Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాణ్యతకూ, నమ్మకానికి పేరు హెరిటేజ్… కానీ ఎందుకో ‘పగిలిపోతోంది…’

June 25, 2025 by M S R

.

అబ్బే, పాలు పగిలిపోతే పెద్ద విశేషమా..? తప్పా..? నేరమా..? ఈమాత్రం దానికి పోలీసు కేసు పెట్టాలా..? వాళ్లు దర్యాప్తు ప్రారంభించాలా అర్జెంటుగా..? ఈ డౌట్ నాకూ వచ్చింది ఓ వాట్సప్ వార్త చదవగానే… ముందు అదేమిటో చదవండి… తరువాత చెప్పుకుందాం…


పాకెట్ పాలు పగిలినాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు… అరదుగా వచ్చే కేసులలో ఇదొకటిగా నిలిచింది… పాలు పగిలాయని బాధితులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్‌పల్లి పోలీసులు…

Ads

మొన్న జరిగిన సంఘటన.., కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో… ఓ కస్టమర్ హెరిటేజ్ పాలను కొనుగోలు చేసి, ఇంటికి తెచ్చి, కాచారు… మొదటి ప్యాకెట్ బాగానే ఉంది… మరో ప్యాకెట్ ఉదయం కాచేసరికి పగిలిపోయాయి…

అసలు ఇదేమిటి అని షాపు వాడిని ప్రశ్నించగా… వాళ్లకి మేము ఏమి చేస్తాం అంటూ దుకాణదారుడు జవాబు ఇచ్చాడు… దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన బాధితులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు…  స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు…

ఇదిలా ఉండగా కేవలం ఒక సంస్థ నుండి వచ్చే పాలే కాకుండా ఈ మధ్యకాలంలో పలు సంస్థల పాలు పగులుతున్నాయి… వాసన వస్తున్నాయని వినికిడి కూడా ఎక్కువగా ఉంది.., వీటిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని ఎంతోమంది కస్టమర్లు కోరుకుంటున్నారు…



ఇదీ వార్త… నిజం చెప్పాలంటే ఆ పాలు విరగడానికి సదరు రత్నదీప్ వాడి తప్పేమీ ఉండకపోవచ్చు… కంపెనీ సప్లయ్ చేసే పాకెట్లను కస్టమర్లకు అమ్మడం వరకే తన బాధ్యత…

అయితే..? వెన్న, నెయ్యి, నూనెలు, చివరకు అల్లం వెల్లుల్లి దాకా అన్నీ కృత్రిమంగా తయారు చేస్తున్న ఈరోజుల్లో… పాలను కూడా అలా తయారు చేసి, పేరున్న కంపెనీల పేర్లతో అమ్ముతున్నారా అనేది డౌటనుమానం…

milk

నిజానికి నేనూ హెరిటేజ్ పాలే కొంటాను… కాకపోతే ఈ టోన్డ్ మిల్క్ కాదు, ఫుల్ క్రీమ్ మిల్క్… ఎప్పుడూ చిన్న ప్రాబ్లం రాలేదు… మిగతా బ్రాండ్లు (ప్రత్యేకించి కంట్రీ డిలైట్) ప్రయోగాలు చేసీ చేసీ, చివరకు హెరిటేజ్ చాలా బెటర్ అని తేల్చేసుకుని దానికి ఫిక్సయ్యాను…

మరి ఈ పాలు విరగడం ఏమిటి..? సదరు కంపెనీ కూడా దర్యాప్తు చేయించాలి… లేకపోతే ఆ బ్రాండ్ ఇమేజీకే నష్టం… స్టోరేజీ ప్రాబ్లమా..? లేక కల్తీ సరుకు వస్తోందా..? సంస్థ అంతర్గతంగా విచారణ జరుపుకోవాలి… లేదంటే మాలాంటోళ్లకు మళ్లీ ఆ దిక్కుమాలిన కంట్రీ డిలైట్ దిక్కవుతుందేమోనని బాధ, ఆందోళన… అంతే… అమ్మా, బ్రాహ్మణీ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎమర్జెన్సీ రాజ్యాంగబద్ధమే.., అప్పట్లో తప్పలేదుట, తప్పూ కాదుట…
  • రెండేళ్లలో డజను పెళ్లిళ్లు అట… ఆమె నిందితురాలా..? బాధితురాలా..?
  • ఉన్నతాధికారుల పోస్టింగులపై రేవంత్ సర్కారు తెలివైన అడుగులు
  • నిజంగానే ఉత్తరాది రాష్ట్రాలు ఎడాపెడా పిల్లల్ని కనేస్తున్నాయా..?!
  • విజయ్‌కన్నా ఉదయనిధే బెటరట… అవునూ, ఈ లెక్కల తిరకాసులేమిటో…
  • “కాళిదాసు తమిళ్షుడు అవాలనుకుని కణ్ణదాసన్ అయ్యాడు…”
  • హమ్మా… మా తెలుగు ఈగను పోలిన మలయాళ ఈగ క్రియేట్ చేస్తారా..?!
  • హమ్మో అమ్మాయిలా అనుకునే ఈ రోజుల్లో… ఈ టైటిల్, ఈ కథ విశేషమే…
  • నాణ్యతకూ, నమ్మకానికి పేరు హెరిటేజ్… కానీ ఎందుకో ‘పగిలిపోతోంది…’
  • తన పిచ్చి ఆరాధకుడు వర్మకు శ్రీదేవి లీగల్ నోటీస్ ఎందుకిచ్చింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions