Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీషా మెడలే వంచాలనుకుని కేసీయార్ ఆడిన ఓ డ్రామా అది..!!

August 5, 2025 by M S R

.

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశాడు… దానికి కారణాలు, ఏ పార్టీలోకి వెళ్తాడనే అంశంకన్నా తను చెప్పిన రెండు వాక్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి…

‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేను సూత్రధారిని కాను, పాత్రధారిని మాత్రమే, కేసీయార్ చెబితే అక్కడికి వెళ్లాను, అంతే...’’

Ads

గుర్తుంది కదా… ఆ కేసు… ఎవరో గుర్తుతెలియని స్వాములను బీజేపీ పంపించి,, నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించినట్టు కావాలనే కేసీయార్ దర్శకత్వంలో ఓ స్కిట్ నడిపించాడు… తను ఏదో అనుకున్నాడు, చివరకు అట్టర్ ఫ్లాప్ అయ్యింది నాటకం… బాలరాజు వ్యాఖ్యలతో అదంతా కేసీయార్ నడిపించిన నాటకమే అని మరోసారి తేటతెల్లమైంది….

guvvala

మే 28, 2024 న ‘ముచ్చట’ రాసిన కథనం ఇదీ….



సుస్పష్టంగా తేలిపోతోంది… తన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని ఓ పెద్ద కేసు బిల్డప్ చేయడానికి కేసీయార్ చేసిన ప్రహసనం, నాటకం చాలా క్లియర్‌గా తేటతెల్లం అవుతోంది… ఫోన్ ట్యాపింగ్ నిందితులు నోళ్లు విప్పేకొద్దీ కేసీయార్ ఆడించిన కుటిల నాటకాలన్నీ బట్టబయలవుతున్నాయి…

లిక్కర్ స్కాం బయటపడగానే కవిత అవినీతి యవ్వారాలన్నీ బయటపడ్డాక… ఇక ఇది మెడకు చుట్టుకోకతప్పదని కేసీయార్ గ్రహించాడు… కేటీయార్, కేసీయార్ సహా బీఆర్ఎస్ నాయకులెందరో ఎన్నో వ్యవహారాల్లో జాగ్రత్తగా చక్కబెట్టుకుంటున్నా సరే, కవిత నిర్లక్ష్యంతో అడ్డగోలుగా ఇరుక్కున్న తీరు మీద నిజానికి కేసీయార్‌కు పీకల్దాకా కోపముంది… కానీ బిడ్డ బిడ్డే కదా…

ఏకంగా బీజేపీ మోడీ, అమిత్ షాల మెడలు వంచాలనే ఓ వికృత క్రీడకు సాహసించాడు… రోహిత్‌రెడ్డి బీజేపీలోకి టచ్‌లోకి వెళ్తే… (అదీ డౌటే) మిగతా ముగ్గురిని కేసీయారే ఆ యవ్వారంలోకి ప్రవేశపెట్టి… గతంలో రేవంత్‌రెడ్డిని వోటుకునోటు కేసులో పక్కాగా ఇరికించినట్టే బీజేపీ ముఖ్యులను ఇరికించాలని ప్లాన్ చేశాడు… మాంచి కెమెరాలు గట్రా బిగించాడు…

రంగం సిద్ధం చేశాడు… ఏవో పిచ్చి వీడియోలు రికార్డయ్యాయి తప్ప వాటిల్లో పంచ్ లేదు… మొహం పాలిపోయింది… డ్రామా ఫెయిలైంది… ఐనాసరే, కేసు పెట్టాడు, ఏకంగా ప్రత్యేక పోలీసులను పంపించి బీజేపీ ముఖ్యుడు బీఎల్ సంతోష్‌ను, కేరళలో ఉన్న మరొకరిని అరెస్టు చేయడానికి ప్రత్యేక విమానాలు వెళ్లాయి… వర్కవుట్ కాలేదు, కేసు సీబీఐకి వెళ్లిపోయింది…

kcr

డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి ఆ వీడియోలతో రచ్చ చేద్దామని విఫల ప్రయత్నం చేశాడు, తన కాళ్ల దగ్గర పారాడే తెలుగు మీడియా తను చెప్పినట్టు రాసింది… అన్ని రాష్ట్రాల సీఎంలు, అన్ని హైకోర్టుల జడ్జిలు, అన్ని పార్టీల అధ్యక్షులు, ముఖ్యనేతలకు ఆ వీడియోలను పంపించాడు కేసీయార్… అందరూ చిరాకుగా మొహాలు పెట్టి చెత్తబుట్టలో పడేశారు… ఓహో, ఇదా కేసీయార్ పరిణతి, పరిపక్వత అనుకుని నవ్వుకున్నారు…

సరే, ఆయన చేసిన వాటిల్లో ఇలాంటివి బోలెడు… కానీ కేసీయార్ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు డబ్బులిచ్చాడనీ బీజేపీకి తెలుసు… కేసీయార్ క్రెడిబులిటీ ఏమిటో తెలుసు… ఏకంగా మోడీ, షా మెడలు వంచే దుస్సాహసమూ తెలుసు… ఐనాసరే, సిగ్గు లేదు ఆ పార్టీకి… అఫ్‌కోర్స్, రాజకీయాల్లో సిగ్గేమిటి, శరమేమిటి గానీ… కానీ ఎవరిని నమ్మాలో, ఎవరిని చేరదీయాలో, ఎవరిని దూరం ఉంచాలో తెలియకపోతే ఎలా..?

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే బీజేపీ కేసీయార్ పట్ల సానుకూలంగానే ఉంది… పక్కా… రాష్ట్ర బీజేపీలో తను చెప్పిన మార్పులే చేసేందుకు కూడా దిగజారింది బీజేపీ… అందుకే జనం నమ్మకుండా కాంగ్రెస్ వైపు మళ్లారు… ఈ సిగ్గుమాలినతనానికి కారణం రాష్ట్ర బీజేపీ ముఖ్యులనే విమర్శ కూడా ఉంది…

అసెంబ్లీ ఎన్నికల్లో జనం భారీగా ఛీకొట్టేసరికి, మెడలు వంచాలనుకున్న కేసీయారే కాళ్లబేరానికి వెళ్లాడు… పొత్తు ప్రయత్నాలు చేశాడు, రేవంత్ కసితో మీదపడతాడని గ్రహించి, కనీసం బీజేపీ సపోర్ట్ కావాలని కోరుకున్నాడు… అచ్చం, చంద్రబాబులాగే… ఆ గురువు శిష్యుడే కదా… ఆ గురువునే శంకరగిరిమాన్యాలు పట్టించినవాడు కదా…

kcr

నువ్వూ వద్దు, నీ పొత్తూ వద్దు అని కేసీయార్ పొత్తు ప్రతిపాదనల్ని తిరస్కరించింది బీజేపీ, ఎట్ లాస్ట్ కళ్లు తెరుచుకున్నట్టున్నాయి… ఇటు ఇండికూటమికీ అర్థమైంది కేసీయార్ అంటే ఏమిటో… దాంతో అక్షరాలా కేసీయార్ ఇప్పుడు ఒంటరివాడు…

చివరగా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఎన్టీవీ చౌదరి తదితరులు, ప్రతిపక్ష నేతల ఫోన్లూ ట్యాపయ్యాయనేది చాలా చిన్న విషయం కేసీయార్ కోణంలో… సొంత అల్లుడు, వెంట తిరిగే సంతోష్ ఫోన్లే ట్యాప్ కాగా లేనిది… పత్రికలు, ప్రతిపక్షాలు ఎంత..?

చివరకు తన నీడ మీద కూడా స్పెషల్ నిఘా పెట్టించుకునే కేసీయార్ ఎవరినీ వదిలిపెట్టలేదు… ఈ పెడధోరణులన్నింటికీ జనమే చెక్ పెట్టారు… అవునూ, తనెంత ప్రమాదకారో ఇప్పటికైనా నిజంగా బీజేపీకి అర్థమైందా అనేది సందేహమే…! దానికీ కారణాలు, తార్కాణాలు బోలెడు..!!



…. ఇదీ ఆ పాత వార్త… ఐనా సరే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదనలు మళ్లీ బలంగా తెరపైకి వస్తున్నాయి… ముక్తాయింపు ఏమిటంటే…? ఏ కవిత కోసంకేసీయార్ ఈ స్కిట్ చేయించాడో… జాతీయ స్థాయిలో గాయిగత్తర లేపాలనుకున్నాడో… లక్ కలిసొస్తే ఏకంగా ప్రధాని కావాలనున్నాడో… ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు… ఆయన బిడ్డ కవిత కూడా తనకు దూరమైంది… తన మీదే తిరగబడుతోంది..!!

ఆ బీజేపీ సంతోషే ఇప్పుడు నిజంగానే target BRS BC leaders ఆపరేషన్ స్టార్ట్ చేశాడట..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ట్రావెల్ థెరపీ… సరదాగా చెప్పుకున్నా నిజముంది, ఫలముంది…
  • మోడీ దర్శించిన ఆ హిస్టారిక్ టెంపుల్ కథాకమామిషు ఏమిటంటే..!!
  • జయహో టెస్టు మ్యాచ్ సీరీస్… వన్డేలు, టీ20లకు దీటుగా ప్రేక్షకాదరణ…
  • Ramayana… a story for English readers and civil trainees..!!
  • ఢిల్లీలో ఫైట్‌కు రేవంత్ రెడీ..! కుదరదంటున్న బండి సంజయ్..!!
  • ఫేక్ జర్నలిస్టులపై మరి ప్రభుత్వ తక్షణ బాధ్యత ఏమీ లేదా..?
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని, నీచెల్లిని… నమ్మండి, తెలుగు పాటే..!!
  • మా ‘భాగ్య’ నగరానికేం తక్కువ..? చినుకు పడితే చాలు వెనిస్ నగరమే..!!
  • తమిళం, హిందీల్లో సక్సెస్… తెలుగు డ్రైవర్ బాబు మాత్రం స్లో రైడ్…
  • ఒక నమ్మకం… ఒక ప్రార్థన… ఒక ఆశ… అవే నడిపించే బలాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions