.
బీసీ రిజర్వేషన్లను గత స్థానిక ఎన్నికల్లో అడ్డగోలుగా కుదించిపారేసి, బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన బీఆర్ఎస్ క్యాంపు…. తగుదునమ్మా అని, గత తప్పిదాలు మరిచి, కూస్తున్న కూతల ఫాక్ట్ ఫైండింగ్ కచ్చితంగా అవసరం…
బీఆర్ఎస్ పెయిడ్ హౌండ్స్ పొద్దున్నుంచీ ఒకటే లొల్లి…. 42 శాతం అన్నాడు రేవంతుడు, చివరకెు 17 శాతం కూడా బీసీలకు రిజర్వేషన్లు లేవు అని… తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని శతకకారులు అప్పుడెప్పుడో చెప్పారుగా… సేమ్… శరం లేని కేరక్టర్లు…
Ads

ఇదీ బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా… పెద్దాయన ఎలాగూ బయటికి రావడానికి మొహం చెల్లడం లేదు వదిలేద్దాం.,.. హరీష్‌రావు, కేటీయార్ వాదనలూ ఇవే… నిజానికి గతంలో అడ్డగోలుగా బీసీ రిజర్వేషన్లను, అవకాశాల్ని అడ్డంగా కుదించింది, కత్తిరించింది కేసీయారే… ఇక ప్రస్తుతానికి వద్దాం…
17 శాతమే అనేది కరెక్టేనా..?
ఇది ఓ క్షుద్ర వాదన… స్థానిక ఎన్నికల్లో షెడ్యూల్ ఏరియాల్లో పదవులు ఎస్టీలకే రిజర్వు అవుతాయి.,. సో, ఆ స్థానాలు తీసేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్ని రిజర్వ్ అయ్యాయో లెక్క తీయాలి… ఆ సోయి ఆ క్యాంపులో ఉంటే కదా…

చూశారుగా, ఇదీ రియాలిటీ… షెడ్యూల్ ఏరియాల్లో తప్పనిసరిగా ఎస్టీలకే రిజర్వ్ చేయాలి కాబట్టి, అవి తీసేస్తే… నాన్ షెడ్యూల్ ఏరియాల్లో గత కేసీయార్ వైభవోపేత కాలంలో 22.78 శాతం బీసీలకు రిజర్వేషన్లు దక్కాయి… స్వర్ణ యుగం కదా… రేవంత్ రెడ్డి జమానాలో ఈ రిజర్వేషన్లు 23.71 శాతం… అంటే పెరిగాయా, తగ్గాయా..? మరి ఆ దిక్కుమాలిన 17 శాతం లెక్క ఎక్కడి నుంచి వచ్చింది..?
తోచింది, నోటికొచ్చింది రాయడం, మాట్లాడటం..! ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…
42 శాతం రిజర్వేషన్లు అన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఇది అన్యాయం కాదా..?
కోర్టులు ఒప్పుకోవడం లేదు, బీజేపీ సహకరించడం లేదు… మరోవైపు హైకోర్టు గడువు ముంచుకొస్తోంది స్థానిక ఎన్నికలు నిర్వహించాలని… అవి నిర్వహిస్తేనే కేంద్రం గ్రాంట్లు ఇస్తుంది… మరి ఏం చేయాలి..? అధికారికం కాకపోయినా పార్టీపరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకొచ్చాడు..?
సరే, కేసీయార్ రాజకీయాల తెర మీద లేడు, ఎక్కడో పడుకున్నాడు గానీ… పర్ సపోజ్, అరె, డిబేట్ కోసమే… ఒకవేళ పొరపాటునో, తెలంగాణ గ్రహపాటునో కేటీయార్ సీఎం అయితే దీన్ని మించి తను ఇంకేం చేయగలడు..?
ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం…
As per Supreme Court Orders
Triple Test = 3 steps for valid OBC reservation in local body elections:
Constitute a dedicated commission for data collection.
Decide reservation based on empirical data.
Keep total SC + ST + OBC quota ≤ 50%.
-
అంటే ట్రిపుల్ టెస్ట్ ప్రకారం… 50 శాతం లోపు… జనాభాను బట్టి రిజర్వేషన్లు దాటకుండా చూడండి అని చెప్పింది… అది ఏ తీర్పు ప్రకారం అంటే…
The Supreme Court of India, in the landmark judgment Vikas Kishanrao Gawali v. State of Maharashtra (2021), created what is called the Triple Test (TTT).
This was done to ensure that reservations for Other Backward Classes (OBCs) in local self-government bodies (Panchayats, Municipalities, etc.) follow constitutional limits and are based on data, not politics.
ఎలా పడితే అలా రిజర్వేషన్లు ఖరారు చేయకూడదు… ముందుగా షెడ్యూల్ ఏరియాల్లో ఎస్టీలకు రిజర్వ్ చేయాలి, మిగతా వాటిల్లో 50 శాతం దాటకుండా… ఎస్సీలకు ముందుగా రిజర్వ్ చేసి, 50 శాతం లోపు మిగిలినవి ఓబీసీలకు ఇవ్వాలి… ఈ టేబుల్ చూడండి…

రాష్ట్రం గానీ, జిల్లా గానీ రిజర్వేషన్ల శాతానికి యూనిట్ కాదు… సర్పంచ్ పదవులకు మండలం యూనిట్, వార్డు సభ్యుల కోసం గ్రామం యూనిట్… అలా లెక్క తీస్తే పై టేబుల్‌లో చెప్పినట్టు రిజర్వేషన్లు దక్కాయి… తప్పదు… పొరపాటున ఇప్పుడు సీఎం కుర్చీలో కేటీయార్ కూర్చున్నా ఇదే చేయాల్సింది…
వార్డు మెంబర్ల రిజర్వేషన్లలో బీసీలకు దక్కినవి ఏకంగా 23.59 శాతం… కేసీయార్‌కు ఇదీ చేతకాలేదు… పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు.,.? 42 శాతం బీసీలకు కాంగ్రెస్ నుంచి సీట్లు ఇస్తాం, మీకు ఆ దమ్ముందా అని సవాల్ విసురుతున్నాడు… ఈ కోణంలో మాత్రం కాడి కింద పడేసిన అపర చాణక్యుడు కేసీయార్ నుంచి మాటాపలుకూ లేదు… పిటీ…
ఇప్పుడు అర్థమైంది కదా… బీసీలకు కేవలం 17 శాతమే రిజర్వేషన్లు అంటూ బీఆర్ఎస్ క్యాంపు చేస్తున్న గాయిగత్తరలో అసలు నిజాలేమిటో..!!
Share this Article