక్రయించే పరిస్థితులు ఉంటాయి. కానీ అందరూ వచ్చేసినప్పుడు సమస్య మొదలవుతుంది.

అప్పుడు గేట్ దగ్గర ఒక ప్రకటన వినిపిస్తుంది. “రేపటి విమానంలో వెళ్తే అదనపు వోచర్ ఇస్తాం. ఎవరైనా స్వచ్ఛందంగా సీటు వదులుకుంటారా?” ఇక్కడే జాగ్రత్త. మీరు నిజంగానే స్వచ్ఛందంగా అంగీకరిస్తే, అది ఒక రకమైన ఒప్పందంగా మారవచ్చు. మీరు స్వచ్ఛందంగా సీటు వదులుకున్న ప్రయాణికుడిగా పరిగణించబడవచ్చు.

కానీ మీరు అంగీకరించకపోయినా, కన్ఫర్మ్‌డ్ టికెట్ ఉన్నప్పటికీ విమానంలోకి అనుమతించకపోతే అది వేరే పరిస్థితి—involuntary denied boarding. అందుకే ఆ సమయంలో అరవడం కంటే, ఒక పని చేయడం తెలివైనది.

“నేను వాలంటీర్ కాదు. నన్ను ఓవర్‌బుకింగ్ కారణంగా బోర్డింగ్‌కు నిరాకరిస్తున్నట్లయితే, దయచేసి దాన్ని రాతపూర్వకంగా ఇవ్వండి.” అంతే. మీ హక్కుల గురించి మాట్లాడటానికి మీరు సిద్ధంగా ఉన్నారని విమాన సంస్థకు అర్థమవుతుంది.

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ కథలో మరో పెద్ద క్లెయిమ్ ఉంది. “అలా చేస్తే ప్రత్యర్థి విమానంలో ఫస్ట్ క్లాస్, లక్షల్లో పరిహారం, ప్రైవేట్ కారు, ఐదు నక్షత్రాల హోటల్ అన్నీ వచ్చేస్తాయి” అనేది. అది మాత్రం అంత సింపుల్ కాదు.

ప్రతి ఓవర్‌బుకింగ్ కేసులో ప్రయాణికుడికి వేరే విమానంలో (ఇతర ఎయిర్ సర్వీస్ అయినా సరే) ఫస్ట్ క్లాస్ ఇవ్వాల్సిందేనని, 400 శాతం పరిహారం తప్పనిసరిగా వస్తుందని చెప్పడం సరైనది కాదు. పరిహారం, ప్రత్యామ్నాయ ప్రయాణం, వసతి వంటి అంశాలు వర్తించే నిబంధనలు, పరిస్థితులు, విమాన సంస్థ బాధ్యతలపై ఆధారపడతాయి.

అందుకే ఈ వైరల్ కథలోని అసలు పాఠం “ఎలా ఫస్ట్ క్లాస్ కొట్టేయాలి?” అనేది కాదు. “వాలంటీర్” అనే పదాన్ని అర్థం చేసుకోకుండా ‘అవును’ అనకండి. కన్ఫర్మ్‌డ్ టికెట్ ఉన్న ప్రయాణికుడిని ఓవర్‌బుకింగ్ కారణంగా ఎక్కించకపోతే, ఏం జరుగుతుందో స్పష్టంగా అడగండి. మీకు ఇచ్చే ఆఫర్‌ను రాతపూర్వకంగా తీసుకోండి. మీ హక్కులు ఏమిటో తెలుసుకోండి.

మాధురి చేసినట్టు కోపంతో గొడవపడటం ఒక మార్గం. ఐశ్వర్య చేసినట్టు ప్రశాంతంగా, స్పష్టంగా, రాతపూర్వకంగా అడగడం మరో మార్గం. విమానాశ్రయంలో ఆ రెండు పద్ధతుల మధ్య తేడా కొన్నిసార్లు చాలా పెద్దదై ఉండొచ్చు.

విమానం ఓవర్‌బుక్ అయిందని చెప్పగానే భయపడకండి.
ముందుగా ఒకటే అడగండి—“నన్ను వాలంటరీగా దింపుతున్నారా..? లేక మీరు బోర్డింగ్ నిరాకరిస్తున్నారా?” అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కైసే కహూఁ కుచ్ కెహనా సకూఁ … మహేంద్రన్ సినిమాల తీరే వేరు !!
  • అయ్యా, నేతాజీ మునిమనవడు గారూ..! ప్రభాస్ గ్లింప్స్‌లో తప్పేం లేదు..!!
  • అసలు నీకు బుద్దుందా వాసూరావ్..? సాయిపల్లవిపై ఈ కూతలేంటి..?
  • నీటికి Expiry Date ఉందో లేదో మీకు తెలుసా..?
  • కొమ్మూరి యుగంధర్ – అప్పట్లో పాఠకుల్ని ఉర్రూతలూగించిన పేరు !!
  • రేవంత్ ప్రయత్నాలకు ఫడ్నవీస్ పాజిటివ్- ఇక కిషన్ రెడ్డి ఏం చేస్తాడో ..!?
  • మొద రాత్రి! ఇది కేయాస్ నేరేటివ్… అంటే గందరగోళమే కథ ముడిసరుకు!!
  • నల జిలుకర మొగ్గ – కాలంతోపాటు మారితేనే ఏ కళకైనా మనుగడ !!
  • వడివేలు వంద కోట్ల భవనం.. కుటుంబం కోసమా? సంపదకు భద్రతా?!
  • గజబ్ రాత్ ! కథ గజబ్… కథనమే గజిబిజి… అనేక మలుపుల చిక్కుముడి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions