నిజానికి జీతెలుగులో స్టార్ నటి అంటే ఆషిక పడుకోన్… ది గ్రేట్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించే అత్యద్భుత విఠలాచార్య సీరియల్ త్రినయనిలో హీరోయిన్ ఆమె… అసలు ఆమె గాకుండా మిగతావన్నీ ఉత్తుత్తి వచ్చీపోయే పాత్రలే… ఆమధ్య మరణించిన పవిత్ర జయరాం పాత్రలోకి మరో కన్నడ నటి చిత్ర హలికెరి వచ్చింది, ఆమెలాగే అందగత్తే… కాకపోతే ఆ పవిత్ర స్థాయిలో క్లిక్ కాలేదు ఫాఫం… ఆ పాత పవిత్రకన్నా బాగానే చేస్తున్నా సరే…
త్రినయని మామ అలియాస్ హీరో తండ్రి… చాన్నాళ్ల నుంచీ అబ్‌స్కాండింగ్… రెమ్యునరేషన్ గొడవలో ఏమో, మొత్తానికి సీరియల్ నుంచి ఎత్తిపారేశారు పాత్రను… సహజమే కదా… వేల ఎపిసోడ్ల సీరియళ్లు, అందర్నీ సస్టెయిన్ చేయాలంటే కష్టం కదా… సరే, సీరియల్ పాత్రల కేరక్టరైజేషన్, కథ గురించి చెప్పుకోవడం వృథా… కథా రచయితకు రాత్రి ఏ కల వస్తే అది రాసిపారేస్తున్నాడు…
ఐనా సరే జనం చూశారు, చూశారు… చివరకు ఛీపో అని తిరస్కరించేశారు… ఈసారి తెలుగు వినోద చానెళ్ల టాప్ 30 ప్రోగ్రామ్స్ నుంచి ఎత్తిపోయింది… అంతేమరి, పాపం ప్రేక్షకుడైనా ఎన్నాళ్లు చూస్తాడు అలా… మరీ మూఢనమ్మకాలే ఆధారంగా సీరియల్ కదా… ఇదేకాదు, పరమ చెత్తా కథనంలో కునారిల్లిపోయిన ప్రేమ ఎంత మధురం సీరియల్‌ను ఎప్పుడో బయటికి విసిరికొట్టారు ప్రేక్షకులు… అదయితే మరీ ఘోరమైన సీరియల్… స్టార్ మా కార్తీకదీపం దర్శకుడికి ఏమైనా బంధువవుతాడో ఏమో ఈ దర్శకుడు… చివరకు జీతెలుగు టాప్ 30 లో కూడా లేకుండా పోయింది…
Ads
కాస్తోకూస్తో జీతెలుగులో పాపులర్ అవుతున్నది పడమటి సంధ్యారాగం సీరియల్… ఈసారి టాప్ 30 వినోద ప్రోగ్రామ్స్‌లో ఆ సీరియల్ ఒక్కటే జీతెలుగు ఖాతాలో కనిపించింది… నిజానికి జీతెలుగులో జగద్ధాత్రి కాస్త బాగున్నట్టుంది… క్రైమ్ యాంగిల్ ఉంది, ఆ హీరోయిన్ ఎవరో గానీ బాగానే చేస్తోంది… అఫ్‌కోర్స్, అమ్మాయిగారు, మేఘసందేశం, నిండు నూరేళ్ల సావాసం సీరియళ్లు కూడా పర్లేదు… ఎటొచ్చీ స్టార్ మా సీరియల్స్‌ను కొట్టలేకపోతున్నాయి జీతెలుగు సీరియల్స్…
జీతెలుగు యాజమాన్యం తమ క్రియేటివ్ టీం మార్చుకుంటే ఏమైనా ఫలితం ఉంటుందేమో.., మరీ విఠలాచార్య బాపతు సీరియళ్లు గాకుండా… అదే చెత్తా అత్తాకోడళ్ల సమరం బాపతు గాకుండా… కొత్త కథాంశాలు తీసుకుంటే స్టార్ మా సీరియళ్లను కొట్టొచ్చు… కానీ ఆ ప్రయోగాలు ఏవి..? ఆ అడుగులేవి..? అదే రొడ్డకొట్టుడు అత్తాకోడళ్లు, ఆడపడుచుల విలనీలు తప్ప…
టీవీ చానెళ్లకు సీరియళ్లే ప్రాణాధారం, మరి అందులోనైనా ప్రయోగాలు, క్రియేటివిటీ లేకపోతే మనుగడ ఎలా..? స్టార్ మా రీచ్ ఎక్కువే… రేటింగుల కోసం వాళ్లు ఏదైనా చేయగలరు… అలాంటి చానెల్‌ను కొట్టాలంటే అల్లాటప్పా ప్లానింగ్ సరిపోదు, స్టార్ మా సీరియళ్లలో బ్రహ్మముడి టాప్, తరువాత సరే, కార్తీకదీపం… కానీ గుండె నిండా గుడిగంటలు, సత్యభామ, చిన్ని రేటింగుల్లో ముందుకు పోతున్నాయి… సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏమిటి..?
ఈటీవీ సీరియళ్లు, జెమిని సీరియళ్లు దేనికీ పనికిరావు… అదేనండీ రేటింగుల్లో… ఈటీవీకి మళ్లీ మళ్లీ అదే ప్రైమ్ టైమ్ న్యూసే రేటింగుకు ఆక్సిజెన్… ఫాఫం… జెమిని టీవీని ప్రేక్షకులు మరిచిపోయారు కాబట్టి దాని గురించి చెప్పుకోవడం ఓ వృథా ప్రయాస..!!
Share this Article