Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేరే వాళ్లయితే చెప్పుతో కొట్టేదాన్ని… రోహిణీ కీప్ ద స్పిరిట్… #ISupportRohini…

July 13, 2024 by M S R

టీవీ కమెడియన్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… మంచి టైమింగు ఉన్న నటి… జబర్దస్త్, బిగ్‌బాస్ పుణ్యమాని కాస్త ఫీల్డులో నిలదొక్కుకుంటోంది… ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి… గుడ్…

ఈమధ్య ఓ వీడియో చేసింది… డ్రగ్స్ రేవ్ పార్టీలో దొరికినట్టు, పోలీసులకు ఏవో సాకులు చెప్పినట్టు, అబ్బే, నాకు పాజిటివ్ రాలేదు సార్ అని చెబుతున్నట్టు… బాగుంది వీడియో…

అయ్యో, దేవుడో, బాబోయ్, ఇంకేమైనా ఉందా, ఇది హేమను విమర్శిస్తున్నట్టుగా ఉంది, ఆమెను ఎదిరించి రోహిణి ఫీల్డులో ఉండగలదా, అసలే ఆమె హేమ, ఖతం, రోహిణి కెరీర్ ఫినిష్ అని బోలెడు విమర్శలు… అక్కడికి హేమ అనే డ్రగ్స్ నిందితురాలు టాలీవుడ్‌ను రూల్ చేస్తున్నట్టు…

Ads

ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు తెలుసు ఆమె ఏమిటో..! సరే, రోహిణి చేసిన ఓ వీడియో ఓ సినిమా ప్రమోషన్ కోసం ఉద్దేశించింది… మీడియా మొత్తం సరదాగా తీసుకుంది దాన్ని… కానీ ఎవరో జర్నలిస్టు అట… పేరు హన్మంతరావు అట… అవాకులు చవాకులు పేలాడట ఏదో వీడియోలో…

ఆమెకు ఏదో రోగముంది, నిప్పు లేనిదే పొగరాదు, ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది, అందుకే పోలీసులు పట్టుకున్నారు, సర్జరీ జరగడం వల్ల బరువు పెరిగింది, పెళ్లి కూడా చేసుకునే ఆలోచన లేదేమో అని పేలాడు… రోహిణి ఎక్కడో మండింది.,. సహజమే కదా…

ఒరేయ్, నువ్వు సీనియర్ జర్నలిస్టువు కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే వేరేవాడియితే చెప్పుతో కొట్టేదాన్ని అని మరో వీడియో విడుదల చేసింది ఆమె… మిగతా ఫిలిమ్ జర్నలిస్టులు సపోర్ట్ చేస్తారేమో… కాస్త గౌరవం కాపాడుకొండి… నేనయితే రోహిణిని సపోర్ట్ చేస్తున్నాను… జర్నలిస్టులం అని చెప్పుకునే ఇలాంటి కేరక్టర్లను ఖచ్చితంగా డిస్‌కార్డ్ చేయాల్సిన తరుణం ఇదే…

అసలు టాలీవుడ్‌లో కొందరు జర్నలిస్టులు… ప్రత్యేకించి ఇద్దరు ముగ్గురు తమ వెకిలి ప్రశ్నలతో, వెగటు ధోరణులతో ప్రెస్‌మీట్లను భ్రష్టుపట్టిస్తున్నారు… సినిమా పీఆర్వోలతో వాళ్లకున్న మంచి సంబంధాల వల్ల వేరెవరూ వాళ్లను వ్యతిరేకించలేని దురవస్థ… పైగా జర్నలిస్టులు అనే ఫోజులు… వాళ్లకు జర్నలిజం అంటే ఏమిటో మనం చెప్పలేకపోయినా..? ఒరేయ్, ఇది పద్ధతి కాదురా అని చెప్పాల్సిన నీచమైన పొజిషన్‌కు చేరుకుంటున్నారు… వారిలో ది ‘గ్రేట్ ’ జర్నలిస్టు కూడా ఉన్నాడట…

సరే, ఆ సైటు ఇష్టం, బహుశా ఆ జర్నలిస్టు లేకపోతే తమ సైట్ లేదనే దురవస్థలో ఉన్నారేమో… మెయిన్ స్ట్రీమ్‌లో అయితే ఇలాంటి జర్నలిస్టులను తక్షణం ఇంటికి పంపించేస్తారు… సినిమా పర్సనాలిటీలు అంటే ఏమన్నా పడేవారు అనుకుంటే వాళ్ల భ్రమ… ఇదుగో రోహిణి వంటి టెంపర్‌మెంట్ ఉన్నవాళ్లు తగిలితే …….. పోయేది అంతిమంగా జర్నలిస్టుల పరువే…!! ఇలాంటి చెత్తా జర్నలిస్టులను ఎంకరేజ్ చేసే పరమ భ్రష్టు చానెళ్లు ఉండనే ఉన్నాయి, అది వేరే దరిద్రం… #ISupportRohini

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విజయ్‌కు స్పేస్ ఎలా దొరికింది..? తమిళ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం..!!
  • మమత ఎందుకు ఓడిందంటే..? బెంగాల్ ఎలా విముక్తం అయ్యిందంటే..?
  • పుదుచ్చేరి..! బీజేపీ సౌత్ స్ట్రాటజీకి బ్లూప్రింట్… ప్రయోగం సక్సెస్…!!
  • కేరళం వామపక్షాన్ని తిరస్కరించడం వెనుక ఇవీ కారణాలు..!!
  • డెలివరీ ఆఫ్ ప్రజెన్స్… ఫుడ్ కాదు, పలకరించే గొంతుక కావాలి…
  • హిమంత హేట్రిక్… కాంగ్రెస్ స్వయంకృతం… ఇవీ అసలు కారణాలు…
  • మరదళ్లకు అక్క మొగుడు బావే కాదు… నాన్న కూడా..!
  • ఇద్దరూ అగ్రనటులే… ప్చ్… ఆ గ్రేట్ కాంబినేషన్ రేంజ్ మిస్సయింది…
  • Unsung Hero of IPL… భువనేశ్వర్ కుమార్… పక్కా పర్‌ఫామర్…
  • IPL 2026… తోపుల తోకలు కత్తిరించబడ్డయ్… పంజాబ్, హైదరాబాద్ ఓటమి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions