Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తన తొలి మూవీ ప్రివ్యూ చూస్తూ దర్శకుడు ఎస్.రాంబాబు కనుమూత

July 9, 2025 by M S R

.

Mohammed Rafee ……. అదృష్ట మరణం! ప్రివ్యూ చూస్తూ దర్శకుడు ఎస్.రాంబాబు కనుమూత

మరణాలలోనూ అదృష్టం వుంటుందా అని ఆశ్చర్యం కలిగించినా అది నిజం! విహారయాత్రకు వెళ్లి కారుతో సజీవ దహనం, హెలికాప్టర్ కూలి ముక్కలు ముక్కలు అయిపోవడం ఇలాంటి మరణాలు దురదృష్టకర మరణాలు!

Ads

యాక్సిడెంట్ కు గురై ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ ఇబ్బందులు పడటం ఎంత కష్టం! ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లో నిద్రలోనే సునాయాసంగా కనుమూయడం ఎంత అదృష్టం! శరీరాన్ని కష్టపెట్టకుండా, శస్త్ర చికిత్సలతో నరక యాతన పడకుండా అందరితో మాట్లాడుతూ హాయిగా ఈ లోకాన్ని వదలడానికి ఎంతో అదృష్టం ఉండాలి!

ఎస్.రాంబాబు రాత్రి అదృష్ట మరణం పొందారు! ఒక కళాకారుడు ఆ వేదికపై కనుమూయడం వెనుక ఎంతో అదృష్టం ఉండాలి! పూర్వ జన్మ సుకృతం కలిగి ఉండాలి! ఒక కళాకారుడు రవీంద్రభారతి వేదికపై నాటకం ప్రదర్శిస్తూ కళ్లెదుట చనిపోయారు కొన్నేళ్ల క్రితం! అది ఆ కళాకారుడు చేసుకున్న అదృష్టం!

రాంబాబు గారు సినిమా మనిషి! సినిమానే లోకం! ఎప్పటికైనా సినిమా తీసి చూపించాలనే పట్టుదల! బ్రహ్మాండంగా తీశారు మొత్తానికి! ఆ సినిమా పేరు బ్రహ్మాండ! పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకుని సెన్సార్ కానిచ్చుకుని విడుదలకు సిద్ధం చేశారు! ఆయన దర్శకత్వంలో తొలి సినిమా బ్రహ్మాండ! రాత్రి ప్రివ్యూ షో చూస్తూ థియేటర్ లోనే చనిపోయారు!

ఆ సినిమా అద్భుతంగా వచ్చిందనే ఆనందమో తెలియదు! ఇంకాస్త మెరుగులు దిద్దుకుని ఉంటే బావుంటుందని అనుకుంటూ ఒత్తిడికి గురయ్యాడో తెలియదు. శివైక్యం చెందారు! తెలంగాణ బిడ్డగా సినిమా తీయాలనే తన కలను నిజం చేసుకుని తృప్తిగా వెళ్ళిపోయాడు! మిత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు!

ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తన స్వగ్రామం అల్లీపూర్ లో అంత్యక్రియలు! ఆయనకు రెండు పేర్లు ఉన్నాయి! నగేష్ అని పిలుస్తారు! సినిమా రంగంలో ఎస్.రాంబాబు అంటారు! తొలి సినిమా తీసి విడుదల చేయకుండానే ఆ విజయోత్సవం చూడకుండానే సునాయాసంగా చనిపోయిన రాంబాబుకు అశ్రు నివాళి. – డా. మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’
  • ఆల్రెడీ యూట్యూబ్ వీడియోల క్వాలిటీకి ఎఐ టూల్స్ పర్యవేక్షణ…
  • బ్యాక్ బెంచర్స్..! తరగతి గది సీటింగు మార్చేస్తున్న ఓ కొత్త సినిమా..!
  • ఒక భారతీయ గురువు… ఒక పాకిస్థానీ శిష్యుడు… ఒక నోబెల్ ప్రైజ్…
  • ఈ అల్లరి చిల్లర మెంటల్ పిల్ల నోటి నుంచి ఓ వైరాగ్యపు డైలాగ్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions