.
ఏపీ మేధావుల సంఘం నేత Chalasani Srinivas లాగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద, ఓ తీవ్ర వ్యతిరేక భాష, భావజాలంతో… ఉభాజపా వంటి పదాల్ని వాడుతూ రాయలేను గానీ… రైల్వే బడ్జెట్ మీద తను వ్యక్తపరుస్తున్న పాయింట్లతో ఏకీభవిస్తున్నాను…
కొంత డైల్యూట్ చేసి చెప్పుకుందాం…. ‘‘తెలంగాణకు రైల్వే బడ్జెట్ లో రికార్డు కేటాయింపులు, బొనాంజా అంటా..! పెరిగిందేమో కోటి, గుజరాత్ కి పెరిగింది ఏకంగా 8743 కోట్లు… అయినా సరే మీడియా అడ్డంగా భజన చేయడానికి సిగ్గుపడటం లేదా?
Ads
అసలు పదేళ్ల క్రితం కేటాయింపులతో, అదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులతో పోల్చడమే అబ్సర్డ్… అసలు అదేం ప్రాతిపదిక..? రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓవర్ స్మార్ట్… అనగా అతి తెలివి… వయోవృద్దులకు, జర్నలిస్టులకు గట్రా రాయితీలకు కత్తెర వేసిన ఈ బ్యూరోక్రటిక్ నాయక మేధావి పనితీరే ప్రజావ్యతిరేకం… వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తని మోడీ వీరవిధేయుడు…
ఎవడైనా సరే, గత కేటాయింపులతో పోల్చి, ఫలానా రాష్ట్రానికి ఈమేరకు కేటాయింపులు పెంచామనో, మరొకటో చెప్పుకుంటారు… అది కామన్ సెన్స్… కానీ ఈ మంత్రి యూపీయే హయాంలో కేటాయింపులతో పోల్చుతున్నాడు… అదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయింపులతో… ఇక్కడ విషాదం ఏమిటంటే… రైల్వే మంత్రి, రైల్వే అధికారులు చెప్పే వివరాలను మీడియా ఆహా ఓహో అని రాసిపారేయడం, నిజాన్ని పట్టించుకోకపోవడం…
5337 కోట్లు అంటే…. ఒక కోటి మాత్రం తెలంగాణకు గతం కంటే ఎక్కవ కేటాయించింది కేంద్రం.., ఈసారి తమ గుజరాత్‌కు భయంకరంగా కేటాయింపులు పెంచింది… అది 8743 కోట్లు ఎక్కువ, అంటే మొత్తం 17155 కోట్లకు పైగా ఇచ్చుకుంది…
తెలంగాణకి మెట్రో, ఇతర కొత్త ప్రాజెక్టులకు విడిగా కనీసం 3000 కోట్లు కేటాయిస్తారు అనుకుంటే దాదాపుగా మొండిచేయి… ఏపీకి మెట్రోకి 2700 కోట్లు, అమరావతి రైల్వేకి 2400 కోట్లు అనుకుంటే గాల్లో దీపం పెట్టారు…
అహ్మదాబాద్ మరియు భుజ్ మధ్య ఇటీవల ప్రారంభించిన నమో భారత్ రాపిడ్ రైలు మాదిరిగానే, మరో 50 నమో భారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు మరియు 200 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు… పెద్ద పీట ఉత్తరాది రాష్ట్రాలకి…
2379 కోట్లు ఏకంగా ఒక్క అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ కి కేటాయించుకుని దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించింది మోడీ గారి కేంద్ర ప్రభుత్వం… గుజరాత్‌లో 2,739 కి.మీ కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరిగిందని, ఇది డెన్మార్క్ మొత్తం రైల్వే నెట్‌వర్క్‌ను అధిగమించిందని వైష్ణవ్ గర్వంగా ప్రకటించారు..
మహారాష్ట్రకు ₹23778 కోట్లు పందేరం చేశారు..! ఏపీకి 9417 కోట్లు అంటే క్రితం సంవత్సరం కంటే కేవలం 278 కోట్లు మాత్రం అదనంగా ఇచ్చిన డబుల్ ఇంజన్ సర్కార్, డబ్బుల ఇంజన్, ఓ హక్కుగా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సిన రాయితీలు మాత్రం గుజరాత్ కి తరలించి వేస్తున్నది…
గుజరాత్ కి వేసుకుంటున్న ఆ బుల్లెట్ రైలు కోసం ₹19000 కోట్లు + ఈ సంవత్సరంతో కలుపుకుని మొత్తం మూడు సంవత్సరాల్లో 57 వేల కోట్ల రూపాయలు పైగా గుజరాత్‌కే కేటాయించుకున్నది కేంద్ర ప్రభుత్వం కాదా? గుజరాత్ మాత్రమే కాదు, దేశంలో చాలా రాష్ట్రాలున్నాయని గుర్తుందా మోడీ సాబ్..?
గుజరాతీ మీడియా డప్పులు కొడుతుంది, కానీ తెలుగు మీడియాకు ఆ చిడత భజన దేనికి..? విశ్లేషణ ఎందుకు చేతకావడం లేదు..? ఏపీలో ముఖ్యమైన రాజకీయ నాయకులు బానిసలుగా మారిపోయి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని ఏ విధంగా తాకట్టు పెట్టారో స్పష్టంగా కనబడుతుంది…
మరి తెలంగాణ ముఖ్యనేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కేటి రామారావు తదితరులకు ఏమైంది..? బీజేపీ నేతలకు మాట్లాడటానికి మొహాలు చెల్లవు సరే, మరి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు ఏమైంది..? ఈ మౌనాల వెనుక మర్మమేమిటి సార్లూ..!?
Share this Article