Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చెల్లి పెళ్లికూతురు… అక్క ఈ ఇంట్లో బందీ… రక్తికట్టిన ఓ ఎపిసోడ్…

November 19, 2025 by M S R

.

నో డౌట్… బిగ్‌బాస్ షో అనేది పక్కా స్క్రిప్టెడ్… ప్రేక్షకులకు వినోదం పంచే ఈ ఆటలో బిగ్‌బాస్ టీమే ప్రతిదీ శాసిస్తుంది… బయటి నుంచి పడే వోట్లు అంతా ఓ భ్రమ… బిగ్‌బాస్ ఎప్పుడూ ఎవరికెన్ని వోట్లు వచ్చాయో చెప్పదు…

ఓ వెబ్ సీరిస్… ఓ టీవీ సీరియల్… ఓ రియాలిటీ షో… అన్నీ అంతే… వెల్ స్క్రిప్టెడ్… బిగ్‌బాస్ చెప్పినట్టు ఆడాలి, కాదు, నటించాలి… ఒక్కో కంటెస్టెంట్ వైఖరి మీద బయట చర్చ జరగాలి… అదీ బిగ్‌బాస్ ఉద్దేశం… అసలు షో ఫార్ములాయే అది…

Ads

కాకపోతే కొన్ని ప్రేక్షకులను బాగా కనెక్టవుతాయి… అది సంబంధిత కంటెస్టెంటుకు ఆదరణను తెచ్చిపెడుతుంది… తనూజ పుట్టస్వామి… ఆమె ఈసారి చాలామంది కంటెస్టెంట్లకు మింగుడపడటం లేదు… ఆమె నామినేషన్లలో ఉన్న ప్రతివారం టాప్ వన్ వోట్లు ఆమెకే…

తనూజ

ఈసారి ఫ్యామిలీ వీక్ కదా… కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు (ప్రధానంగా తల్లులు) వస్తున్నారు, మాట్లాడుతున్నారు… ఏక్ సే ఏక్… జీవించేస్తున్నారు… సరే, ఏదో ఎమోషన్, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనేది ఈ ఫ్యామిలీ వీక్ ఉద్దేశం…

నాలుగైదు వారాలు దూరంగా ఉంటే… అంత ఎడబాటును నటించాలా..? అంతగా ఈ ఎపిసోడ్లలో జీవించాలా అనే విమర్శలున్నప్పటికీ…. తనూజ ఎపిసోడ్ కాస్త బాగుంది… ఆమె అక్క కొడుకు వచ్చాడు… తరువాత చెల్లె వచ్చింది… ఆ చెల్లెకు త్వరలో పెళ్లి.,. సో, పెళ్లికూతురు వచ్చిందీ అంటూ అక్క, ఓ ఉద్వేగంతో చెల్లి… కౌగిలించుకుని కన్నీళ్లు కార్చారు…

తరువాత కుర్చీలో కూర్చోబెట్టి… గాజులు, పసుపు, కుంకుమ ఒడిలో పెట్టి, పూలు జల్లి… పెళ్లికూతురిని తనూజ ఆశీర్వదించడం, చెల్లె అక్క కాళ్లు మొక్కడం… ఓ సంప్రదాయ తంతులా..! కానీ అక్కడ బిగ్‌‌బాస్ వేదికపై… బాగుంది…! అప్పటికప్పుడు గాజులు ఎక్కడ దొరుకుతాయి గానీ బిగ్‌బాస్ స్క్రిప్టే కదా, అన్నీ ముందుగానే అరేంజ్ చేసి ఉంటాడు… బట్, వోకే…

(కొందరు తనూజకు పెళ్లయిందిరోయ్, కొడుకున్నాడు అని ఒకటే పోస్టుల గోల… ఏవో ప్రేలాపనలు… పెళ్లయితే, కొడుకుంటే అదేదో పెద్ద నేరం అయినట్టు… బిగ్‌బాస్‌కు అనర్హత అయినట్టు…!!)

తనూజ కూడా కొన్ని వందల టీవీ సీరియళ్ల ఎపిసోడ్లలో నటించింది కదా… అలవోకగా ఉద్వేగాల్ని పండించింది… ఇక వోటింగుకు వస్తే… ఈసారి తొలిసారిగా ఇమాన్యుయెల్ నామినేషన్లలో ఉన్నాడు… హఠాత్తుగా కల్యాణ్ పీఆర్ టీం రెచ్చిపోయి వోట్లు గుద్దిస్తోంది కదా, సహజంగా తను టాప్‌లో ఉన్నాడు… ఇమ్మూ ఆయా వోటింగ్ ప్లాట్‌ఫారాలను బట్టి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాడు…

భరణి దూసుకొస్తున్నాడు… తనూజ పుణ్యమాని రీతూ నామినేషన్ల నుంచి తప్పించుకుంది… తన లవర్ సేఫ్ వోటింగులో ఉన్నాడు… సో, ఈ జంటకు మరోవారం ఢోకా లేదు… ఎటొచ్చీ… రకరకాలుగా ఆడుతూ వ్యతిరేకతను మూటగట్టుకున్న దివ్య వోటింగులో దిగువన ఉండిపోయి… బహుశా ఈసారి ఎలిమినేట్ అయ్యేది తనేనేమో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నా పేరు ఇందిర… లోపలకు రావచ్చా… తినడానికి ఏమైనా ఉందా..?
  • చెల్లి పెళ్లికూతురు… అక్క ఈ ఇంట్లో బందీ… రక్తికట్టిన ఓ ఎపిసోడ్…
  • సేఫ్ ప్యాసేజ్ చూసుకుని మరీ లొంగిపొండి కామ్రేడ్స్… ఖతమై పోవద్దు..!!
  • హిడ్మా కాదు… ‘టెక్ శంకర్’ మృతితో CPRF క్యాంపుల్లో బాణాసంచా..!!
  • పిట్టల్ని కొట్టడం కాదు… సినిమా నేర్చుకోవల్సిన పాఠం ఏమనగా…
  • కన్నబిడ్డలనైనా నమ్మకూడదు… రోజులస్సలు బాగాలేవు… అదే ఇది…
  • ఎంత పెద్ద హీరోయిన్ ఐతేనేం, మేం సారీ చెప్పము గాక చెప్పము…
  • నో నో… వారణాసి కథ కాదు ఇది… కానీ ఇదే అయితే ఎలా ఉంటుంది..?!
  • తుది దెబ్బ- హిడ్మా ఎన్‌కౌంటర్… మావోయిస్టు పోరాటానికి ముగింపు..?!
  • కలిచివేసే విషాదం..! గంటల వ్యవధిలో గాలిలో కలిసిన నాలుగు ప్రాణాలు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions