మొన్న దుబాయ్ పోయినప్పుడు ఒక వాటర్ పార్క్ లో పక్కనే ఉన్న వ్యక్తితో మాటా మంతీ… ఆయన కొంచెం వయసులో పెద్ద…
Ads
ఆయన: మీరెక్కడి నుంచి..
నేను: దోహా, కతర్… మీరు?
ఆయన: కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్…. మీరెప్పుడైనా అక్కడకు వచ్చారా ? ఇండియాలో ఎక్కడ?
నేను: ఆంధ్ర ప్రదేశ్… లేదు కాన్పూర్ కి ఎప్పుడూ రాలేదు.. ఏం చేస్తుంటారు?
ఆయన: నేను హైదరాబాద్ కి చాలాసార్లు వచ్చాను… cardiologist నా వృత్తి…
నేను: దుబాయ్ కి మొదటిసారి వచ్చారా? ఫామిలీ కనపడట్లేదు?
ఆయన: చాలాసార్లు వచ్చాం… ఫామిలీతో రాలేదు.. doctors అంతా కలిసి వచ్చాం… బిజినెస్ ఈవెంట్ ఉంటే కంపెనీ అరెంజ్ చేసింది..
నేను: ఓహ్… వెరీ గుడ్… ఇక్కడేనా .. ఈ కంపెనీ వాళ్ళు వేరే వేరే సిటీస్ లో ఈవెంట్స్ పెడుతూ ఉంటారా?
ఆయన: ప్రతి ఏడాది ఒక్కో ప్లేస్ లో.. కరోనాకు ముందు థాయిలాండ్, సింగపూర్, మాల్దీవ్స్, మారిషస్, పారిస్ ఇలా చాలాచోట్ల పెట్టేవాళ్ళు… కొరోనా తర్వాత ఇదే రావడం… దుబాయ్ లో travel restrictions ఏమీ లేవు కదా… అందుకే ఇక్కడ..
నేను: వెరీ నైస్… family ఈవెంట్స్ ఉండవా….
ఆయన: లేదు.. ఇలాంటి events కి ఫామిలీస్ వస్తే ఏం బాగుంటుంది..
నేను: అంతేలెండి.. ఎంత మంది వచ్చారు…
ఆయన: మా బ్యాచ్ ఒక 20 మంది వచ్చాం.. ఫ్రెండ్స్ అంతా…
నేను: ఇండియాలో ఇలాంటివి చెయ్యరా?
ఆయన: ఓహ్.. చేస్తారు.. చాలా… కొన్నేళ్ల క్రితం సన్నీ లియోని నేకెడ్ డాన్స్ ఈవెంట్ కండక్ట్ చేసారు… ఈ మధ్య కాలంలో బాగా success ఐన ఈవెంట్ అదే…
నేను: ఓహ్… నైస్… ఈ మెడికల్ కంపె లు, ఇన్సూరెన్సు కంపెనీలు , ఈ ల్యాబ్ లు మీకు బాగా commissions కూడా ఇస్తారు కదా…
ఆయన: హా.. బానే ఇస్తారు.. మీకు తెలిసిందే కదా… మనం వద్దన్నా ఇచ్చి వెళ్తారు… మొదట్లో మనం వద్దు అంటాం.. మెల్లగా పరిచయాలు పెరిగాక, మిగతావాళ్ళతో పోలిక వస్తుంది… వాళ్లకు కార్ ఉంది మనకు లేదు అని.. వాళ్ళ ఇల్లు ఇంతుంది అంతుంది అని… ఇక మనమూ మొదలుపెడతాం… ఈ సిస్టమే ఇంత… దానిదే నాటి బయటకు రావాలంటే కష్టమే…
..
..
..
..
.
ఆ సమయంలో ఇలాంటి డాక్టర్లా దేవుళ్ళు అంటూ ఉంటారు.. అనుకున్నా… తిట్టుకున్నా…
..
..
కానీ తీరిగ్గా ఆలోచిస్తే నేనే తప్పుగా ఆలోచించాను అని అర్థమైంది..
ఒక ఇంజినీర్…
ఒక కలెక్టర్
ఒక పోలీస్
ఒక రెవిన్యూ ఉద్యోగి
ఒక టీచర్
ఒక సర్పంచ్
ఒక జడ్జి
ఒక లాయర్
ఒక మంత్రి
ఒక సీఎం
ఒక పీఎం
..
ఒక నువ్వు…
ఒక నేను…
..
..
ఇక్కడ ఎవ్వరికీ లేని విలువలు, నీతి, నిజాయితీ, సానుభూతి, సహానుభూతి, మానవత్వం కేవలం డాక్టర్ కాబట్టి ఆయన దగ్గర ఉండాలి అనుకోవడం నా మూర్ఖత్వం…
..
హైదరాబాద్ లో కొత్తగా హైటెక్ సిటీ వెనకాల కట్టే అపార్ట్మెంట్స్ లో ఐదు కోట్లు పెట్టి IAS లో, IPS లో 4000ft అపార్ట్మెంట్ కొంటున్నారు అని ఆ కంపెనీ వాళ్ళు advertise చేసుకోవడంలో తప్పేం లేదు…
అసలు ఒక ఐఏఎస్ తన జీవిత కాలంలో ఐదు కోట్లు ఎలా సంపాదిస్తాడు అనే ఆలోచన చెయ్యనివ్వకపోవడమే మన సిస్టం ప్రత్యేకత…
…
చినవీరభద్రుడు IAS గా ఈ మధ్య రిటైర్ అయినా తనకిప్పటికీ సొంతిల్లు, పెద్దదో, చిన్నదో, లేదని రాసింది చదువుతూ ఉన్నప్పుడు నా ఈ అనుభవం గుర్తొచ్చింది…
Share this Article