.
శుభాంశు శుక్లా… రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడు… దేశమంతా అభినందనలు కురిపిస్తోంది… గుడ్… యూపీకి చెందిన శుక్లా విద్యాభ్యాసం, అర్హత, అనుభవం, శిక్షణ తదితర వివరాలతో అనేక కథనాల్ని మీడియా ప్రచురిస్తోంది… ఎయిర్ ఫోర్స్ పైలట్లే ఈ రోదసీయానానికి ఎందుకనే వివరాల దాకా…
తన లవ్ స్టోరీ కూడా రాస్తోంది… ఆమె పేరు కామ్నా… మూడో తరగతి నుంచే క్లాస్‌మేట్… తరువాత ప్రియ స్నేహితురాలు… ప్రియురాలు.., తరువాత భార్య… ఆమె డెంటిస్ట్… ఇద్దరి చదువులు వేర్వేరు అయినా చిన్నప్పటి నుంచీ ఆ బంధాన్ని అలా పెంచుకుంటూ వెళ్లారు… ఒక్కటయ్యారు…
Ads
ఇవన్నీ సరే… పర్ సపోజ్… ఒకవేళ శుభాంశు శుక్లా వెళ్లలేని సిట్యుయేషన్ ఏర్పడితే..? ఇంట్రస్టింగు ప్రశ్న కదా… అలాంటి అనుకోని పరిణామాలు గనుక తలెత్తితే తనకు బదులు రోదసిలో పంపించడానికి ఎవరు..? ఎస్, తనే అన్‌టోల్డ్ హీరో ప్రశాంత్ నాయర్…
తనది కేరళ… మన ఇస్రో మానవసహిత రోదసీ యానానికి ఉద్దేశించిన గగనయాన్-4 ప్రాజెక్టు కోసం నలుగురు వ్యోమగాముల్ని ఎంపిక చేసింది… వారందరికీ శిక్షణ ఇప్పించింది… అందరూ అర్హులే… రకరకాల పారామీటర్లలో పరిశీలించి, పరీక్షించి మరీ ఎంచుకుంది… పేర్లు శుభాంశు శుక్లా, ప్రశాంత్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్…
వీరిలో శుభాంశు శుక్లాకు బ్యాకప్‌గా ప్రశాంత్ నాయర్‌ను ఎంచుకుని రెడీగా ఉంచింది… తను కూడా అన్నిరకాలుగా ప్రిపేర్డ్‌గా ఉన్నాడు… తప్పదు, ఏ క్షణం పిలుపు వచ్చినా వెళ్లి స్పేస్ వెహికిల్‌లో కూర్చోవాల్సిందే… ఇద్దరూ సేమ్ అర్హతలే అయినా శుభాంశు శుక్లా ఫ్లయింగ్ అవర్స్ ఎక్కువ కాబట్టి తననే తుది ప్రయాణానికి ఎంపిక చేశారు…
సేమ్, శుభాంశులాగే ప్రశాంత్ కూడా రష్యాలోని యూరీ గగారిన్ శిక్షణ కేంద్రంలో ట్రెయిన్డ్… ఇద్దరూ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లే… తరువాత బెంగుళూరు ఆస్ట్రోనాట్ ట్రెయినింగ్‌లో ఉన్నప్పుడే ఐఐఎస్సీలో ఎయిరోస్పేస్ ఇంజినీరింగులో మాస్టర్స్ కూడా పూర్తి చేశారు…
అన్నట్టు తనదీ ఓ ప్రేమకథే… 48 ఏళ్లు ఇప్పుడు… గతంలో తన వైవాహిక జీవితం గురించిన సమాచారం లేదు గానీ 2024 లో… అంటే, గగనయాన్-4 టీమ్ సభ్యులుగా మోడీ ఈ నలుగురినీ అధికారికంగా ప్రకటించడంకన్నా కాస్త ముందు మలయాళ నటి లీనాను పెళ్లి చేసుకున్నాడు… (వయస్సు 44)…
ఆమె తెలుగులో కూడా డాక్టర్ చక్రవర్తి అనే సినిమాలో నటించింది… దాదాపు 175 సినిమాలు, టీవీ సీరియళ్లు, హోస్టింగ్, స్క్రీన్ రైటర్, డబ్బింగ్ ఆర్టిస్టు… బహుముఖ ప్రతిభ ఆమెది… అంతకుముందు డైవొర్సీ… ప్రశాంత్‌తో చాన్నాళ్లు లవ్ ట్రాక్… ఎట్‌లాస్ట్ ఇద్దరూ ఒకటయ్యారు… శుభం…
Share this Article