Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజంగానే ఈ సినిమా మరో చరిత్ర..! బాలచందర్ ఏదైనా బ్రేక్ చేయగలడు..!

October 20, 2024 by M S R

మరో చరిత్రను సృష్టించిన మరో చరిత్ర సినిమా . వందల వందల సినిమాలలో నటించిన సీనియర్ స్టార్లకు మాత్రమే సినిమాలు వందల రోజులు ఆడే రోజుల్లో ఒక తమిళ జూనియర్ నటుడు , ఒక ‘సాదాసీదా సరికొత్త నటి నటించిన ఈ మరో చరిత్ర మద్రాసు , బెంగుళూర్లలో డబ్బింగ్ లేకుండా వందల రోజులు ఆడటమంటే మరో చరిత్ర కాక మరేమిటి ! చరిత్రలో అప్పటివరకు లైలా మజ్ను , సలీం అనార్కలి , రోమియో జూలియట్ కధలే విషాద ప్రేమ గాధలు . ఉదాహరిస్తే ఎన్నో గాధలు హృదయ విదార విషాద గాధలు . అలాంటి ప్రేమ గాధల్లోకి చేరింది బాలు- స్వప్నల మరో విషాద ప్రేమ చరిత్ర .

బాాలచందర్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి సినిమాను విషాదం చేయటానికి . విషాదం చేసి ఉండకపోతే ఇలాంటి మరో చరిత్ర సృష్టించి ఉండేది కాదేమో ! రంగుల సినిమాలు తెలుగు సినిమా రంగాన్ని ఆక్రమించుకుంటున్న సమయంలో బ్లాక్ & వైట్ సినిమా తీయటం , ఆ సినిమా మరో చరిత్రను సృష్టించటం మరో చరిత్రే నిస్సందేహంగా .

ఓ తమిళబ్బాయి , ఓ తెలుగమ్మాయి . ఇద్దరూ ఆ వయసులో సహజంగా ఉండే ధైర్యం ఉన్నోళ్ళే , దాన్ని మించి మొండోళ్ళు . ప్రేమంటేనే మొండితనం . అరవై ఏళ్ల వయసులో కొత్తగా ప్రేమించుకున్నా మొండిగానే ఉంటుంది ప్రేమ . అలాంటి ఇద్దరు యువతీయువకులు ప్రేమలో పడటాన్ని , వాళ్ళు ప్రేమించుకోవటాన్ని నలుపు తెలుపుల్లో , విశాఖ- భీమిలి- అరకు అందాల నేపధ్యంలో బాలచందర్ అద్భుతంగా ఆవిష్కరించారు .

Ads

యం యస్ విశ్వనాధన్ సంగీత దర్శకత్వంలో పాటలు 46 ఏళ్ల తర్వాత కూడా సూపర్ డూపర్ హిట్టే . ఏ తీగె పువ్వునో పాట సుశీలమ్మ పాడిందంటే ఆశ్చర్యమే . మధ్యమధ్యలో కమలహాసన్ అరవ పదాలు గమ్మత్తుగా ఉంటాయి . పదహారేళ్ళకూ నీలో నాలో , భలె భలే మొగాడివోయ్ బంగారు నాసామివోయ్ పాటల్ని బాల సుబ్రమణ్యం , యల్ ఆర్ ఈశ్వరి , జానకిలు ఇరగతీసేసారు . బాలసుబ్రమణ్యం ఇంగ్లీషులో ఎత్తుకోవడం వెరైటీగా ఉంటుంది . ఈ పాటలో కమలహాసన్ , సరిత డాన్స్ కూడా భలేగా చేస్తారు .

లిఫ్టులో పాడే పాట చాలా ఇంటరెస్టింగ్ . సినిమా పేర్లన్నీ కూర్చి ఆత్రేయ బాగా వ్రాసారు . లిఫ్టే అప్పటికి ఇంకా పాపులర్ కాలేదు . అలాంటి లిఫ్టులో పాట కుర్ర కారుకి మాంచి ఐడియా ఇచ్చేసారు . కుర్ర కారు ఆ ఐడియాను బాగానే అందుకున్నారు కూడా .

వాణీ జయరాం పాడే విధి చేయు వింతలను పాట హృద్యంగా ఉంటుంది . ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మరొకటి కూడా ఉంది . కమల్ హాసన్ శాస్త్రీయ నృత్యం . సాగరసంగమం సినిమా కన్నా ముందే ఈ సినిమాలో తన శాస్త్రీయ నృత్య పటిమను ప్రదర్శించారు . ఈ సినిమాలో పాటలను అన్నీ ఆత్రేయే వ్రాసారు . అద్భుతంగా వ్రాసారు .

ఈ సినిమాలో మరో గొప్ప పాత్ర సంధ్య . ఊరుమ్మడి బతుకులు సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న మాధవికి ఈ పాత్ర రావటం , ఆమె చాలా బాగా నటించటం వలన ఆమెకు తర్వాత కాలంలో మంచి అవకాశాలను తెచ్చిపెట్టాయి .

గణేష్ పాత్రో వ్రాసిన డైలాగులు ఈ సినిమా విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి . డొంక తిరుగుడు లేని straight dialogues . సినిమాలో పాత్రలన్నీ డొంక తిరుగుడు లేకుండా straight గా , మొండిగా , మూర్ఖంగా ఉంటాయి . హీరోహీరోయిన్ల తల్లిదండ్రులు , సంధ్య అన్న , హీరోయిన్ని ప్రేమించే పట్టాభి , మానభంగం చేసే విలన్ అందరూ మొండిగా , మూర్ఖంగానే ఉంటారు . ఒక్క మాధవి నటించిన సంధ్య పాత్రే సున్నితంగా ఉండేది .

161 మందిని ఆడిషన్ చేసాక అభిలాష అనే అమ్మాయి హీరోయినుగా ఎంపిక అయింది . ఆమే కొత్త నటి సరిత . హీరోయిన్ అంటే సన్నగా , నాజూగ్గా , ఎర్రగా , తెల్లగా ఉండాలనే ఫిక్సేషన్ని వదిలి , next door అమ్మాయి ఎలా ఉంటుందో అలాంటి అమ్మాయి సరితను ఎంపిక చేసుకున్నారు బాలచందర్ . ఆయన ఎంపిక కరెక్ట్ అయింది . మొట్టమొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న హీరోయిన్ లాగా నటించింది .

ఓ తమిళ నటుడు , ఓ అరవ దర్శకుడు తెలుగులో తీసిన ఈ సినిమా హిందీలో రీమేక్ చేస్తే అక్కడా హిట్టయింది . కమల్ హాసన్ జోడీగా రతి అగ్నిహోత్రి నటించింది . బాలసుబ్రమణ్యం పాడిన తేరె మేరె బీచ్ మే పాట సూపర్ డూపర్ హిట్టయింది . కన్నడం , మళయాళం , తమిళం భాషల్లో తీయబడింది .

ఈ సినిమాలో ఎర్ర హీరో మాదల రంగారావు ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు . ఇతర పాత్రల్లో రమణమూర్తి , మిశ్రో , జయవిజయ , పి యల్ నారాయణ , కాకినాడ శ్యామల , తదితరులు నటించారు . ఈ సినిమాలో సంధ్య అన్నగా నటించిన నటుడు పేరు నాకు తెలియదు . బాగా నటించాడు . అతని girl friend గా నటించిన నటి పేరు గుర్తుకు రావటం లేదు . ఇరగతీసింది .

ఈ తరంలో కూడా ఈ సినిమాను చూడని వారు ఎవరూ ఉండరు . ఒక్కొక్కరు పది సార్లయినా చూసి ఉంటారు . పోయిన వారం కూడా ఏదో చానల్లో వచ్చింది . యూట్యూబులో ఉంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)



ఈ సినిమాను హిందీలో ఎల్వీ ప్రసాద్ తీశాడు… విశేషం ఏమిటంటే సంగీత దర్శకులు లక్ష్మి కాంత్, ప్యారేలాల్ బాలసుబ్రమణ్యం హిందీ పాటలు పాడటానికి ఇష్టపడలేదు.., కేవలం బాలచందర్, పెద్ద ప్రొడ్యూసర్ L. V. ప్రసాద్ గట్టిగా చెప్పి వాళ్ళను ఒప్పించారు.., ఈ మాట బాలు స్వయంగా చెప్పాడు.., అప్పటి వరకు ఒక్క జేసుదాస్ తప్ప సౌత్ ఇండియా గాయకులు ఎవరు హిందీలో పాడలేదు.., బాలు పాడితే సౌత్ యాస ఉంటుందని ఆ సంగీత దర్శకులు చెప్పిన సాకు… వోకే, హీరో అరవం కదా, ఆ యాస ఉంటేనే ఆప్ట్ అని వాళ్లను ఒప్పించారు… తరువాత బాలు వందల పాటలు పాడి మెప్పించాడు హిందీలో… అది వేరే కథ…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొమ్మినేని అరెస్టు… పత్రికాస్వేచ్ఛ మీద ఓ సుదీర్ఘ తటస్థ విశ్లేషణ..!!
  • తెలంగాణ అంటే ఇక తాగుడేనా..? ఇవేం ముద్రలురా భయ్..?!
  • ఎలన్ మస్క్‌‌కు రాయునది ఏమనగా… కాస్త నేను చెప్పేదీ ఓసారి విను…
  • కృతి మహేశ్… లండన్‌లో ఫోరెన్సిక్ సైన్స్ పీజీ… ఇప్పుడు డాన్స్ ఫ్లోరే బతుకు…
  • జయమాలిని కేవలం మసాలా డాన్సర్ కాదు… ఫుల్ లెంగ్త్ రోల్ సుమలతలాగే…
  • ఆడదాని ఒళ్లు ఎఫెక్టివ్‌‌గా అమ్మగలగడమే సినీవ్యాపార సూత్రం..!!
  • ఆ దంపతులు నడిపితేనే.. నాటి రాజకీయ ప్రముఖుల విమానయానం…
  • జైన వెడ్స్ బ్రాహ్మణ… ఒక సంపూర్ణ సంప్రదాయిక పెళ్లి వేడుక…
  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions