.
- ఏడేళ్ల వయసులోనే బాలికలకు యోని సున్తీ.. ఆ దురాచారంపై పోరు
- 16 ఏళ్లకే అత్యాచారం బారిన పడి.. హక్కుల కోసం ఆరాటం
- ఊహ తెలియనప్పుడే లైంగిక వేధింపులు.. వాటిపై పోరాటం
- మిస్ వరల్డ్ పోటీదారుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ
- విశ్వవేదికపై తమ వాణి వినిపించిన సుందరీమణులు
అవును, ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ స్టోరీకి డెక్స్… దీంతోనే అర్థమైంది కదా ఆ స్టోరీ ఏమిటో… మిస్ వరల్డ్ పోటీల మీద ఎవరేం రాస్తున్నా సరే, ఈ యాంగిల్‌కు మంచి ప్రయారిటీ ఇచ్చి, వివరంగా హ్యూమన్ ఇంటరెస్టింగ్ స్టోరీని చేసి… ఈరోజు ప్రొఫెషనల్‌గా ఆంధ్రజ్యోతి వంద మార్కులు తెచ్చుకుంది… మిగతా పత్రికలపై స్పష్టమైన వృత్తిపరమైన ఆధిక్యత …
సాక్షికి ఎప్పుడూ ఇలాంటి సోయి లేదు, ఉండదు కాబట్టి దాంతో మనకు అంచనాల్లేవు, ఆశల్లేవు… ఏ కరణ్ థాపరో రాసిన చెత్తను పబ్లిష్ చేసుకుని తాను మురిసిపోవడం తప్ప..! ఈనాడు అప్పుడప్పుడూ ఇలాంటి కొత్త కోణాల్లో ప్రజెంటేషన్ ఎంచుకునేది… చాన్నాళ్లుగా ఈనాడు వార్తల నాణ్యత మరీ పథ్యం చప్పిడి తిండిలా మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేం…
Ads
మిగతా చిన్నాచితకా పత్రికల గురించి ప్రస్తావనే అనవసరం… పేలవం… వాళ్లు అక్కడికి వెళ్లారు, ఇవి సందర్శించారు అనే ఫక్తు రొటీన్ స్పాట్ న్యూస్ రాసి చేతులు దులుపుకోవడం…
పత్రిక అని చెప్పుకునే నమస్తే తెలంగాణ దొరికింది చాన్స్ అనుకుని రేవంత్ రెడ్డి సర్కారు మీద దుమ్మెత్తి పోయడానికి పూనుకుంది… ఎస్, కొన్ని తప్పులు, నిర్వహణ లోపాలు జరిగాయి, పరువు పోయింది… కానీ దాన్నే అటుపీకి ఇటుపీకి మరో నాలుగు కథలు చేసి, హమ్మయ్య, ప్రభుత్వాన్ని ఎండగట్టాంలే అనుకోవడం అది…
ఆంధ్రజ్యోతి కూడా ఆ వార్తలూ రాసింది… మిస్ ఇంగ్లండ్ ఏం ఆరోపించిందో, విశ్వ సౌందర్య పోటీలు ఎలా అభాసుపాలయ్యాయో కూడా రాసింది… అదే సమయంలో ఇదుగో ఇలాంటి మానవాసక్తి కథనాల్ని కూడా ప్రజెంట్ చేసింది… కాస్త మదిలో తడి ఉన్న రిపోర్టర్ స్పందిస్తాడు, డెస్క్ సరిగ్గా రియాక్టవుతుంది… అప్పుడు ఈ ప్రజెంటేషన్ సాధ్యమవుతుంది…
సర్లెండి, టీవీ చానెళ్ల కవరేజీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్… నిజం.., మనం ఆ కంటెస్టెంట్ల అందాల్ని, హొయలు, సోయగాల్ని, ర్యాంపు వాకుల సోకుల్ని మాత్రమే చూస్తున్నాం… నిర్వాహకులు కొలతల్ని కూడా చూస్తారు… ప్రశ్నలు సంధించి జ్ఞానాన్ని బేరీజు వేస్తారు…
కానీ వాళ్లూ మనుషులే… మమ్మల్ని ఏమిటిలా నీచంగా చూస్తున్నారు అంటూ పోటీ వదిలి మిస్ ఇంగ్లండ్‌లా పారిపోయినా… భరిస్తూ పోటీలో కొనసాగినా… వాళ్లేమీ బట్టల షాపుల ముందు నిలబెట్టే బొమ్మలు కారు, వాళ్లకూ ఉద్వేగాలున్నయ్.., ఆ అందాలు, మెరుపుల వెనుక దాగున్న నలుపును, చేదును, చీకటిని, వ్యథను మాత్రం చూడటం లేదు.. దాన్ని ఆంధ్రజ్యోతి చూపించింది… అదీ కంటెస్టెంట్లు చెప్పుకున్నదే… పత్రిక సొంతంగా క్రియేట్ చేసింది కాదు…
‘‘ మహిళల ప్రాణాలను హరించే ఆటవిక ఆచారాలను భరించింది ఓ వనిత. అదృష్టవశాత్తు బతికిన ఆమె.. కొండంత ధైర్యం తెచ్చుకుంది. ఆ దేశంలో మహిళల మాన, ప్రాణాలను దెబ్బతీసేలా ఉన్న మూఢాచారాలపై పోరాటాన్ని ప్రారంభించింది.
పదహారేళ్లకే అత్యాచారానికి గురైంది మరో మహిళ.. కొన్నేళ్ల తర్వాత ఆ క్షోభ నుంచి బయటపడిన ఆమె.. తమ దేశంలో బాలికల పట్ల జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పనిచేస్తోంది.
తెలిసీ తెలియని వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొంది ఓ బాలిక. కాస్త వయసు వచ్చేసరికి తమ దేశంలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయనే విషయం ఆమెను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఇలాంటి వాటిని రూపుమాపాలనే లక్ష్యంతో ఒక సంస్థను ప్రారంభించి ప్రజలను చైతన్యం చేస్తోంది.
ఈ కథలే కాదు… అనేక మంది జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు, వేధింపులను ఎదుర్కొన్నారు… తమ బాధల నుంచే సొసైటీ కన్సర్న్‌డ్ బాటలు ఎంచుకున్నారు… బాగున్నయ్ కథనాలు, వాటి ప్రజెంటేషన్… బాధ్యులకు అభినందనలు…
Share this Article