Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘నువ్వు నా కోడి పీక మీద కన్నేస్తే… నీ రెండు కోడి పీకలూ పిసికేస్తాం…’’

May 26, 2025 by M S R

.

ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రుల్లో ప్రత్యర్థులపై పంచ్ ట్వీట్లు సంధించడంలో దిట్ట అస్సోం సీఎం హిమంత విశ్వశర్మ… దేశానికి సంబంధించిన ఇష్యూస్, బీజేపీ విధానాల సమర్థనలో కూడా… ఈ టెంపర్‌మెంట్ ఇతర బీజేపీ సీఎంలలో కనిపించదు…

ప్రత్యేకించి కాంగ్రెస్ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ కొడుకు, లోకసభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగొయ్ మీద విరుచుకుపడుతున్నాడు… తను ఐఎస్ఐ ఏజెంట్ అనేది సీఎం ఆరోపణ… ఇప్పటికీ ఆయన భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్ సీడీకేఎన్ అనే సంస్థ నుంచి జీతం తీసుకుంటోందనీ, అది ఐఎస్ఐ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అనీ, గౌరవ్ పిల్లలకు ఈరోజుకూ ఇండియన్ పౌరసత్వం లేదనీ అంటాడు…

Ads

తరచూ పాకిస్థాన్ ఎందుకు వెళ్తున్నావు, పాకిస్థాన్ హైకమిషనర్‌ను ఎందుకు కలుస్తున్నావు..? నీ భార్యకూ పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్ సలహాదారుగా పనిచేసిన పాకిస్తాన్ జాతీయుడు అలీ తౌకీర్ షేక్‌కూ నడుమ సంబంధాలు ఏమిటనీ ప్రశ్నించాడు…

ఎలిజబెత్

ఇంతకీ ఎవరామె..? స్వతహాగా యూకే పౌరురాలు… అంతర్జాతీయ వ్యవహారాలలో బలమైన విద్యా నేపథ్యాన్ని కలిగి ఉంది… ఆమె ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుండి అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో మాస్టర్స్ డిగ్రీని పొందింది…

మార్చి 2011, జనవరి 2015 మధ్య క్లైమేట్ అండ్ డెవలప్‌మెంట్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (CDKN)తో కలిసి పనిచేసినప్పుడు పాకిస్థాన్‌లో కూడా క్లైమేట్ వ్యవహారాల అధ్యయనం చేసేది… ఈరోజుకూ సంస్థతో సంబంధాలున్నాయి, పెళ్లయ్యాక కూడా పాకిస్థాన్ వెళ్లింది, అంతా సందేహాస్పదమే అంటాడు శర్మ… ఏదో దర్యాప్తు కూడా ప్రారంభించాడు…

సరే, గౌరవ్, హిమంత నడుమ సాగుతూనే ఉంది… ఇప్పుడు కాస్త బంగ్లాదేశ్ మీదకు దృష్టి మళ్లించాడు హిమంత… ఆమధ్య బంగ్లాదేశ్ అధ్యక్షుడు యూనస్ చైనా వెళ్లినప్పుడు ఇండియాలోని చికెన్ నెక్ కట్ చేస్తే మొత్తం ఈశాన్య రాష్ట్రాలూ మన గుప్పట్లోకి వస్తాయి, అది తప్ప ఇండియా ఈశాన్య రాష్ట్రాలను చేరే వేరే మార్గం లేదని కూశాడు కదా…

హిమంత

అది ఒకందుకు మంచిదే అయ్యింది… చికెన్ నెక్ (ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఇరుకైన ప్రాంతం) కాపాడుకునే చర్యలతోపాటు ప్రత్యామ్నాయాల్ని కూడా ఆలోచించుకునేట్టు చేశాడు… ఇప్పుడు హిమంత కాస్త డిఫరెంటుగా కౌంటర్ చేశాడు…

చూడవోయీ యూనస్సూ, మాకు చికెన్ నెక్ ఒకటే దుర్బలమైన ప్రాంతం కావచ్చు… నీకు రెండు ఉన్నాయి తెలుసా అని ఓ మ్యాప్, ప్రశ్నలు సంధించాడు ట్వీట్‌లో… ఇంట్రస్టింగు మ్యాప్…

‘‘బంగ్లాదేశ్ మొట్టమొదటి “చికెన్ నెక్” దఖిన్ దినాజ్‌పూర్, నైరుతి గారో హిల్స్ మధ్య 80 కిలోమీటర్ల పొడవైన ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్… ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే మొత్తం రంగ్‌పూర్ డివిజన్‌ను బంగ్లాదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల నుండి పూర్తిగా వేరు చేయవచ్చు… 

రెండవది దక్షిణ త్రిపుర నుండి బంగాళాఖాతం వరకు 28 కిలోమీటర్ల పొడవైన చిట్టగాంగ్ కారిడార్… ఇది భారతదేశపు చికెన్ నెక్ కంటే చిన్న కారిడార్ … బంగ్లాదేశ్ ఆర్థిక కేపిటల్, పొలిటికల్ కేపిటల్ మధ్య ఏకైక లింక్’’ అంటాడు… ‘‘నువ్వు చికెన్ నెక్ మీద కన్నేస్తే ఇదుగో ఈ రెండు నెక్కులను పిసికేస్తాం సుమా’’ అనే హెచ్చరిక…



To those who habitually threaten India on the “Chicken Neck Corridor”, should note these facts as well:

1️⃣ Bangladesh has two of its own “chicken necks”. Both are far more vulnerable

2️⃣ First is the 80 Km North Bangladesh Corridor- from Dakhin Dinajpur to South West Garo… pic.twitter.com/DzV3lUAOhR

— Himanta Biswa Sarma (@himantabiswa) May 25, 2025


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions