Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… అప్పుడు శివుడు… కొన్నాళ్లకు మహాకాళి… సీన్ ఛేంజ్…

June 18, 2025 by M S R

.

Devi Prasad C ……. రెండుమూడు సంవత్సరాలక్రితం వాట్సప్ నుండి వచ్చిన ఓ ఫోటోతో కూడిన మెసేజ్ నన్ను ఆకట్టుకుంది. ఆ ఫోటోలో వాటర్‌ఫాల్స్ ముందున్న ఓ శివుడి విగ్రహం, ఢమరుకం పట్టుకున్న ఓ చేయి ఉన్నాయి.

( సరిగ్గా అదే శివుడి విగ్రహం ముందు నిల్చుని నేను కూడా ఫోటో దిగాను, దిగువన చూడండి.)

Ads

కేరళలోని చేలైకుడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటర్‌ఫాల్స్ దగ్గర ఐదు వందల సంవత్సరాల క్రితం ఎవ్వరో మహారాజులు ఏకశిలతో ఆ విగ్రహాన్ని మహా శిల్పులతో చెక్కించారనీ, ఇప్పటికీ నిత్యం అక్కడ పూజలు జరుగుతుంటాయనీ, దానిని సందర్శించిన వారికి అష్టైశ్వర్య ఆరోగ్యాలు లభిస్తాయన్నదే ఆ మెసేజ్ సారాంశం.

idol

అయ్యా…. మెసేజ్‌లో చెప్పినట్టు వాటర్ ఫాల్స్ చేలైకుడి దగ్గరదే. అక్షరాలా అదే. కానీ ఆ విగ్రహాన్ని నిర్మించినది మా నిర్మాత జయకృష్ణ గారనీ, దానిని రూపొందించిన మహాశిల్పి మా ఆర్ట్ డైరెక్టర్ కె.వి.రమణ గారనీ, అది ఏకశిల కాదనీ, అట్టముక్కలతో చెక్కముక్కలతో నిర్మించి రంగులు వేసి తయారుచేసిన సినిమా సెట్ అనీ, అక్కడ ఆ సెట్ వెయ్యాలనే నిర్ణయం ఆ సినిమా దర్శకుడిగా నాదేననీ అప్పుడే చెప్పాను.

మా నిర్మాత గారి అనుమతితో దర్శకులు “రాజ్‌కుమార్ సంతోషి” కూడా ఆ సెట్ లో “లజ్జ” అనే హిందీ సినిమా షూట్ చేశారు. తరువాత ఆ సెట్ తీసివేశారు…

ఇప్పుడు మళ్ళీ ఆ విషయం చెప్పటానికి కారణమేమంటే , అదే లొకేషన్‌లో వేరే ఏదో సినిమా కోసం నిర్మించిన “కాళికాదేవి విగ్రహం సెట్” ఫోటోపెట్టి అదేరకం ప్రచారం జరుగుతుండటం, నిజమని నమ్ముతున్న కొందరు భక్తులు అదెక్కడ? ఎలా వెళ్ళాలి? అక్కడి పూజావిధులెలావుంటాయి? అంటూ ఫేస్‌బుక్ లో ఆరాలు తీస్తున్నారు…

ఆ పోస్ట్‌లు విరివిగా కంటపడటంతో, మేము వేసిన సెట్ ఫోటోలు త్రవ్వకాల నుండి బైటికి తీసి ఈ పోస్ట్ పెట్టటం జరిగింది…

setting

(మా షూట్ వర్కింగ్ స్టిల్ లో దర్శకుడినైన నన్ను, అప్పటి సహాయ రచయిత అయిన బి.వి.యస్.రవి గారినీ, అప్పటి కో డైరెక్టర్ సాయిరవి గారినీ, నటీనటులు శ్రీహరి, రఘువరన్, మీనా, రాజారవీంద్ర గార్లని చూడొచ్చు.)

అమాయకత్వంతో కూడిన “అజ్ఞానం” తర్కాన్ని చంపి మనిషిని “మూఢత్వం”అనే అంధకారంలోకి తోస్తుంది.
ఆలోచనతో కూడిన “అధ్యయనం” విచక్షణా జ్ఞానాన్ని పెంచి మనిషిలో”మానవత్వం” అనే దీపాన్ని వెలిగిస్తుంది…. ______ దేవీప్రసాద్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మచ్చ కడగబడలేదు సర్… ఈరోజుకూ సారీ కోరుతోంది తెలుగు మహిళ…
  • యండమూరి గ్రేట్… దిల్ రాజు బేకార్… కాస్త తడి ఉండాలోయ్ సారూ…
  • ఓహ్… అప్పుడు శివుడు… కొన్నాళ్లకు మహాకాళి… సీన్ ఛేంజ్…
  • పోలవరం- బనకచర్ల వివాదంలో కార్నర్ అవుతున్నది కేసీయారే..!
  • సర్దార్… ఆ పేరుంటే చాలు సర్దార్ పాపారాయుడు కాలేడు కదా…
  • ‘‘ఆ జర్నీలో అనుకోని పరిచయం… ఒకరు సీఎం, మరొకరు పీఎం అయ్యారు…’’
  • ‘‘అంతటి లత బాగా పాడలేదనీ, మళ్లీ పాడమని అడగాలా, నెవ్వర్, నావల్లకాదు…’’
  • చేతగాకకాదు.., బప్పీ మార్క్ మెలొడీయే వేరు… పోనీ, ఈ పాటనేమందాం..?!
  • జాతిని… ఆ వెగటు కూతల నిర్మాత పిచ్చి కూతలు మళ్లీ… కవరింగు…!
  • అరాచకం..! షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions