Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సౌదీ పాకిస్థాన్ రక్షణ ఒప్పందం- ఇండియాకు ఏమీ ఫరక్ పడదు…

September 23, 2025 by M S R

.

Pardha Saradhi Potluri….. మూడో ప్రపంచ యుద్ధ సన్నాహాలు – ఖతార్ మీద దాడి చేసిన తరువాత ఇజ్రాయేల్ ప్రధాని నేతన్యాహు టెలివిజన్ లో దేశ ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ ఉగ్రవాదులకి ఆశ్రయమిచ్చే ఏ దేశం మీదనైనా దాడి చేస్తాము అంటూ హెచ్చరిక చేశాడు.
ఇది అరబ్ దేశాలలో ఆందోళన కలిగించింది.

ఇది ఈజీప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ దేశాలకి నెతన్యాహు చేసిన హెచ్చరిక.
ఈజీప్ట్ హమాస్ కి, సౌదీ అరేబియా సిరియాకీ, టర్కీ సిరియా కి, చివరిగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎగుమతి దేశంగా అండగా ఉంటున్నాయని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించాడు నెతన్యాహు.
ఖతార్ మీద దాడితో అది ఉత్తుత్తి హెచ్చరిక కాదని తేలిపోయింది.

Ads

నాటకంలో అంతర్నాటకం!
సెప్టెంబర్ 17, 2025!
సౌదీ అరేబియా పాకిస్థాన్ రక్షణ ఒప్పందం చేసుకున్నాయి.
సౌదీ అరేబియా మీద ఎవరు దాడి చేసినా పాకిస్తాన్ తన సైన్యాన్ని సౌదీ అరేబియాకి పంపిస్తుంది!
పాకిస్థాన్ ఎలాంటి ఆయుధాలు కొనాలన్నా సౌదీ అరేబియా ఆర్ధిక సహాయం చేస్తుంది.

సౌదీ అరేబియా దగ్గర అమెరికా, చైనా, ఫ్రాన్స్, జెర్మనీకి చెందిన ఆయుధాలు ఉన్నాయి. వాటిని పాకిస్తాన్ సైన్యం ఉపయోగిస్తుంది సౌదీకి రక్షణగా!
సౌదీ అరేబియా సైన్యం అంత బలహీనమైనదా?

కడుపు నిండిన వాడికి కాలు కదలదని సామెత! 2015 లో ఎమెన్ లోని సున్నీ ప్రభుత్వానికి అండగా సౌదీ రాజు తన సైన్యాన్ని ఎమెన్ కి పంపాడు. సున్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న షియా హుతీలు 400 మంది సౌదీ సైనికులని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఆ ఫోటోలని అంతర్జాతీయ మీడియాకి విడుదల చేశారు.
హుతీలకి రహస్యంగా డబ్బులు ఇచ్చి తన సైనికులని విడిపించుకున్నాడు సౌదీ రాజు!

సౌదీ సైనికులకి అత్యాధునిక అమెరికా ఆయుధాలు ఇచ్చినా హుతీ దగ్గర ఉన్న AK-47 ల ముందు అవి పనిచేయలేకపోయాయి. నిజానికి సౌదీ సైన్యానికి జీతం తీసుకొని తమ దేశం కోసం పోరాడాలి అనే భావన ఉండదు. ఇక్కడ ఆయుధాలు ఎంత ఆధునికమైనవి ఉన్నా పోరాడే తత్త్వం లేనప్పుడు అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే!

సౌదీ అరేబియా పాకిస్థాన్ మధ్య అధికారిక ఒప్పందం సెప్టెంబర్ 17, 2025 న జరిగినా అనధికారక ఒప్పందం చాలా కాలం నుండి అమలులో ఉంది.
సౌదీ అరేబియాలో 70,000 మంది పాకిస్తాన్ సైనికులు ఉన్నారు చాలా కాలంగా! వీళ్లలోంచి కొంతమందిని తన వ్యక్తిగత రక్షణ సిబ్బందిగా నియమిస్తాడు సౌదీ రాజు. తన సైన్యంలో పనిచేసే వారి నుండి స్వంత రక్షణ కోసం తీసుకోడు, ఎందుకంటే తిరుగుబాటు చేసి బంధిస్తారనే భయం ఉంది.
సెప్టెంబర్ 17 న సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం కేవలం లాంఛనమే!

నాటకంలో అంతర్నాటకం ఎందుకు అనాల్సి వచ్చింది అంటే సౌదీ యువరాజు, పాకిస్తాన్ ప్రధాని ఇద్దరూ కలిసి సౌదీ అరేబియాలో సంతకాలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నా సొరంగ మార్గంలో ప్రయాణించి సౌదీ అరేబియా వెళ్లాడా?
ఒప్పందం మీద సంతకాలు చేసిన అరగంట తరువాత ఇలా జరిగిందంటూ ట్రంప్ కి ఫోన్ లో చెప్పాడు సౌదీ రాజు ( అల్ రుమయ్యాన్) అని మీడియాలో ఊదరకొట్టడం పెద్ద జోక్!
So! సౌదీ అరేబియా మీద ఇజ్రాయేల్ దాడి చేస్తే పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపిస్తుంది. అదే పాకిస్తాన్ మీద ఇజ్రాయేల్ లేదా భారత్ దాడి చేస్తే సౌదీ అరేబియా డాలర్లు ఇస్తుంది.

పాకిస్తాన్ విదేశీ అప్పులు $135 బిలియన్ డాలర్లు షుమారుగా లెక్కవేస్తే. పాకిస్తాన్ GDP లో దాదాపుగా 45% శాతం విదేశీ అప్పుగా ఉంటుంది.
పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర డాలర్ రిజర్వ్ వచ్చేసి 8-10 బిలియన్ డాలర్లు, కానీ ఇది కూడా అప్పుకింద తీసుకొన్నదే.
విదేశీ అప్పు కనుక డాలర్ రిజర్వ్ తో పోలిస్తే దాదాపుగా 500% శాతంగా ఉంది. GDP తో పోలిస్తే 100% లోపలే విదేశీ అప్పు ఉంటే అది సురక్షితం.

ఎగుమతులు బాగా ఉండి అది పెరుగుదల చూపిస్తూ ఉంటే 120% కన్నా GDP కన్నా విదేశీ అప్పు ఉన్నా ఫరవాలేదు. జపాన్ దీనికి ఉదాహరణ!
పాకిస్తాన్ ప్రతీ సంవత్సరం విదేశీ అప్పుకి వడ్డీ కింద షుమారుగా $8 బిలియన్ డాలర్లు కట్టాల్సి ఉంటుంది.
గత దశాబ్దకాలంగా అప్పుతో పాటు వడ్డీని కూడా రీషెడ్యూల్ చేయించుకుంటూ నెట్టుకొస్తున్నది.

ఇక పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలోనే సేకరించిన ఋణం మొత్తం PKR 40 లక్షల కోట్లుగా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం విదేశీ అప్పులని పక్కన పెడితే తన సంవత్సర ఆదాయంలో 60% స్వదేశంలోని అప్పుల వడ్డీని చెల్లించాల్సి వస్తున్నది.
పాకిస్తాన్ తమ దేశ ప్రజల కోసం పూర్తి స్థాయిలో ఆహారం పండించుకోలేక పోతున్నది.
ఒకసారి గణాంకాలు చూడండి. ముందు ఉన్నవి పాకిస్తాన్ లో ఉత్పత్తి అయ్యేవి అయితే బ్రాకెట్ల లో ఉన్నవి దిగుమతి చేసుకుంటుంన్నవి.

గోధుమలు పంట – 65% (35%)
వరి బాస్మతితో కలిపి – 70% (30%)
పాలు – 58% (42%)
మటన్ -59% (41%)
బీఫ్ -51% (49%)
చికెన్ -61% (39%)

2015 నుండి 2025 వరకూ పాకిస్తాన్ లో ఆహార ద్రవ్యోల్బణం 460% శాతంగా ఉంది.
అంటే మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ ధరలు పెరుగుతూ వస్తున్నాయి దేనికి? ఎవరన్నా కాంగ్రెస్ నాయకుడు లేదా మన దేశంలోని పాకిస్తాన్ ప్రేమికులు చెప్పగలరా?
ధరలు 460% పెరిగితే పాకిస్తాన్ ప్రజల వేతనాలు. మాత్రం 290% మాత్రమే పెరిగాయి, ఎందుకనో చెప్పగలరా?
పాకిస్తాన్ కి డాలర్లు కావాలి అంతే!

సౌదీ అరేబియా తాను ఫండింగ్ చేసి నిర్మించిన అణు ఆయుధాలని ఈ ఒప్పందం ద్వారా వాడుకుంటుంది!
జస్ట్ బ్లాక్ మనీని వైట్ మనీగా, బినామి ఆస్థిని పన్ను చెల్లించి తన పేరుమీద రిజిస్టర్ చేసుకోవడం లాంటిదే ఈ ఒప్పందం!

ఇక భారత్ కనుక పాకిస్తాన్ మీద దాడి చేస్తే సౌదీ ఏమీ కల్పించుకోదు! కేవలం ఇజ్రాయేల్ దాడిని తప్పించుకోవడానికే ఈ ఒప్పందం!
1999 లో పాకిస్తాన్ అణు పరీక్ష జరిపిన తరువాత రోజుకి 50,000 బ్యారెళ్ల ముడి చమురు క్రెడిట్ లైన్ కింద ఇవ్వడానికి సౌదీ అరేబియా పాకిస్థాన్ తో ఒప్పందం చేసుకుంది.
ప్రస్తుత ఒప్పందం వల్ల 50,000 వేల బ్యారెళ్ల నుండి లక్ష బ్యారెళ్లని కి పెంచుతుంది సౌదీ. క్రెడిట్ లైన్ అని ఒప్పందంలో ఉంటుంది కానీ అంతా ఉచితమే! 1999 నుండి పాకిస్తాన్ తాను సౌదీ నుండి తీసుకుంటూ వస్తున్న ముడి చమురుకి ఒక్క డాలర్ కూడా చెల్లించలేదు.

ఖతార్ కూడా లిక్విడ్ నాచురల్ గ్యాస్ ( LNG ) ని ఉచితంగా ఇవ్వవచ్చు రాబోయే రోజుల్లో.
సౌదీ, ఖతార్ ఉచితంగా ఇచ్చినా ఇంకా 45% ముడి చమురుని దిగుమతి చేసుకోవాల్సిందే! కాకపొతే ఆయిల్ పూల్ ఖాతాలో ముడిచమురు కోసం ఖర్చు చేసే డాలర్లు కొంచెం తగ్గుతాయి.
సౌదీ, ఖతార్ లు ఇచ్చే ఉచిత ఇంధనం తాలూకు ప్రభావం పాకిస్తాన్ ప్రజలకి దక్కుతుంది అనుకుంటే పొరపాటే!

వరల్డ్ బ్యాంక్, IMF లు ఇచ్చిన రుణాలు వాటి షరతులలో ఇంధనం ధరలు పెంచుకుంటూ పోవాలి ప్రతీ సంవత్సరం ద్రవ్యోల్బణంకి తగ్గట్లుగా!
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ ధ్వంసం చేసిన 11 ఎయిర్ బేస్ లని పునర్నిర్మించడానికి పాకిస్థాన్ గ్లోబల్ టెండర్లు పిలిచింది! అంతర్జాతీయ సంస్థలు పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితి చూసి పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు సౌదీ అరేబియాని హామీగా పెట్టి పేమెంట్స్ ఇస్తుంది పాకిస్తాన్.

కొన్ని మీడియా సంస్థలు సౌదీ పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం భారత్ కి షాక్ ఇచ్చింది అంటూ హెడ్ లైన్స్ పెట్టి కధనాలు వండి వార్చాయి కానీ అప్పులు, అస్తులు, వడ్డీల గణాంకాల గురుంచి చెప్పలేదు పెయిడ్ మీడియా.
ఆసిమ్ మునీర్ కి ఛార్జ్ ఇచ్చి రిటైర్ అయిన పాకిస్తాన్ మాజీ చీఫ్ అఫ్ ఆర్మీ బజ్వాకి $200 మిలియన్ డాలర్లు అమెరికా, బ్రిటన్ బాంకుల్లో ఉన్నాయి. ప్రస్తుత ఫెయిల్డ్ అఫ్ ఆర్మీ ఆసిమ్ మునీర్ కి $100 మిలియన్ డాలర్లు అమెరికా, బ్రిటన్ బాంకుల్లో ఉన్నాయి.

2029 కల్లా పాకిస్తాన్ నాలుగు ముక్కలు అవుతుందని ఆసిమ్ మునీర్ కి తెలుసు కాబట్టే అమెరికా, బ్రిటన్లలో డబ్బులు దాచుకుంటున్నాడు.
అరబ్ దేశాలు భారత్ కి ఇంధన సరఫరా ఆపేస్తాయి!
ఎన్నాళ్ళు ఇలాంటి భ్రమలలో ఉంటారు?

2030 కల్లా హైడ్రో కార్బన్ నుండి విద్యుత్, హైడ్రోజెన్ల వైపు వెళ్లే మార్కెట్ 20% గా ఉండవచ్చని అంచనా. ఈ 20% శాతం ముడి చమురు అమ్మకాల మీద కోత పడుతుంది. 20% తగ్గడం అంటే మామూలు విషయం కాదు. గల్ఫ్ దేశాల జాతకాలని మార్చే శక్తి 20% శాతం అమ్మకాలు పడిపోవడానికి ఉంటుంది!
గట్టిగా మరో అయిదేళ్ల లో అండమాన్ లో ఉన్న ముడి చమురుని వెలికి తీస్తే మనం ఎవరిమీద ఆధారపడే అవసరం ఉండదు…

  • (మిగతా తరువాయి భాగంలో…)

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • QUAD … నాలుగు దేశాల కూటమి ఉన్నట్టా..? రద్దయిపోయినట్టేనా..?!
  • సౌదీ పాకిస్థాన్ రక్షణ ఒప్పందం- ఇండియాకు ఏమీ ఫరక్ పడదు…
  • పుట్టుక గుణాన్ని నిర్దేశిస్తుందా..? ఏమో… ఓ కథ మాత్రం చదవండి…
  • హెచ్1బీ వీసాలపై ఆంక్షలు ఎందుకు రావు..? ఈ చెత్తా పోకడలే కారణం..!!
  • సీఎం జేబులో కత్తెరతో తిరిగితే తప్పేంటి మిస్టర్ హరీష్‌రావూ..?
  • Bad Girl … ప్రయోగాత్మక సినిమాయే… కానీ అశ్లీల కోణంతో ఫ్లాప్…
  • అంతరిక్ష సమరానికీ ఇండియా సై..! ఇస్రో కొత్త ప్రాజెక్టు కథేమిటంటే…
  • ఒళ్లు గడ్డకట్టే చలిలో… ఇంటి అరుగుపై, ఆ మరణశయ్యపై ఓ పసిబిడ్డ…
  • ఈవీఎం హ్యాకింగ్‌ చేస్తున్నట్టు నిజంగానే ఈ బీజేపీ సీఎం అంగీకరించిందా..?!
  • OG ప్రిరిలీజ్..! థాంక్‌లెస్ టాలీవుడ్… రేవంత్‌రెడ్డికి అర్థమవుతోందా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions