.
Prasen Bellamkonda …….. ఒకానొక ‘hip’ocricy గురించి.. దబిడి దిబిడి పృష్టఘాతాల్లో నాకైతే ఇంత రభస చెయ్యాల్సిందేమీ కనపడట్లేదు. ఎందుకంటే…
శ్రీదేవి బ్లవుజు అనిపించే బ్రా లాంటి బికినీ టాప్ పీలిక నొకదాన్ని ధరించి నిలబడితే నటశేఖర కృష్ణ వచ్చి అరచేయిని ఆమె స్థనద్వయం మీద వేస్తాడు. శ్రీదేవి కొంచెం కిందకు వంగుతుంది. కృష్ణ కూడా చేతిని కిందికి జరిపి మళ్ళీ అక్కడే వేస్తాడు. అయితే ఆ అరచేతికి స్థనద్వయానికి మధ్య ఒక పారదర్శక అద్దం ఉందన్న సంగతి మనకు దర్శకుడు రాఘవేంద్రరావ్ ఒక రెండు సెకన్లు ఆలస్యంగా చూపిస్తాడు. ఇది వజ్రాయుధం అనే సినిమాలో.
Ads
సినిమా కొండవీటి దొంగ. చిరంజీవి, విజయశాంతి ప్లస్ గ్రూప్ డ్యాన్సర్లు పొడవాటి కర్రలతో ఓ పాటకు గెంతుతుంటారు. చిరంజీవి తన చేతిలో కర్రతో విజయశాంతి బొడ్లో సుతారంగా పొడుస్తుంటాడు. కెమెరా ఆ పోట్లను జూమ్ లో క్యాచ్ చేసి విజయ శాంతి హావభావప్రాప్తుల మీదకు ఫోకస్ అవుతుంది.
హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు ఎవరిదైనా సరే పృష్టము చూస్తే చాలు ఒక్కటేయ్యాలనిపిస్తుంటుంది. ధ్రువీకరణ కోసం రమ్య కృష్ణ హిప్సిక గా మారి అతనితో కొట్టించుకుంటుంటుంది.
రగులుతోంది మొగలిపొద పాటలో చిరంజీవి మాధవిది అచ్చంగా కొక్కోకం కోరియోగ్రఫీయే .
వసంతకోకిల లో ఊరించే వయసిది పాటలో కమల్, సిల్క్ వి అన్నీ రతి భంగిమలే.
ఇవి శాంపిల్. ఇంకా చాలా వున్నాయి.
ఇన్ని ఇంత విపులంగా చూసిన తెలుగు ప్రేక్షకుడిని…
ఎర్రిపుల్కా, మింగేయ్ లాంటి సరదాల వ్యసనపరుడిని.. ఇప్పుడు దబిడి దిబిడి లో ఇండీసెన్సి ఉందని నిద్రలేపాలని చూడడం తోటకూర నాడు కాక బందిపోటయ్యాక సుద్దులు చెప్పడం కాదూ…
ఇదంతా కొక్కోకం కోరియోగ్రఫీ అన్నాను కదా… సైడ్ బై సైడ్ మన పాటల్లోని లిరికల్ నీలి జ్ఞానాన్ని కూడా మీకు ప్రసాదిస్తాను వినుండ్రి…
#
ఒకానొక పాత పోస్టు…
#
ఓరోరి యోగి నన్ నలిపెయ్రో
ఓరోరి యోగి నన్ పిసికెయ్రో
ఓరోరి యోగి నన్ చిదిమెయ్రో
ఓరోరి యోగి నన్ కుదిపెయ్రో
మరేం చేస్తాడు వాడు డెబ్బయ్యేళ్ళ ముసల్దనీ చూడకుండా నలిపి చిదిమి కుదిమేసిండు
#
పూలదుకాణం దాటి
పాలడిపో మీదుగా
అట్టట్టా దిగివస్తే
అక్కడెఅక్కడె మా ఇల్లు..
వాడిదేం తప్పు జడలో పూలు దుకాణం అనీ
పాలడిపో అంటే స్థన్యం అనీ
దిగివస్తే ఇంకేదో ఉంటదనీ తెలుసుకోవడానికి తొమ్మిదేళ్ళ అమ్మాయే అని కూడా చూడకుండా ఆ ఇంటికోసం వాడు వెతుక్కున్నాడు.
#
కొబ్బరి పెడతావో,
అరిచి బొబ్బలు పెడతావో..
నీకు సాయంగుంటా
నీకు బోలెడు అది ఉంది,
నాకు బుట్టెడు ఇది ఉంది.
ఎత్తిపోతల పదునుంది,
ఉక్కపోతల పనిఉంది.
మత్తులో గమ్మత్తులో ముంచెత్తాలి
నేడే తేనెల్లో ఈదిఈది
చాటుల్లోమాటుల్లో ఆడే ఆటల్లోనా
మారాలి తేలితేలి
వాడ్నని ఏం లాభం బోలెడు అది వుందని నమ్మి బుట్టెడు ఇదికోసం ఎత్తిపోతల పదును ఉక్కపోతల పనుల కోసం
అమ్మలోకీ చెల్లిలోకీ చూసేసాడు
#
ఓ టెన్నీసు బంతుల పాపా
నీ బంతులకంతటి ఊపా?
అది అత్తిలి తోటల కాపా?
నీ గుత్తుల సోకుల తీపా?
నువ్వెత్తి చూపే ప్రైజు
కుర్రకారుకు గ్లూకోజు….
నైటు డ్యూటి నర్సు
కనిపెట్టినాది పల్సు
ప్యాంటూడదీయమంది
పొడిచింది పెద్ద సూది.
వాడిదేమి నేరము ..టెన్నిస్ బంతులేంటో తెలియదాయె గుత్తులేంటో ఎర్కలేకపాయె కాపేంటో పాంటిప్పి గుచ్చుడేందో నేర్చుకునేందుకు తొమ్మిది నెలల పాప అనికూడా సోయి రాకపాయె..
#
గడపనా నీతో గంటల కొద్దీ..
అయ్ బాబోయ్ ఆ తరువాతేమైపోద్దీ..
అయిదే నిమిషాలైనా అది సరిపోద్దీ..
ఆశదోస అప్పడం ఇది యేం బుద్ధి….
ఝుం ఝుం మాయో..
వాడ్నని ఏం ప్రయోజనం
గంటలకొద్దీ గడపడమేమిటో
అయిదే నిముషాలలో అయిపోవడమేమిటో
తెలుసుకోవాలని కూతురులోనే కోరికను చూసుకున్నాడు..
#
గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా
అమ్మనడిగితే ఊహూ అంది,
అల్లుడింటికే పోపో అంది
నోట్లో ఉంది కొబ్బరి చెక్క బెట్టుబెట్టుగా
రోకలిపడితే లొంగుతుంది బిట్టు బిట్టుగా
అత్తనడిగితే నవ్వేసింది..
మరదలింటికే పోపో అంది
ఎవర్నైనా ఏమని మాత్రం ఏం చేస్తాం..రోకలి బిట్టుబిట్టుగా కొట్టడం,తొక్క తీయడం గింజ ఒలవడం ఒంపులన్నీ కసికసిగా చూడడం అంటే ఏమిటో , అత్తని ఏమి అడిగాడో మరదలి దగ్గరికి దేనికోసం పొమ్మందో…రహస్యం తెలుసుకోవాలని ఒత్తిడి చేస్తే ఎవరైనా ఏం చేస్తారు..
వావి వరుసలు మర్యాదలు భయాలు వదిలేయడం తప్ప
#
నీకు కాశ్మీరు ఆపిల్స్ లేవా?
అరే పాలకొల్లు బత్తాయిలు లేవా?
పాలముంతలు నీకు పరువంగా చేయిస్తి…..
పండుకోయగలవా?
దాని తొక్క తీయగలవా?
తొక్కలా బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా?
పక్కలో మగ దిక్కునై రసముక్కు తీర్చగలనే
అబ్బ నన్నేం చేస్తాడొ ఈ పిల్లోడు..
లంకె బిందెల్లో పాలే పోసి తోడేస్తాడు…
బిందె నిండిపోయిందంటూ
బరువు మొయ్యలేవంటూ
సాయం చేస్తే తప్పేమంటాడు?
సాయమేమి కాదు చెయ్యి కొంత జరిపి నడుముకు పైనే ఆడిస్తాడు….
పాలముంతలు కాశ్మీర్ ఆపిల్స్ అంటే ఏమిటో మగదిక్కు తీర్చడం పక్క లో తొక్కలేమిటో సందులో అర్ధరాత్రి గోకడమేమిటో తెలుసుకోవాలనే ఆత్రం ఎవరికి మాత్రం వుండదూ..
#
గట్టి ఒత్తిళ్ల కోసం గాలి కౌగిళ్లు తెచ్చా,
తొడిమ తెరిచే తొనల రుచికే ఓహోహో…అట్టంటే నా కోడి కూసేస్తది,
చిట్టింటి నీ గింజ మేసేస్తది……
సిగ్గు గుత్తి తెంచాడు,
టెంటు మీద బాంబేసాడు..
వాడు మాత్రం ఎంత నిస్సహాయుడు పాపం.. పచ్చిగా బూతు తప్ప ఇంకో అర్ధంలేని తెరమీదనుంచి అందమైన అమ్మాయిలు మెరుపు దేహాలతో తియ్యని సంగీతంతో కనుసైగలు చేస్తుంటే మన మధ్యే తిరుగుతూ మన అమ్మాయిల్ని కుప్పలు తెప్పలుగా చెరిచేసి చంపేయడం తప్ప ఏం చేయగలడు పాపం.
ఇవి శాంపిల్. ఇంకా చాలా ఉన్నాయి.
.
.
.
మళ్ళీ అడుగుతున్నాను…
ఇన్ని ఇంత విపులంగా చూసిన తెలుగు ప్రేక్షకుడిని…
ఎర్రిపుల్కా, మింగేయ్ లాంటి సరదాల వ్యసనపరుడిని.. ఇప్పుడు దబిడి దిబిడి లో ఇండీసెన్సి ఉందని నిద్రలేపాలని చూడడం తోటకూర నాడు కాక బందిపోటయ్యాక సుద్దులు చెప్పడం కాదూ…
Share this Article