ఒక వార్త… దృశ్యం సినిమాను ఇండినేషియన్ భాషలోకి రీమేక్ చేయబోతున్నారు… దృశ్యం అంటే ఒరిజినల్ దృశ్యం-1… సీక్వెల్ కాదు… 2019లో కావచ్చు, చైనా మాండరిన్ భాషలోకి రీమేక్ చేశారు… మన సినిమాల్ని మాండరిన్‌లోకి డబ్ చేసి, కోట్లకుకోట్ల వసూళ్లు చూపించుకున్న సినిమాలు ఉన్నయ్… కానీ రీమేక్ అయిన మొట్టమొదటి ఇండియన్ సినిమా…
ఆ సినిమా పేరు వు షా… అంటే రఫ్ అర్థం నరహత్య… దానికి ఇంగ్లిష్ వాయిస్ పెట్టేసి Sheep Without Shepherd అని పేరు పెట్టారు… ఇప్పుడు ఇండొనేషియన్ భాషలోకి రీమేక్ అంటే విశేషంగానే చెప్పుకోవాలి… ఎందుకంటే..? ఏడు భాషల్లోకి రీమేక్ అయిన నాలుగో ఇండియన్ సినిమా… మూడు విదేశీ భాషల్లోకి రీమేక్ అవుతున్న రెండో ఇండియన్ సినిమా…
1975లో అమితాబ్, శశికపూర్ నటించిన క్లాసిక్ దీవార్ కూడా మూడు విదేశీ భాషల్లోకి రీమేక్ అయ్యింది… దాని తరువాత మళ్లీ దృశ్యం సినిమాయే… 2013 నాటి మలయాళ సినిమా అది… మోహన్‌లాల్, మీనా, ఆశా శరత్ ప్రధాన పాత్రలు… జీతూ జోసెఫ్ దర్శకుడు… బోలెడు రికార్డుల్ని క్రియేట్ చేసింది సినిమా… తరువాత 2014లో కన్నడంలో దృశ్య పేరిట రీమేక్… రవిచంద్రన్, నవ్యనాయర్, ఆశా శరత్ ప్రధాన పాత్రలు…
Ads
తరువాత అదే సంవత్సరం తెలుగులో వెంకటేష్, మీనా, నదియా ప్రధాన పాత్రల్లో దృశ్యం… ప్రతి భాషలోనూ హిట్టే… కథలో ఆ దమ్ముంది… 2015లో కమల్‌హాసన్, గౌతమి, ఆశా శరత్ ప్రధాన పాత్రల్లో, అదే ఒరిజినల్ మలయాళ దృశ్యం డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే పాపనాశం పేరిట రీమేక్ చేశారు… అదే సంవత్సరం అజయ్ దేవగణ్, శ్రియా సరన్ ప్రధాన పాత్రల్లో దృశ్యం పేరుతోనే హిందీలో రీమేక్ చేశారు… అందులో టబు కూడా నటించింది… దర్శకుడు నిశికాంత్ కామత్…
2017లో ఈ సినిమాను ధర్మయుద్ధవ పేరుతో సింహళ భాషలోకి రీమేక్ చేశారు… జాక్సన్ ఆంథోనీ, దిల్హానీ ప్రధాన పాత్రలు… చెయ్యార్ రవి దర్శకుడు… అక్కడా హిట్టే… 2019లో చైనా మాండరిన్ భాషలోకి రీమేక్…ఇప్పుడు ఇండొనేషియన్ భాషలోకి… ఇలా మొత్తం ఏడు భాషలు… అందులో మూడు విదేశీ భాషలు… అసలు సిసలు పాన్ వరల్డ్ సినిమా అన్నమాట..!!
Share this Article