Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

TG Mohan Das … ఇలాంటోళ్లే నిజమైన ‘సంఘ్’ వ్యతిరేకులు !

August 10, 2026 by M S R

 

Ashok Kumar Vemulapalli …. టీజీ మోహన్ దాస్ యొక్క నీచ వ్యాఖ్యలు… జంతర్ మంతర్‌లో జరిగిన జెన్ జీ నిరసనలు భారతదేశ యువత నిజమైన ఆవేదనను ప్రతిబింబించాయి. NEET పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై విద్యార్థులు శాంతియుతంగా పోరాడారు. ఆ ఉద్యమం చివరికి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసింది.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ జెన్ జీ ఆందోళనలను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. వారి ఫిర్యాదులు genuine అని, విద్యా వ్యవస్థలో చాలా మార్పులు అవసరమని, నిరసన అనేది consensus కోసం అని స్పష్టంగా చెప్పారు. యువతను దేశద్రోహులుగా లేబుల్ చేయకూడదని కూడా సూచించారు.

Ads

కానీ ఇలాంటి సమయంలోనే టీజీ మోహన్ దాస్ అనే వ్యక్తి జంతర్ మంతర్‌లో నిరసన చేసిన విద్యార్థులను ఉద్దేశించి ఎంతటి నీచమైన, అమానుషమైన మాటలు మాట్లాడాడు! అతను తన YouTube ఛానల్‌లో చెప్పిన మాటలు ఇవి…

‘‘జంతర్ మంతర్ చుట్టూ సుమారు 4 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో కర్ఫ్యూ విధిస్తాను. జనాన్ని మూడుసార్లు చెదిరిపోమని ప్రకటిస్తాను. తర్వాత కాల్పులు జరుపుతాను. ప్రజలు పరుగెత్తి చెదిరిపోతారు. కొందరు చనిపోవచ్చు, కొందరికి వైకల్యాలు కావచ్చు. నాలుగు గంటల్లో పరిస్థితి ప్రశాంతం అవుతుంది. తర్వాత శవాలను సేకరించి ఆసుపత్రులకు తీసుకెళ్తాను…”

ఇంకా మహిళా నిరసనదారులపై ఇలా మాట్లాడాడు … “సామూహిక అత్యాచారాలు జరుగుతాయి. ఈ సందర్భంలో ఫిర్యాదులు ఉండవు, ఎందుకంటే వీళ్లు ఆ దాడులను ఇష్టపడేవాళ్లు. ముఖ్యంగా లెఫ్టిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ మహిళలు వీటినే ఇష్టపడతారు. ఎవరైనా చనిపోతే వాళ్లను మార్టర్ చేస్తారు…” ఇది ఎంతటి అధమ, అమానవీయ, మహిళా వ్యతిరేక వ్యాఖ్య!

శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతను, ముఖ్యంగా యువతులను ఇలా అవమానించడం, హింసను ప్రోత్సహించడం ఏ సమాజానికీ, ఏ ప్రజాస్వామ్యానికీ తగదు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జెన్ జీ ఆందోళనలను గౌరవిస్తూ మాట్లాడితే, ఇలాంటి టీజీ మోహన్ దాస్ లాంటి వ్యక్తులు ఆ ఉద్యమాన్ని కించపరిచి, హింసను, అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారు.

ఇది సంస్థకు కూడా అవమానకరం. ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పటికే అతని వ్యాఖ్యలను వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పి దూరం పెట్టింది. అయినా ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్లు సమాజంలో ఉండకూడదు. నేను ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇవి కేవలం అభిప్రాయాలు కావు – ఇవి ద్వేషం, హింస, మహిళా అవమానం.

ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. యువత గొంతును నొక్కివేయడానికి ప్రయత్నించే వాళ్లను సమాజం సహించకూడదు. జెన్ జీ ఉద్యమం న్యాయం కోసం, జవాబుదారీతనం కోసం. దాన్ని గౌరవించాలి. టీజీ మోహన్ దాస్ లాంటి వాళ్ల మాటలు చరిత్రలో నీచమైన అధ్యాయంగా మిగులుతాయి… అశోక్ వేములపల్లి

(టీజీ మోహన్ దాస్ కేరళకు చెందిన హిందుత్వ వాది, రచయిత, సామాజిక విమర్శకుడు, టీవీ వ్యాఖ్యాత, యూట్యూబర్… ప్రస్తుతం పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • TG Mohan Das … ఇలాంటోళ్లే నిజమైన ‘సంఘ్’ వ్యతిరేకులు !
  • భోజనమే ఆయుధమా? ‘దురంధర్’ తరహాలో ఉగ్రనేత మృతి..!!
  • తెహెల్కా తేజ్‌పాల్‌ కేసు చెప్పే పెద్ద న్యాయ పాఠం ఏమిటంటే..?
  • తొక్కలో బిగ్‌బాస్ గెలవకపోతేనేం ! ఈ రియాలిటీ షోలో రియల్ విజేత తనూజ !!
  • రెండు మెడికో విషాదాలు… మధ్యలో చేష్టలుడిగిన న్యాయం !?
  • ప్రియాంక హంతకులు – లీగల్ పొజిషన్ – యండమూరి విశ్లేషణ !
  • రాష్ట్రపతి భవన్‌లో ఒక అరుదైన క్షణం – కలాం విశిష్ట వ్యక్తిత్వం !!
  • ఇండియా- పాక్ యుద్ధం జరిగితే… టర్కీ, సౌదీ పాల్గొంటాయా !?
  • వరుణయాగం ! క్షుద్ర పూజలకు విరుగుడు !! రేవంత్ వారుణాస్త్రం !!!
  • …. ఇంతకీ విజయ్‌తో విడాకులపై సంగీత ఎందుకు రాజీపడింది ?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions