Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ఖాకీ కొలువేం ఖర్మ..? అంత తెలివే ఉంటే కేబీసీలో 7 కోట్లూ కొట్టొచ్చు…!

November 3, 2021 by M S R

ఉన్నవేమో 5,500 పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టులు… దరఖాస్తు చేసుకున్నవాళ్లేమో 8.29 లక్షల మంది… మరి వీళ్లను వడబోయడం ఎలా..? మెరికల్ని ఎంపిక చేయడం ఎలా..? హర్యానా ప్రభుత్వానికి ఎదురైన చిక్కు ప్రశ్న ఇది…! మూడు దశల ఎంట్రన్స్ టెస్టు పెట్టేసింది… ఆదివారం నుంచి మంగళవారం వరకూ…! ఆ ప్రశ్నపత్రం ఎంత గొట్టుగా సెట్ చేశారంటే… ఆ ప్రశ్నలకు జవాబులు గనుక తెలిస్తే కౌన్‌బనేగాకరోడ్‌పతిలో ఏడు కోట్ల ప్రైజ్ మనీ కొట్టొచ్చు… యూపీఎస్సీ సింగిల్ అటెంప్ట్‌లో క్రాక్ చేయొచ్చు… ఆ రేంజ్ ప్రశ్నలు కూర్చారు… ఒక్కొక్క అభ్యర్థీ లబోదిబో… నిజానికి కామన్ సెన్స్ ఉన్న సెలక్షన్ బోర్డు (HSSC) అయితే ఏం చేయాలి..? ఫిజికల్ ఫిట్‌నెస్‌ చూడటంతో పాటు సదరు అభ్యర్థికి ఐపీసీ, సీఆర్పీసీ, ప్రాథమిక హక్కులు, సామాజిక శాంతి, పౌరహక్కులు, నేరదర్యాప్తులో టెక్నాలజీ, సైన్స్, మానవతత్వాలు, స్థానిక భౌగోళిక విశేషాలు వంటి అంశాల్లో ప్రశ్నలు ఇవ్వాలి… మెంటల్ ఎబిలిటీ, గ్రాస్పింగ్, ఐక్యూలకి సంబంధించిన ప్రశ్నలు కూడా బెటర్… కానీ 12వ తరగతి బేసిక్ అర్హత పెట్టిన ఈ కొలువుల కోసం ఎలాంటి ప్రశ్నలు అడిగారో తెలుసా..?

haryana police

కంగారుపడకండి, ఇవి ఇంగ్లిషులో ఉన్నయ్… పైపైన చదువుతూ కనీసం అటెంప్ట్ చేయగలమో లేదో ఓసారి పరీక్షించుకొండి… వీటిలో కప్పల నుంచి ప్రపంచ వాణిజ్యసంస్థ దాకా ప్రశ్నలు ఎదురవుతయ్… Are red blood cells in frogs nucleated, enucleated, trifid or bifid..? అనే ప్రశ్న దగ్గర మొదలుపెడదాం…

Ads

  • Who published the newspaper Risorgimento?

a) Joseph Garibaldi
b) Joseph Mazzini
c) Victor Emmanuel –II
d) Count Di Cavour

  • A body with pores and canals in walls is present in:

a) Amelida
b) Annelida
c) Porifera
d) Ctenophora

  • Structure of XeF6 is:
a) Distorted octahedral

b) Square bipyramidal
c) Distorted square planar
d) Square planar

  • Consider the following statements about the World Trade Organisation:

The World Trade Organisation is the only global international organisation dealing with rules of trade between nations.

Afghanistan joined the WTO on 29th July as its 164th member.

a) Both statement i and ii are correct
b) The statement ii is correct
c) The statement i is correct
d) None of the above

  • The Reserve Bank has introduced banknotes in the Mahatma Gandhi series since:

a) 1996
b) 1951
c) 1974
d) None of the above

  • Assimilation is a process of ……. in which the group acquires the memories, sentiments and attitudes of other groups:

a) Interpretation and coordination
b) Interpretation and facilitation
c) Interpretation and fusion
d) Facilitation and integration

  • International Centre for Automotive Technology has developed a technology innovation platform called:

a) Knowledge integration for technology enrichment (KITE)
b) SPARROW
c) Automotive solution portal for industry research and education (ASPIRE)
d) None of these

చూశారుగా… ఠారెత్తిపోయేట్టుగా ఉంది కదా… కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా ఓ ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరాడు… ‘‘అయ్యా, ముఖ్యమంత్రి గారూ, మీరు ప్లస్ మీ మంత్రులు, మీ డీజీపీ ఈ పరీక్ష రాయండి, కనీసం 33 శాతం మార్కులు ఎవరికీ రావు, మీరు పెడుతున్న ఎంట్రన్స్ టెస్టు తీరు మొత్తం హర్యానా యువత మీద వేస్తున్న ఓ క్రుయల్ జోక్ మాత్రమే’’ అని కడిగేశాడు… ఎంఏ, పీహెచ్డీ, బోటనీ, జువాలజీ, సోషియాలజీ, అంతర్జాతీయ చరిత్ర, ఎంఎస్సీ మాథమేటిక్స్ ప్రశ్నలు కూడా అడిగితే దీన్నేమనాలి..? ‘‘మరేం చేయమంటారండీ, ఉన్న కొలువులు కొన్ని, అభ్యర్థులు లక్షల్లో, అందుకే టఫ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేయాల్సి వచ్చింది’’ అంటున్నాడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ భోపాల్ సింగ్… ‘‘ఇదీ పాసయ్యేవాళ్లు బోలెడు మంది, ఉన్నత విద్యార్హతలు ఉన్నవాళ్లు దరఖాస్తులు చేసుకున్నారు… వాళ్లను తిరస్కరించలేం కదా’’ అనేది తన వివరణ… నిజమే కావచ్చు… కానీ మీరు చెప్పిన ఆ 12వ తరగతి కనీస విద్యార్హత మాత్రమే ఉన్నవాళ్లు ఏమైపోవాలి సార్..? ఈ పోస్టులకు కూడా బీటెక్కులు, ఎంటెక్కులు, పీహెచ్డీ స్కాలర్స్ పోటీపడాలా..?!

(* ప్రశ్నలు, ఇన్‌పుట్స్ ThePrint సౌజన్యంతో…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions