Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏసేశాడు… 2027 వరకూ నాగశోభిత సంసారబంధానికి ఢోకా లేదట…

August 9, 2024 by M S R

మొత్తానికి ఒక విషయంలో వేణుస్వామి సక్సెసయ్యాడు… తన జాతకం ఎవరికి చూపించుకున్నాడో గానీ… తనను దారుణంగా తిట్టేవాళ్లుంటారు… సమర్థించేవాళ్లూ ఉంటారు… తను చెప్పింది ట్రాష్ అని ఖండించేవాళ్లు ఉంటారు… జాతకమే చెబుతున్నాడు కదా, తప్పేముంది అనేవాళ్లూ ఉంటారు… కానీ తను ప్రచార తెర మీదే ఉంటాడు… నెగెటివో పాజిటివో తనను తాను భలే మార్కెటింగ్ చేసుకుంటాడు…

నిన్న నాగ చైతన్య, ధూళిపాళ శోభిత ఎంగేజ్‌మెంట్ కాగానే… రేపు వాళ్ల సంసార జీవితం ఎలా ఉంటుందో చెబుతాను అన్నాడు… అరెరె, ఇక ఏ సెలబ్రిటీ జాతకం బహిరంగంగా చెప్పను అన్నాడు కదా, మరిదేమిటి…? శుభమా అని వాళ్లు పెళ్లికి సిద్ధమవుతుంటే ఈ అపశకునం ఏమిటి..? అని విసుక్కునేవాళ్లు, ఇక జోరుగా తన మీద తిట్లు లంకించుకునే, లంఘించుకునే వాళ్లూ ఉంటారు… ఆల్రెడీ కత్తులు కటార్లు నూరుతూ ఉంటారు… పదును కోసం…

shobitha

Ads

సమర్థించినా, ఖండించినా… ఇంతకీ తనేం చెప్పాడు అనేది ఒకింత ఆసక్తికరం… తిట్టాలన్నా ముందుగా తనేం చెప్పాడో వినాలి కదా, చూడాలి కదా, చదవాలి కదా… ఓ వీడియో రిలీజ్ చేశాడు… ఏసేశాడు, మళ్లీ ఏసేశాడు… పలు కోణాల్లో శోభిత, చైతన్య జాతకాల్ని విశ్లేషించి, గుణించి, గణించి, పరిగణించి… చివరాఖరికి ఏం తేల్చాడయ్యా అంటే..? స్ట్రెయిట్‌గా చెప్పుకుందాం…

(ఇక్కడ జాతకాలు, గ్రహచారాలు, జ్యోతిష్కాల శాస్త్రీయత, విశ్వసనీయత, విశ్వాసాల జోలికి పోవడం లేదు… నమ్మేవాళ్లు నమ్ముతారు, నమ్మనివాళ్లు నమ్మరు…) (తను గతంలో అఖిల్ ఎంగేజ్‌మెంట్ నిలవదనీ చెప్పినట్టు గుర్తు… చైతన్య, సమంత విడిపోతారనీ చెప్పాడు… చైతన్య సంతానరాహిత్యం గురించీ చెప్పాడు…) ప్రస్తుతం తను రిలీజ్ చేసిన వీడియో లింక్ ఇదుగో…

https://www.facebook.com/reel/488302417473543

1. చైతన్య- శోభితల జాతకాల ప్రకారం ఈ పెళ్లి చాన్నాళ్లు నిలవదు… కానీ 2027 వరకు మాత్రం ఢోకా లేదు…

2. ఎంగేజ్‌మెంట్ ముహూర్తం 8.8.8 అనేది సంఖ్యాశాస్త్ర ప్రకారం వోకే కావచ్చుగాక, కానీ గ్రహస్థితి రీత్యా సరైన ముహూర్తం కాదు…

3. సమంతతో పోలిస్తే శోభిత పర్సనల్ కెరీర్ కూడా చాలా వీక్…

4. చైతన్య- సమంత పెళ్లికి జాతకరీత్యా వందకు 50 మార్కులొస్తే, ఈ ఇద్దరికి 10 మార్కులే…

5. ఒక స్త్రీ కారణంగానే మళ్లీ వీళ్లిద్దరి సంసారబంధానికీ ఒడిదొడుకులు తప్పవు…

6. శని దృష్టి, ఇద్దరి రాశులు, కళత్రస్థానం, షష్టాష్టకాలు, పుట్టిన తిథులు గట్రా ఇక్కడ చెప్పడం లేదు… తనే సుదీర్ఘంగా తన వీడియోలో వివరించాడు…

7. చివరగా… నా జాతకం ఫెయిల్ కావాలనే కోరుకుంటున్నాను, వాళ్లు బాగుండాలని… పెళ్లికి ముందే రిలీఫ్ మెథడ్స్ ఫాలో కావాలని కోరుకుంటున్నానని ఓ విట్టీ ట్విస్ట్ ఇచ్చాడు… కానీ ఒకసారి వాళ్లకు అలా జరగాలని రాసి ఉంటే, రాసిందే జరగడం నిజమైతే… ఉపశమన పూజలూ ఫలించవుగా అంటారా..? ఏమో… అదీ తననే అడగాలి ఈసారి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీడియా చానెల్ పై BRS దాడి, విధ్వంసం ఖండనీయం..!
  • ఏడాదిలో 19 మూవీలు… ఆల్‌టైమ్ రికార్డు… ఆలీ భలే గుర్తుచేశాడు ఈమెను మళ్లీ…
  • ఆ స్నైపర్ ‘వాలి’ మరణించాడా..? ‘వైట్ డెత్’ గురించి తెలుసా మీకు..?
  • మర్రిచెట్టు అరెస్ట్… 120 ఏళ్లుగా బేడీలతోనే… ఇలాగే ఓ బెంచీ కథ కూడా…
  • దర్శకుడికి స్వేచ్ఛ- నో కాంప్రమైజ్… మొదట్లో అదీ రామోజీ స్టయిల్…
  • NTR కొడుకుతో ANR … అదొక్కటే దీని విశేషం..!
  • ఫక్తు రొటీన్ మూస కథతో భానుప్రియ డబుల్ యాక్షన్
  • ఓ రబ్బరు బొమ్మ… ఏ లగ్జరీ బంకర్‌లో దాగున్నదో… ఎక్కడుందో… పెద్ద మిస్టరీ..!!
  • పోరాటశీల జర్నలిస్టు స్వేచ్ఛ వెళ్ళిపోయింది..!
  • ప్రభాస్ పాత్ర, క్లైమాక్స్… కన్నప్పను బలంగా నిలబెట్టాయి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions