పొద్దున్నే ఓ ఆశ్చర్యం… అల్లు అరవింద్ ఓ దినపత్రికను స్టార్ట్ చేయబోతున్నాడని…! నిజానికి బయటి వ్యక్తులెవరో చేస్తున్న ప్రచారం కాదు, ఆహా వాళ్లు ఫేస్ బుక్ వాల్ మీద కనిపించింది… వావ్, ఒక్కో దినపత్రిక మూతపడుతూ, నడుస్తున్నవేమో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న దుస్థితిలో ఒక కొత్త దినపత్రిక వస్తుందనే ఊహ విస్మయాన్ని కలిగించింది…
అసలు ఆహా ఫేస్ బుక్ పేజీలో దాని డిస్క్రిప్షనే బ్రాడ్ కాస్టింగ్ అండ్ మీడియా కంపెనీ అని రాసి ఉంటుంది… వాళ్ల పోస్ట్‌లో ఇలా రాసి ఉంది… పొద్దున్నే ఒక చేతిలో కాఫీ, మరో చేతిలో పేపర్… ‘ఆహా’ ఆ ఊహే ఎంత బాగుందో కదా!!… అందుకే రాబోతుంది ‘ఆహా’ దినపత్రిక మీ ముంగిట్లోకి…
నిజమేనా..? లేకపోతే ఇందులో ఇంకేదైనా పబ్లిసిటీ మర్మం ఉందా..? అని సంశయం… సందేహం… తప్పదు, ఎందుకంటే, సినిమావాళ్లు ఇలా ప్రచార గిమ్మిక్కులు చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి… కాకపోతే ఆహా అనే ఓ మాస్ట్ హెడ్‌తో ఉన్న పత్రిక ఫోటో కూడా పెట్టారు… అది చూశాక డౌట్స్ ఇంకా ఎక్కువయ్యాయి… ఎందుకంటే..?
Ads
ఒక పత్రిక స్టార్ట్ చేయడం అంటే… డబ్బుండగానే సరిపోదు, సంకల్పం బలంగా ఉండాలి… ఆ దిశగా అడుగులు పడాలి… అసలు ఎడిటర్‌గా ఎవరు వస్తున్నారో తెలియదు, స్టాఫ్ రిక్రూట్‌మెంట్ వార్తలు వినిపించలేదు… ఏకంగా డమ్మీస్ కనిపిస్తున్నాయంటే అదీ సందేహానికి బలమైన కారణం… ప్రస్తుతానికి మార్కెట్‌లో సుశిక్షితులైన, మెరిటోరియస్ జర్నలిస్టులు లేరు… ప్రత్యేకించి డెస్కుల్లో పనిచేసేవాళ్లకు కొరత ఉంది… ఫీల్డ్ రిపోర్టర్లు కూడా దొరకడం లేదు…
గతంలో మీడియా సంస్థలు జర్నలిజం స్కూళ్లు నడిపేవి… తమ అవసరాల కోసం సిబ్బందికి తామే శిక్షణ ఇచ్చుకునేవి… ఇప్పుడు అది లేదు… ఈనాడు స్కూల్ నడుస్తున్నా సరే, వాళ్లు నవీన జర్నలిజంలో భాగమైన మొబైల్, డిజిటల్ జర్నలిజంలోనే శిక్షణ ఇస్తున్నారు… అసలు ప్రింట్ మీడియా అనేదే కనుమరుగవుతున్న ట్రెండ్… డిజిటల్, మొబైల్ జర్నలిజందే వచ్చే కాలం… పత్రిక నడిపించడం కూడా ఈరోజుల్లో చాలా కష్టసాధ్యం…
ఒకవేళ ఆహా దినపత్రిక నిజమే అనుకుందాం… అల్లు అరవింద్ బయాస్డ్ మెంటాలిటీ దృష్ట్యా దాన్ని రాబోయే తటస్థ పత్రికగా భావించలేం… అఫ్ కోర్స్, ఉన్న పత్రికలన్నీ ఏదో ఒక పార్టీకి బానిసత్వం చేస్తున్నవే… ప్రొఫెషనల్ పత్రిక అంటూ ఒక్కటీ లేదు… ప్రజారాజ్యంలో టికెట్ల దందాలో అల్లు పాత్రను మనం చూసిందే… పైగా పత్రికను డబ్బు లెక్కల్లో నడిపించలేం… సరే, అల్లు అరవింద్ పత్రిక జనసేనకు అనుబంధంగా పనిచేస్తుందా..? ఆల్‌రెడీ పవన్ కల్యాణ్ కోసం పనిచేసిన ఓ చానెల్ బీఆర్ఎస్ వైపు వెళ్లిపోయినట్టుంది… ఆంధ్రప్రభ ఓనర్లు జనసేనలో ఉన్నా, అది తూతూమంత్రం పత్రిక… అధికారంలో ఎవరుంటే వాళ్లకు డప్పు అనేది దాని నైజం…
అన్నింటికీ మించి అల్లు అరవింద్‌కు చిరంజీవి కుటుంబంతోనే సరైన సంబంధాలు లేవంటున్నారు ప్రస్తుతం… చిరంజీవి ఫ్యామిలీయే సొంతంగా సినిమాలు తీసుకుంటోంది… బన్నీ అండగా అల్లు అరవింద్ కూడా బాగా ఎదిగిపోయాడు… కాస్తోకూస్తో చిరంజీవి కుటుంబంతో సంబంధబాంధవ్యాల్ని మనం తేలికగా తీసిపారేయలేం కానీ పవన్ కల్యాణ్‌తో అల్లు అరవింద్‌కు పెద్ద సంబంధాలు ఏమీ లేవు… ఉండవు కూడా… మరి ఎవరి కోసం ఈ పత్రిక..? డబ్బు కోసమా..? ప్రస్తుతం పత్రికల ముద్రణ, నిర్వహణలో ‘‘డబ్బు రాబడి’’ ఏమీ లేదు… ఖర్చు తప్ప…!! అందుకని అల్లు వారి పత్రిక చుట్టూ అనుమానాలే బోలెడు…!!
ఒకటి చెప్పుకోవాలి… పత్రిక పెట్టగానే పొలిటికల్ లబ్ధి సమకూరుతుందనీ, విస్తృతంగా సర్క్యులేషన్ వస్తుందనీ, డబ్బు పుష్కలంగా వస్తుందనీ అనుకుంటే అంతకుమించిన భ్రమ మరొకటి ఉండదు ఈరోజుల్లో… ఈనాడు, ఆంధ్రజ్యోతి భీకరంగా డప్పులు కొట్టాయి ఏం లాభం…? గత ఎన్నికల్లో చంద్రబాబు మరీ 23 స్థానాలకు పడిపోయాడు… సాక్షి చందాదారుల్ని పెంచుకోవడం కోసం జగన్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది… అధికారంలో ఉండీ, మస్తు సాధన సంపత్తి ఉన్నా సరే, నమస్తేను బీఆర్ఎస్ పార్టీ లీడర్లే పెద్దగా చదవరు… పేపర్ మడతలు కూడా విప్పరు… అల్లు అరవిందూ వింటున్నావా..?! ఇవన్నీ కాదు, జస్ట్ ఆహా ఓటీటీ తన వ్యూయర్‌ను ఏప్రిల్ ఫూల్ చేస్తోంది అంటారా..? అంతకుమించిన దరిద్రపు ఆలోచన మరొకటి ఉండదు..!!!
ఆహా లాగే ఇందులో కూడా myhome పెట్టుబడి, బయటికి అల్లు మొహం ఉందని అనుకుందాం… Myhome కి ఎలాగూ టీవీ9 management చేతకావడం లేదు… అల్లుకి మీడియా చేతకాదు… బీజేపీ కోసం ఈ పత్రిక అనుకుందాం… చిన్న పత్రిక పెడితే బీజేపీకి ఫాయిదా ఉండదు… పెడితే సాక్షిలాగా దుమారంలా చుట్టేయాలి… అది జరగాలి అంటే 1500 కోట్ల పెట్టుబడి కావాలి… వీళ్లతో అవుతుందా… పైగా నష్టం తప్ప, లాభం సున్నా… ఈ ఖర్చుతో 10 టీవీ ఛానెల్స్ పెట్టుకోవచ్చు…!!
.
Update :: muchata story చూడగానే కొందరు ఇది ఏప్రిల్ ఫూల్ పోస్ట్ సార్ అని సమాచారం ఇచ్చారు… నిజంగానే ఇదంతా తూచ్, ఏప్రిల్ ఫూల్ స్టోరీ అని కన్ఫర్మ్ చేశారు… పరమ దరిద్రమైన ఫూలింగ్, prank పోస్ట్… బహుశా ఈ చెత్త fooling చేసిన మొదటి ott అనుకుంటా…
Share this Article