Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సారీ-గమలు… మళ్లీ అదే పోకడ… అసలు తప్పేమిటో తెలియడాయె…!!

June 5, 2025 by M S R

.

రాజేంద్ర ప్రసాద్ తన తప్పు తెలుసుకున్నాడా..? లేదు, అలా తెలుసుకునే కేరక్టర్ కాదు తను… అసలు తన మనస్థితి ఏమాత్రం బాగాలేదు…

స్టేజీ ఎక్కితే చాలు, ఏవేవో పిచ్చికూతలు… తను ఏదో పెద్ద వక్తను అనుకుంటాడు, ఐదు తరాల మహానటుడిని అనుకుంటాడు… అవన్నీ వోకే, నోరు విప్పితే బూతులు… ఎదుటివాళ్లను అవమానిస్తున్నాను అనే సోయి కూడా ఉండదు…

Ads

క్రికెటర్ డేవిడ్ వార్నర్, మాజీ మంత్రి రోజా, కెమెరామన్ శరత్, జర్నలిస్టు ప్రభు, మాజీ నటి రవళి, రియల్ వ్యాపారి మురళీమోహన్, కమెడియన్ ఆలీ… తాజాగా తన ఎడ్డి కూతలకు బలయినవాళ్లు… వాళ్లకు సంస్కారం కాస్తో కూస్తో ఉంది కాబట్టి, ఈ 68 ఏళ్ల ముసలోడి వయస్సుకు గౌరవం ఇచ్చి ఇష్యూ చేయలేదు…

నలుగురితో మందు కొట్టినప్పుడు ఏవో సంబోధనలు చల్తా… కానీ మీడియా ఎదుట, పబ్లిక్ ఫంక్షన్‌లో మాట్లాడేప్పుడు కాస్త సంస్కారాన్ని ప్రదర్శించాలి, పోనీ, నటించాలి… ఇప్పుడు ప్రపంచమంతా తనను తిట్టిపోసేసరికి మెదడుకెక్కింది కాస్త దిగింది…

అదేదో యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ… ఇకపై అందరినీ మీరు అనే సంబోధిస్తాను, నా కుటుంబం అనుకుని ఎక్కువ ప్రేమతో సంబోధించాను, మీడియా ఉందని అనుకోలేదు, నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ విఫల సమర్థనకు దిగాడు, కూతురు పోయిన బాధ నుంచి బయటపడ్డాను అన్నాడు…

ఇక్కడ నువ్వు, మీరు అనే ఏకవచన, బహువచన, గౌరవ సంబోధనలు కాదు ఇష్యూ, తనకు అదీ అర్థం కావడం లేదు… రవళిని గుండ్రాయి అని వెక్కిరించిన బాడీ షేమింగు నువ్వు, మీరు సంబోధనలకు పరిమితమైన విషయం కాదు కదా… ఆమె బాడీ, ఆమెకు ఏ ఆరోగ్యసమస్య ఉందో, ఆమె బాధ ఏమిటో… అందుకే తనను కుసంస్కారి అనేది…

మేం మేం ఏమైనా ప్రేమతో అనుకుంటాం అనేది ఓ మూర్ఖ సమర్థన… నా బట్టలు, నా బాడీ, బజారులో ఇప్పుకుని బరిబాతల తిరుగుతాను మీకేం నొప్పి అంటే లోకం ఊరుకోదు కదా… ఇదీ అంతే…

ఓ సీనియర్ నటుడి నుంచి కాస్త ఇంగితం కోరుకుంటారు జనం… భిన్నంగా కనిపిస్తే ఛిఛీ ఈ కేరక్టర్ ఇంత నీచమా అని తిట్టిపోస్తారు… రాజేంద్ర ప్రసాదుడూ, అర్థమైందా..? ఇప్పుడిక ఈ వయస్సులో, ఈ మనస్థితిలో కళామతల్లికి నీ సేవలు వెగటు పుట్టిస్తున్నాయి గానీ, కాస్త కొత్త నీటికి చాన్స్ ఇస్తే అదే పదివేలు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions