K C P D… పరమ నికృష్టమైన బూతుల్ని పరిచయం చేయడంలో తెలుగు సినిమా నెంబర్ వన్… ఎవరో పిచ్చి ఫ్యాన్స్ కేకలు వేసి, చప్పట్లు కొట్టి, తెర మీదకు రంగు కాగితాల పేలికల్ని విసిరేస్తే చాలు… వాళ్ల కోసం ఏ తిక్క పనినైనా చేస్తారు మన హీరోలు… అదొక పైత్యం, ప్రజలందరినీ కాదు, ఫ్యాన్స్ మెచ్చితే చాలు… దానికోసమే రొటీన్ ఇమేజీ బిల్డప్పులు, మాస్ మసాలా వెగటు యాక్షన్లు, బూతు పాటలు, కోతి గెంతులు, పంచ్ డైలాగులు ఎట్సెట్రా…
ఇప్పుడు నేలకొండ భగవంత్ కేసరి సినిమా వచ్చింది కదా… బాలకృష్ణ సినిమా… అసలు బాలయ్య అంటేనే ‘‘కౌగిలించుకోవడం, కడుపు చేయడం’’ బాపతు ధోరణి కదా… ఇటీవల ‘గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా’’ వంటి బజారు భాషను కూడా అలవోకగా మాట్లాడాడు… మరి మామూలు బ్లడ్డా, మామూలు బ్రీడా..? మాదచ్చోద్ పదానికి మాదాపూర్ వంటి పదాల్ని వాడుతూ పరోక్ష బూతుల్ని ప్రమోట్ చేయడం కూడా తనకు అలవాటే…
గువ్వ, మింగడం వంటి పరోక్ష బూతుల్ని తెలుగు టీవీలో ప్రమోట్ చేశాయి… ప్రత్యేకించి హైపర్ ఆది దీనికి బాధ్యుడు… ఒక సినిమాలో వాడే మాటలు గానీ, ఒక టీవీ కార్యక్రమంలో వాడే మాటలు గానీ ప్రేక్షకుల మెదళ్లకు వెంటనే బలంగా ఎక్కుతాయి… పైగా బూతులు… అసలే ప్రస్తుత జనరేషన్ నెట్ ట్రోలింగ్ బాపతు కదా… మర్యాద తొక్కాతోలూ ఏమీ ఉండదు వాళ్ల భాషకు… బూతుల్తో తిట్టేసుకోవడమే… వీటికితోడు ఏపీ పాలిటిక్స్ మరీ దారుణం… ప్రజాజీవితంలో ఉన్నామనే సోయి, సిగ్గూశరం లేకుండా బూతులు వాడేస్తున్నారు…
Ads
సో, సొసైటీ మీద వీటి ప్రభావం ఉంటుంది… బాలయ్య సినిమా రివ్యూలు, సోషల్ పోస్టులు, ఒపీనియన్స్‌లో చాలామంది కేసీపీడీ అని యథేచ్ఛగా వాడేస్తున్నారు… అంటే ఏమిటి..? పరమబూతు… బజారు భాష ఇది… కు- చిం- పా- దెం… కేసీపీడీ… అర్థం చేసుకొండి, ఇంతకుమించి వివరంగా రాస్తే సైటు మర్యాద అనిపించుకోదు… మన జనంలోకి ఈ పదం ఇంత బలంగా వెళ్లిందా అని ఆశ్చర్యం వేస్తోంది ఈ పదవాడకం చూస్తుంటే… ఎవడో సోషల్ మీడియాలో స్టార్ట్ చేస్తే, అది టీవీల్లోకి పాకి సినిమాల్లోకీ వచ్చి చేరింది…
నిజానికి గాడ్‌ఫాదర్ అనబడే చిరంజీవి మూవీ రిలీజ్ తరువాత ఈ పదం పాపులరైపోయింది… అప్పట్లో కేసీపీడీ అంటే కొణిదెల చిరంజీవి ప్యూర్ డామినేషన్ అని నిర్వచనం చెప్పాడు ఎవరో ఆ సినిమా బాధ్యుడు… ఖర్మ… తరువాత తనిష్ హీరోగా కేసీపీడీ అనే పేరుతోనే ఓ సినిమా స్టార్టయినట్టు వార్తలొచ్చినయ్… దానికి ‘కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్’ అని ఓ ట్యాగ్ తగిలించి మర్యాద రామన్న ముసుగు వేసుకున్నారు సదరు సినిమాా బాధ్యులు…
ఇప్పుడిక భగవంత్ కేసరి ట్రెయిలర్‌లోనూ ఆ పదం వాడారు… బాలయ్య సినిమా కదా, ఇలాంటివీ చల్తా అనుకున్నాడేమో దర్శకుడు అనిల్ రావిపూడి… తనే ఓ ట్వీట్‌లో ఓ కొత్త నిర్వచనం చెప్పి సినిమా ప్రమోషన్‌కు వాడుకోవడమే కాదు, బూతుకు ఓ ముసుగు కప్పాడు… కేసరి చిచ్చా పండుగ దావత్… కేసరి హీరో పేరు, శ్రీలీలకు తను చిచ్చా (బాబాయ్ పాత్ర), దసరా రిలీజ్ కాబట్టి పండుగ, దావత్ వంటి జోష్… అలా కవర్ చేశాడు అనిల్ రావిపూడి… యాణ్నుంచి వస్తార్ర భయ్ మీరంతా…
Share this Article