Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండియాను కావాలనే గోకుతున్న చైనా… అసలేం జరిగిందంటే..?

November 29, 2025 by M S R

.

Pardha Saradhi Potluri ……. చైనా మళ్ళీ ఆట మొదలు పెట్టింది!
ఈసారి అరుణాచల్ ప్రదేశ్ ని అంతర్జాతీయంగా హైలైట్ చేసింది!

పెమ వాంగ్ తొంగ్డోక్ ( Pema Wang Thongdok) భారత పౌరురాలు!
లండన్ నుండి జపాన్ వెళుతూ ట్రాన్సిట్ కోసం చైనాలోని షాన్గయ్ ఎయిర్ పోర్ట్ ( Shanghai )లో దిగింది. షాన్ఘయ్ నుండి వేరే ఫ్లైట్ ఎక్కి జపాన్ వెళ్ళవలసి ఉంది!

Ads

జపాన్ వెళ్ళవలసిన ఫ్లైట్ కోసం వేచి చూస్తున్న సమయంలో చైనా ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు తొంగ్డోక్ ని తనతో రమ్మని తీసుకోనివెళ్లి 18 గంటలపాటు నిర్భంధంలో ఉంచారు.
చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెతో మీరు అరుణాచల్ ప్రదేశ్ లో పుట్టినట్లుగా మీ పాస్ పోర్ట్ లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ మెయిన్ ల్యాండ్ చైనాలో భాగం కాబట్టి మీ ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదు. మీరు చైనా పాస్పోర్ట్ తీసుకుంటేనే మిమ్మల్ని ఇక్కడినుండి వెళ్ళనిస్తాం లేదా మీరు ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోవాల్సి ఉంటుందని బెదిరించారు!

తొంగ్డోక్ చాలా సేపు చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులతో వాదించింది నేను భారత పౌరురాలిని అని, అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అని… కానీ చైనా అధికారులు ఆమెతో మీ భారత పాస్ పోర్ట్ చెల్లదు, మీరు చైనా పాస్పోర్ట్ తీసుకుంటేనే ఇక్కడినుండి వెళ్ళానిస్తాం అని పట్టుబట్టారు!
18 గంటలపాటు ఆమెని ఎయిర్ పోర్ట్ లోనే ఉంచి మాటలతో కించపరిచారు చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు.

చివరికి తొంగ్డోక్ షాన్ఘయ్ లోని భారత కాన్సులేట్ అధికారులకి ఫోన్ చేసి, తన నిర్భంధం గురుంచి చెప్పగానే బీజింగ్ , షాన్ఘయ్ లోని భారత విదేశాంగ శాఖ అధికారులు ఎయిర్ పోర్ట్ కి వచ్చి తొంగ్డోక్ ని విడిపించి జపాన్ పంపించారు!

X వేదికగా ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. తన ట్వ్వీట్ లో చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు నన్ను అవహేళనగా మాట్లాడారు నాకు అర్ధం కాని మాండరిన్ లో మాట్లాడుతూ అని పేర్కొంది.

ఇక్కడ మూడు అంశాలు మనం జాగ్రత్తగ్గా గుర్తు పెట్టుకోవాలి
1.తొంగ్డోక్ లండన్ నుండి షాన్ఘయ్ కి వచ్చిన విమానం CHINA EASTERN ఎయిర్ లైన్స్ ది. ఈ చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ సిబ్బంది తొంగ్డోక్ లండన్ లో విమానం ఎక్కిన తరువాత ఆమె అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన మహిళ అని గుర్తించారు.

2.విమానం షాన్ఘయ్ లో లాండయ్యాక విమాన సిబ్బంది ఎయిర్ పోర్ట్ లో ని ఇమ్మిగ్రేషన్ అధికారులకి సమాచారం ఇచ్చారు. విమాన సిబ్బందిలో ఇద్దరు ఇమ్మిగ్రేషన్ అధికారులతో వచ్చి మరీ చూపుడు వేలు చూపిస్తూ పెమ వాంగ్ తొంగ్డోక్ ని చూపించారు.

ఇమ్మిగ్రేషన్ అధికారులకి. అప్పటికే ట్రాన్సిట్ కోసం Q లోనిలబడి ఉన్న తొంగ్డోక్ ని అధికారులు తమతో రమ్మని సైగ చేసి తీసుకెళ్లారు.
ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులు కలిసి అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలోలోనిదట, ఈవిడ భారత పౌరురాలు అట అని వేలు పెట్టి చూపిస్తూ నవ్వారని తొంగ్డోక్ X వేదికలో చెప్పుకొచ్చింది…

*********************
యాదృచ్చికమా ? లేక కావాలని చేసిందా?
కావాలనే చైనా ఈ పని చేసింది!
ఎందుకంటే…

తొంగ్డోక్ లండన్ నుండి జపాన్ కి వయా చైనా చాలాసార్లు వెళ్ళానని, ఎప్పుడూ ఇలా ఆపలేదని చెప్పింది!
ఆమె భారత పౌరురాలే అయినా లండన్ లోని ఒక ఫైనాన్సియల్ కన్సల్టెంట్ సంస్థలో ఉన్నత హోదాలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నది. అప్పుడప్పుడు భారత్ వచ్చి వెళ్ళేది. ఈ సారి కూడా జపాన్ వెళుతున్నది తాను పనిచేస్తున్న సంస్థ తరుపున మీటింగ్ లో పాల్గొనడానికి , కానీ చిక్కుల్లో పడ్డది!

మోడీ ఫాక్టర్? లేక జపాన్ ఫాక్టర్?
లండన్ కి చెందిన ఫైనాన్సియల్ కన్సల్టెన్సీ సంస్థకి చెందిన ఉద్యోగిని, అందులోనూ హై ర్యాంకింగ్ ఉద్యోగిని చైనా నిర్భంధించింది అంటే అది బ్రిటన్ తో పాటు భారత్ కి కూడా అవమానమే!
చైనా చాలా వేగంగా పావులు కదుపుతున్నది ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా!

చైనాకి బ్రిటన్ లొంగిపోయి చాలా కాలం అయ్యింది! కాబట్టి బ్రిటన్ అభ్యంతరాలని చైనా లెక్క చేయదు, పైగా ఏకంగా బ్రిటన్ నే బెదిరిస్తున్నది!

చైనా మెగా ఎంబసీ వివాదం!
లండన్ లో చైనాకి రాయబార కార్యాలయం ఉంది అన్ని దేశాలకి ఉన్నట్లే!
కానీ చైనాకి లండన్ లో ఇప్పుడున్న రాయబార కార్యాలయం సరిపోవట్లేదుట!
అందుకని మరింత ఎక్కువ స్థలంలో కొత్త రాయబార కార్యాలయం కావాలని పట్టుబట్టి ఒప్పించింది బ్రిటన్ ప్రధాని కీర్ స్ట్రామర్ చేత!
యూరోపు లోనే అతి పెద్ద రాయబార కార్యాలయం అవబోతున్నది లండన్ లోని చైనా రాయబార కార్యాలయం!

మెగా ఎంబసీ!
Yes! మెగా ఎంబసీ అని పిలుస్తున్నాయి బ్రిటన్ పత్రికలు!
చైనా మెగా ఎంబసీ వైశాల్యం అక్షరాలా 20 వేల చదరపు మీటర్లు ( అడుగులు కాదు).
మెగా ఎంబసీ కోసం చైనా అడిగిన స్థలం ఏదో తెలుసా?
ప్రతిష్టాత్మకమైన రాయల్ మింట్ కోర్ట్ ( Royal Mint Court) ని చైనా మెగా ఎంబసీ కోసం అడుగుతున్నది. పక్కనే మరో ప్రతిష్టాత్మకమైన టవర్ బ్రిడ్జ్ ( Tower Bridge ) ఉన్నది.

2018 లో అప్పట్లో బ్రిటన్ ఫారిన్ సెక్రటరీగా ఉన్న బోరిస్ జాన్సన్ ని చైనా తనకి రాయల్ మింట్ కోర్ట్ ని కేటాయించమని అడిగింది, విదేశాంగ మంత్రిగా బోరిస్ జాన్సన్ సూత్రప్రాయంగా అంగీకరించాడు కూడా. తరువాతి కాలంలో బోరిస్ జాన్సన్ ప్రధాన మంత్రి అయినా బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థ ని చక్కదిద్దే ప్రయత్నంలో విఫలమవడం, రాజీనామా చేయడం జరిగింది.
So! 20 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో తమ రాయబార కార్యాలయంని విస్తరించాలనే ప్లాన్ లో ఉంది చైనా గత దశాబ్దకాలంగా.
ప్రస్తుత ప్రధాని లెఫ్టిస్ట్ అయిన కీర్ స్ట్రామర్ ఆమోద ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాడు…   (తరువాయి భాగం మరో కథనంలో...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రహేఁ నా రహేఁ హమ్…! ‘సుమనో’హర మధుర స్మృతి, ఒక మూగ వేదన..!
  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • అప్పట్లో జోసెఫ్ విజయ్ మహా సిగ్గరి… చిన్న కళ్లు, బక్కగా, నల్లగా… కానీ..?
  • బాల్క సుమన్‌పై తెలంగాణ సర్కారు సీరియస్… దేశద్రోహం కేసు..!!
  • తుమ్మిడిహెట్టి… రేవంత్ సీరియస్ టోన్… ఫడ్నవీస్ వింటున్నావా..?
  • తెలంగాణపైకి వలసవాదం ముంచుకొస్తోంది అనడమే పెద్ద వంచకభాష..!
  • The Scape Goat… అదే ఆ పాత కథే… అనేక భాషలు… వందల సినిమాలు…
  • షర్మిలకు రాజ్యసభ సీటు..! ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా ఏమిటట..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions