.
ఎప్పటిలాగే నడుస్తుంది అనుకున్నట్టున్నారు… ముందుగా ఓఎస్డీని తొలగించారు… తరువాత ఇంటికి పోలీసులు వచ్చారు… వరంగల్ ఇంటి ముందు పోలీస్ కాపలా మాయం… ఏం జరుగుతోంది..?
రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, పొంగులేటి… అందరూ బీసీ బిడ్డ కాబట్టి సురేఖ మీద కక్ష సాధిస్తున్నారట… విపరీత పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని బిడ్డ హెచ్చరిక… మోస్ట్ కంట్రవర్సీ ఉద్యోగి తమ ఫ్యామిలీ మెంబరట…
Ads
అసలు తనను తమ శాఖ పరిధిలోని కాలుష్య నివారణ మండలిలో ఓ కంట్రాక్టు ఉద్యోగిగా చేర్చి, అక్కడి నుంచి ఏకంగా మంత్రి ఓఎస్డీగా మార్చి… అందరిమీదా పెత్తనం చెలాయించే ఓ రాజ్యాంగేతర శక్తిగా మారితే… సేఫ్‌గా మంత్రే తన కారులో ఎక్కించుకుని పోలీసుల నుంచి తప్పించింది… అరాచకం…
అరాచకమే కాదు..! తోటి మంత్రి పొంగులేటితో టెండర్ల గొడవ… జిల్లాలోని మొత్తం నాయకులతోనూ గొడవ… నాగార్జున- సమంత ఇష్యూలో పిచ్చి కూతలు, కోర్టు కేసు… సీఎం వరంగల్ వస్తే గైర్హాజరు… పొంగులేటి మేడారం వెళ్తే గైర్హాజరు… ధిక్కారం, తిరుగుబాటు…
మొదటి నుంచీ అంతే కదా… పొలిటికల్ కెరీర్ మొదటి దశ నుంచీ… చివరకు మానుకోటలో తెలంగాణ వ్యతిరేకంగా జగన్‌కు మద్దతుగా రాళ్ల దాడిని ఎదుర్కోవడం దాకా… మళ్లీ లైఫ్ ఇచ్చింది కాంగ్రెసే… కనీసం ఆ సోయి కూడా లేదు…
గన్ పాయింట్‌లో బెదిరించడమేనా అందరినీ..! పడీ పడీ నవ్వే బీఆర్ఎస్ ఎదుట నగుబాటు… చివరకు కొండా బిడ్డ కూడా తీవ్ర పరిణామాలుంటయ్ అని బెదిరిస్తోంది… ఫాఫం, మీనాక్షి నటరాజన్… అమ్మా, తల్లీ… నువ్వు పాదయాత్రలు కాదు చేయాల్సింది, ఇదుగో ఇవీ సెటిల్ చేయాల్సింది…
నువ్వేమైనా తెలంగాణ బిడ్డవా..? తెలంగాణలో నిలబడతావా..? ఆ పాదయాత్రలు వంటి శుష్క ప్రయాసలు ఎందుకులే గానీ… ముందుగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఇలాంటి బంధనాలు తెంచాలి…
అసలే బీసీ నినాదంతో కాంగ్రెస్ వెళ్తుంటే… బీసీ బిడ్డలం కాబట్టి రెడ్లు అణిచివేస్తున్నరట… బీసీ కార్డు సమయానికి… (నక్సల్ అట, లెఫ్ట్ భావజాలమట… ఏదేదో చెబుతోంది బిడ్డ..)
మరి వరంగల్ బస్వరాజు సారయ్య ఎవరు..? సుధారాణి ఎవరు..? బీసీ బిడ్డలు కారా…? కడియం శ్రీహరి ఎస్సీ కాదా..? ఒక్కరితోనైనా సయోధ్య ఉందా..? అసలేం జరుగుతోంది..? దేఖ్‌తే రహో…! దిగ్బంధనం మొదలైంది… ఇంకా వెళ్లడానికి ఏ పార్టీ మిగిలి ఉంది..? సమంత టు సుమంత్..!!
Share this Article