.
తమన్నా లాంటి హీరోయినే రా రా రావాలయ్యా అని వల్గర్ బాడీ లాంగ్వేజీతో డాన్స్ అనబడే స్టెప్పులేస్తుండగా లేనిది సమంతలు, శ్రీలీలలు చేయరా ఏం..?
అందుకే పుష్ప-2 కోసం కిస్సు కిసుక్కు అని ఏదో ఆడింది శ్రీలీల… ఆమె మంచి ఎనర్జీ ఉన్న డాన్సర్ కాబట్టి గణేష్ మాస్టర్ చెప్పిన స్టెప్పులు బాగానే వేసింది అలవోకగా… ఆమె పక్కన పుష్పరాజ్ అలియాస్ బన్నీ ఎలాగూ గ్రేస్ అప్పియరెన్స్…
Ads
మిగతా బీజీఎం తాలూకు సంగీతం వివాాదాల సంగతి పక్కన పెడితే… ఎలాగూ ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ ట్యూనే… ఇది మరీ కిర్రెక్కించేలా లేదు, అలాగని తీసిపారేసేది కూడా కాదు… జస్ట్, వోకే… కిసుక్కు సరే, అంత కసక్కు పాటయితే కాదు…
లిరికల్ వీడియో అని రిలీజ్ చేశారు కదా… అసలు అవి లిటరల్ లిరిక్సా..? అఫ్‌కోర్స్, సినిమా పాటల్లో సాహిత్యం ఏముంటుందిలే అనుకుని తేలికగా తీసిపడేయలేం కదా… సుకుమార్, బన్నీ ఆశించినట్టుగా చంద్రబోస్ మాంచి కిక్కెక్కించే, కిర్రెక్కించే… కనీసం తనే రాసినట్టు కిస్సెక్కించే సాంగ్ రాయలేక పోయినట్టు అనిపించింది…
తప్పకుండా ఒక పోలిక వస్తుంది… గతంలో మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి పాడిన ఊ అంటావా మామా ఊఊ అంటావా మామా సాంగ్ ఓ బంపర్ హిట్… కొన్నాళ్లు ఎక్కడ చూసినా అదే పాట… అది రాసింది కూడా చంద్రబోసే… కానీ మగవాళ్ల అసలు తత్వం ఇదీ అంటూ ఓ గ్రంథసాంగి సింగుకునే సాంగ్… పర్లేదు, అది కుదిరింది… సమంత కూడా బాగానే చేసింది ఊ అంటూ ఊఊ అంటూ…
(shubhlakshini)
ఎటొచ్చీ ఇప్పుడు రాసిన కిసుక్కు పాటే ఏ రీతిలోనూ లేదనిపించింది… పాడింది ఫేమస్ తమిళ గాయని శుభలక్షిణి… ఇంద్రావతి గొంతులో పలికిన ఎక్స్‌ప్రెషన్స్ శుభలక్షిణి గొంతులో పలకలేదు… అసలు పాటలోనే దమ్ములేక కావచ్చు…
ఇందులో కిస్సు కిసుక్కు అంటే ఫోటో తీసినప్పుడు వచ్చే సౌండ్… ఆమె పాట ఎత్తుకోవడమే దించు దించు, మావొచ్చాడు, బావొచ్చాడు, మచ్చా వొచ్చాడు, ఎవరొచ్చినా సరే కిసుక్కు, దించు అంటుంది… అదంతా ఓ మార్మికంగా ఏదో చెబుతున్నట్టు మొదట్లో అనిపిస్తుంది (ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఎవరొచ్చినా రెడీ రెడీ అనే దాసరి పాట గుర్తుందా..?)
కానీ ఈ పాట సాగేకొద్దీ అది ఫోటోలపైనే సాగుతుంది… అలా చేయకు, ఇలా చేయకు లేకపోతే దెబ్బలు పడతాయిరో అని చెబుతూ ఉంటుంది శ్రీలీల… అదే ఐటెం సాహిత్యమో… ఏదైనా టీవీ మ్యూజిక్ కంపిటీషన్ షోలో చంద్రబోసే వివరణ ఇవ్వాలి…
ఊ అంటావా ఊఊ అంటావా పాట మగవాళ్ల తత్వాన్ని కించపరిచేలా ఉందని అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చాయి గానీ అవి డొల్ల విమర్శలు… ఎవరూ పట్టించుకోలేదు… కానీ మరీ ఈ దించు (గూఢార్థం ఏమీలేదు) పాట, దెబ్బలు పడతాయిరో అనే పాట మాత్రం అటూఇటూ గాకుండా ఉండిపోయింది… మీరిలాగే రాస్తే మ్యూజిక్ చేస్తే మాత్రం దెబ్బలు పడతాయి అని బన్నీ, సుకుమార్, డీఎస్పీ గట్టిగా హెచ్చరించి ఉంటే బాగుండేదేమో..!!
Share this Article