Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శెభాష్ రోహిణీ… నువ్వు ఫ్లవర్ కాదు, ఓ ఫైర్… ఆడి గెలిచావ్…

November 23, 2024 by M S R

.

రోహిణి… గతంలో బిగ్‌బాస్‌ హౌజుకు వచ్చిందే… కానీ అప్పట్లో తన మార్క్ వేయలేక అర్థంతరంగా బయటికి వచ్చేసింది… అప్పటివరకూ ఓ నటి… తరువాత కామెడీ షోలలో అడుగుపెట్టింది… మంచి టైమింగ్…

స్టార్ కమెడియన్ అయిపోయింది… వెయిట్ మేనేజ్ చేయలేక, కాస్త స్థూలకాయురాలిగానే కనిపిస్తుంది… పలు సినిమాలు చేస్తోంది… టీవీ స్పెషల్ షోలలో, కామెడీ షోలలో చేస్తోంది… మళ్లీ వచ్చింది హౌజుకు…

Ads

ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా… తను అవినాష్‌తో కలిసి చేసిన స్కిట్లే కాస్తో కూస్తో ఈసారి బిగ్‌బాస్ షో మీద కాస్త ఆసక్తిని నిలిపి ఉంచాయి… అవినాష్ జోష్‌లో ఉండగా, ఇన్నాళ్లూ రోహిణి ఫన్ పాత్ర మినహా గేమ్స్, టాస్కులు ఇతరత్రా అంశాల్లో పెద్ద ఇంప్రెసివ్ అనిపించలేదు…

కానీ ఇప్పుడు చాన్స్ వచ్చింది… మిగతా కంటెస్టెంట్లలాగా ఎవరిదో సాయం తీసుకుని చీఫ్‌గా గెలవలేదు… ఫైటింగ్ స్పిరిట్‌తో గెలిచింది… ఆమె కాలికి అప్పట్లో ఫ్యాక్చరైంది… ఆ కాలితోనే రెండున్నర గంటలపాటు ఓ టాస్కులో కుండ కింద పడకుండా నిలబడి గెలిచింది… రోహిణి బలంగా నేనూ టాప్ ఫైవ్ జాబితాలో ఉంటాను అని చెప్పినట్టయింది…

ఒకవైపు రోహిణి గెలవకుండా చూడటానికి యష్మి ప్రయత్నాలు… ఇంకోవైపు నువ్వు ఓ జీరో, నీలో అసలు ఫైర్ ఉందా అంటూ విష్ణుప్రియ వెక్కిరింతలు… (అసలు విష్ణు ఇన్నాళ్లూ ఆటలో ఉండటమే పెద్ద జోక్)… ఇంకోవైపు బాడీ షేమింగ్ తరహాలో అసలు పరుగెత్తగలవా అంటూ పృథ్వి… (బహుశా ఈ మెంటల్ కేసుకు రేపు సండేతో విముక్తి లభించవచ్చు…)

rohini

ఈ వెక్కిరింతలు, బలమైన పోటీ నడుమ విష్ణు బండారం బయటపెడుతూనే… మరోవైపు కసిగా ఆడి గెలిచిన తీరు బాగుంది… ఈ చివరి చీఫ్ టాస్క్ పోటీ రక్తికట్టింది… యష్మి, పృథ్వి ఎప్పుడూ నామినేషన్లలో ఉంటారు… ప్రతిసారీ గెలుస్తారు… నిలబడతారు…

యష్మి మీద నెగెటివిటీ ఉంది కానీ ఆమెలో ఫైర్ ఉంది… దేన్నీ తేలికగా వదిలేయదు… పృథ్వి దూకుడు, ఆవేశం, మాటలు బేకార్… ఐనాసరే ఇన్నేళ్లు విష్ణు- పృథ్వి లవ్ ట్రాక్ కోసమో మరేమిటో గానీ బిగ్‌బాస్ సపోర్ట్, ప్రేక్షకుల సపోర్ట్ కూడా ఉంది… ఈసారి ఇక తప్పకపోవచ్చు… తనదే లీస్ట్ వోటింగ్..,

పోనీలే ఈ వారం కూడా పృథ్విని కాపాడదాం అని బిగ్‌బాస్ అనుకుంటే యష్మి సూట్‌కేస్ సర్దుకోవాల్సిందే… అంతా వాడి స్క్రిప్టే కదా… ఎప్పటిలాగే నబీల్, నిఖిల్, ప్రేరణ… ప్రేక్షకాదరణతో సేఫ్… అర్హులే… ఏమో… సీజన్ ముగుస్తోంది కదా… యాష్మి అండ్ పృథ్వి ఇద్దరూ వెళ్లిపోవచ్చు కూడా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions