Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జయప్రదకు ముందే ఎన్టీయార్ మంజుల చీరెతో పాడుకున్నాడు..!!

July 2, 2024 by M S R

NTR తో ప్రముఖ నటి మంజుల జోడీగా నటించిన మొదటి సినిమా 1973 లో వచ్చిన ఈ వాడే వీడు సినిమా . అడవిరాముడులో జయప్రద చీరె ఆరేసుకోబోతూ పారేసుకుంది . ఈ మొదటి సినిమాలోనే మంజుల చీరెత్తుకుపోయి చీరె లేని చిన్నదానా చిగురాకు వన్నెదానా అని పాడుతాడు NTR . ఏదయినా ఆయనకే చెల్లు . ..

రొటీన్ స్టోరీ అయినా NTR ఉన్నాడు కాబట్టి 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . ఓ కోటీశ్వరుడి కొడుకును చిన్నప్పుడు ఓ దొంగ ఎత్తుకుపోతాడు . పిల్లలు లేని అతని భార్య ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తుంది . కోటీశ్వరుడి భార్య తన కొడుకు కోసం వెతికిస్తూనే ఉంటుంది . వాళ్ళ విలన్ మేనేజర్ నాగభూషణం NTR నే ఆమె కొడుకుగా తీసుకుని వస్తాడు . విలన్ కూతురు మంజుల సహాయంతో విలన్ ఆట కట్టించి వాడే వీడు , వీడే వాడుతో సినిమా ముగుస్తుంది .

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా శబరి పండరీబాయి తల్లి పాత్రలో పాడే పాటే ఎదుట నుంచి కదలను పదమునింక వీడను పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . ఈ పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసారు . దాశరధి వ్రాసిన అటు చల్లని వెలుగుల జాబిల్లీ ఇటు వెచ్చని చూపుల పాట , సి నారాయణరెడ్డి వ్రాసిన వయసే ఒక పాఠం వలపే ఒక పాఠం పాట , దేవులపల్లి వ్రాసిన మరో పాట నేటికి మళ్ళీ మా ఇంట్లో ఎంచక్కా పండగ పాట శ్రావ్యంగా ఉంటాయి .

Ads

NTR , మంజుల , కృష్ణంరాజు , నాగభూషణం , పద్మనాభం , శబరి పండరీబాయి , హేమలత , లీలారాణి , సంధ్యారాణి , చలపతిరావు , అల్లు రామలింగయ్య , రత్న ప్రభృతులు నటించారు . బహుశా ఈ సినిమా షూటింగ్ టైంలోనే లీలారాణి చనిపోయినట్లుగా ఉంది . టైటిల్సులో ప్రత్యేకంగా కీ.శే లీలారాణి అని ఆమె ఒక్క పేరే వేసారు . డి యోగానంద్ దర్శకుడు .

కాలేజి రోజుల్లో మా నరసరావుపేటలో చూసా . ఈమధ్య కూడా టివిలో వచ్చింది . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . NTR , మంజుల అభిమానులు వీక్షించవచ్చు . సరదాగా సాగే NTR సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…. By     డోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాపీ వీడియోల వడబోత సరే… కంటెంట్ స్టాండర్డ్స్ మాటేమిటి మరి..?!
  • హీరో మహేశ్ బాబును వదలని సాయి సూర్య ‘రియల్’ తలనొప్పి…
  • మార్ మత్ చోడో …. పండుగ సాయన్న కథలో కీలకమైన ట్విస్టు ఇదే…
  • ఆల్ ఇండియా ర్యాంకర్స్… ఆ సీన్… వివాదం పెరిగి దర్శకుడి క్షమాపణ…
  • కామాఖ్య గుడిలో తెలుగు నాయకుల భగాలాముఖి గుప్త పూజలు..!!
  • జీమూత భల్లుడు… తెలుగు సినీ మహానగరంలో ఓ మాయగాడు…
  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions