.
Pardha Saradhi Potluri ……. అమెరికాతో స్నేహం అంటే ఇలానే ఉంటుంది!
అమెరికా నుండి ఉక్రెయిన్ కి అందే ఆయుధ సహాయం జెర్మనీ ద్వారా జరుతుంది అని చెప్పి కొంతకాలం అమెరికా నుండి నేరుగా జెర్మనీకి ఆయుధాలు సరఫరా చేసింది.
అమెరికా పెంటగాన్ నేరుగా జెర్మనీ డిఫెన్స్ డిపార్ట్మెంట్ తో కమ్యూనికేషన్ వ్యవస్థని నెలకొల్పింది! ఏదన్నా కావాలన్నా, వివరణ ఇవ్వాలన్నా జెర్మన్ సైనిక అధికారులు హాట్ లైన్ లో నేరుగా పెంటగాన్ తో సంప్రదింపులు జరిపేవారు!
Ads
నిన్న హఠాత్తుగా పెంటగాన్ హాట్ లైన్ ని డిస్కనెక్ట్ చేసేసింది జెర్మనీతో… ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా!
అమెరికాకి యూరోపుతో కానీ, నాటో కూటమి దేశాలతో ఇక పెద్దగా అవసరం లేదని భావించింది! ఉక్రెయిన్ విషయంలో బాధ్యత నాటో లేదా యూరోపియన్ దేశాలదే బాధ్యత అని చెప్పకనే చెప్పినట్లయింది.
ఇల్యూమినాటి కి ఇప్పుడు యూరోపుతో అవసరం లేదు! ఉక్రెయిన్ విషయంలో తాము పెద్ద తప్పు చేశామని అర్ధమయింది. ఇంకో రెండు నెలలు అయితే రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మొదలయి నాలుగేళ్లు అవుతుంది!
నాలుగేళ్లు అవుతున్నా రష్యన్ మిలిటరీ పవర్ ఏమాత్రం తగ్గలేదు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేస్తూ పరోక్షంగా యుద్ధం చేస్తున్నా పుతిన్ వెనకడుగు వేయట్లేదు!
F-16 లు పనిచేయలేదు. HIMARS ఆర్టీలరీ రాకెట్స్ పనిచేసినా రష్యా మీద ప్రభావం చూపలేదు. రష్యా తన ఆయుధ ఫాక్టరీలని రాత్రింబవళ్ళు పనిచేయిస్తూ ఆయుధ సరఫరా తగ్గకుండా నిలబడ్డది! ఉక్రెయిన్ కి ఆర్ధిక, ఆయుధ సరఫరా చేసుకుంటూ వెళితే చివరికి నష్టపోయేది అమెరికా, యూరోపు మాత్రమే! ఉక్రెయిన్ కొత్తగా నష్టపోయేది ఏమీ లేదు.
ఉక్రెయిన్ ని నాటోలో భాగస్వామిగా చేసి లాభపడదాం అని వేసుకున్న ప్లాన్ విఫలం అయ్యింది.
అమెరికా తప్పుకోవడానికి ప్రధాన కారణం రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా ఆగిపోవడమే!
బ్రిటన్ పరిస్థితి ఘోరంగా తయారయ్యింది.
- ఇటీవలే ఇద్దరు బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ని నిర్భంధించింది ఉక్రెయిన్ సైన్యం! సదరు బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉంటూ ఉక్రెయిన్ సైన్యానికి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇస్తున్నారు. కానీ డబ్బుకి ఆశపడి ఉక్రెయిన్ మిలిటరీ వ్యూహలని రష్యాకి ఇస్తూ ఉక్రెయిన్ సైన్యానికి రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డారు! పట్టుబడ్డ ఇద్దరు బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ తమ నేరాన్ని ఒప్పుకున్నారు కూడా!
కీవ్ లో కెనడా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలకి చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్, వార్ ప్లానర్ ఉక్రెయిన్ కి సహాయం చేస్తున్నారు గత మూడేళ్లుగా. వీళ్ళలో వార్ వెటరన్స్ తో పాటు యాక్టీవ్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పట్టుబడ్డది ఇద్దరు బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మాత్రమే! దొరకకుండా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు.
ఒకవేళ ఉక్రెయిన్ తెలుసుకోవాలని ప్రయత్నించినా తగినంత మంది సిబ్బంది లేరు . పైగా తమకి సహాయం చేయడానికి విదేశాల నుండి వచ్చిన వాళ్ళని అనుమానించి విచారణ చేయడం అనేది ఉక్రెయిన్ కే నష్టం కలిగిస్తుంది!
అఫ్కోర్స్! తమ దేశంలో గూఢచర్యం చేయడానికి వచ్చిన అమెరికన్ ఏజెంట్లని తమ వైపుకి తిప్పుకొని, వాళ్ళని డబుల్ ఎజెంట్స్ గా మార్చిన చరిత్ర సోవియట్ యూనియన్ కి ఉంది! చెప్పుకుంటూ పొతే కోల్డ్ వార్ ఎరా డబుల్ ఎజెంట్స్ కధలు బోలెడన్ని ఉన్నాయి!
పైగా మాజీ KGB అధిపతి అయిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు రష్యా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఉక్రెయిన్ లో బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ రష్యా కోసం పనిచేస్తూ పట్టుబడడం పూర్వ చరిత్ర తెలియనివాళ్లకి ఆశ్చర్యం కలిగించ వచ్చు!
పుతిన్ రెండు రోజుల భారత పర్యటనకి వస్తున్నాడు!
డిసెంబర్ 4, 5 తేదీలలో పుతిన్ భారత పర్యటనకి వస్తున్న సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ రాయబారానికి తన దూతని మాస్కో పంపించాడు!
స్టీవ్ విట్కాఫ్ ( Steve Witkoff)ని డోనాల్డ్ ట్రంప్ తరుపున చర్చలు జరపడం కోసం మాస్కో పంపించాడు!
గత మంగళవారం మాస్కో చేరుకున్న విట్కాఫ్ మాస్కోలో పుతిన్ అనుచరుడు అయిన యురి ఉషకోవ్ ( Yuri Ushakov) తో మూడు గంటల పాటు చర్చలు జరిపి తిరిగి అదే రోజు రాత్రి అమెరికా వెళ్ళిపోయాడు.
యురి ఉషకోవ్ విలేఖరులతో మాట్లాడుతూ ఉక్రెయిన్ తో రష్యా యుద్ధ విరమణ మీద జరిగిన చర్చలలో ఎలాంటి పురోగతి లేదని స్పష్టం చేశాడు. అంటే ట్రంప్ తరుపున మాట్లాడడానికి వచ్చిన విట్కాఫ్ ఉక్రెయిన్ తో యుద్ధవిరమణ కోసం సమాచారం తెచ్చాడన్నమాట!
నేను యూరోపు తో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను – పుతిన్!
- పుతిన్ ఈ మాట అనడానికి కారణం?
విట్కాఫ్ ని మాస్కో పంపించడానికి ముందే ఉక్రెయిన్ కి సహాయం ఆపేస్తున్నాను, అందుకే జెర్మనీతో పెంటగాన్ కి ఉన్న హాట్ లైన్ కమ్యూనికేషన్ ని ఉపసంహరించేసాను కాబట్టి ఉక్రెయిన్ విషయం ఇకముందు యూరోపు చూసుకుంటుంది కానీ అమెరికా జోక్యం చేసుకోదు అనే సంకేతాన్ని ఇచ్చాడు ట్రంప్!
కానీ పుతిన్ నమ్మలేదు! అందుకే అమెరికా కాకపొతే యూరోపుతో అయినా సరే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించాడు!
పుతిన్- మోడీ మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయో అనే భయం అమెరికాకి ఉంది అనడానికి తార్కాణమే విట్కాఫ్ ఆకస్మిక మాస్కో పర్యటన! జెర్మనీతో హాట్ లైన్ ని కట్ చేయడం!
- ఈ రోజు రేవు పుతిన్ భారత్ లో చేయబోయే పర్యటన, ద్వైపాక్షిక ఒప్పందాల మీద ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.
ముఖ్యంగా అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు, చైనా, పాకిస్తాన్ దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి!
2021 లో అంటే ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలు పెట్టడానికి మూడు నెలల ముందు పుతిన్ భారత్ లో పర్యటించాడు! 2025 డిసెంబర్ లో మళ్ళీ పర్యటనకి వస్తున్నాడు. ఈసారి మోడీతో జరిపే చర్చలని రహస్యంగా ఉంచుతారు తప్పితే పూర్తి సమాచారం బయటికి రాకపోవచ్చు!
బహుశా ఉక్రెయిన్ తో యుద్ధ విరమణ అనేది పుతిన్ న్యూ ఢిల్లీ నుండి మాస్కో వెళ్లిన తరువాత ప్రకటించవచ్చు! ఇది రెండు దేశాలకి మంచిదే!
పుతిన్ భారత్ పర్యటనకి రాకముందే ఉక్రెయిన్ తో యుద్ధ విరమణ కోసం అంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం 28 పాయింట్స్ తో ఒక ఫార్ములా సిద్ధం చేసి పుతిన్ ముందు పెట్టినట్లుగా తెలుస్తున్నది! విట్కాఫ్ ఈ 28 పాయింట్ ఫార్ములానే పుతిన్ కి వివరించి యుద్ధ విరమణ చేయడానికి ఒప్పుకుంటే జెలెన్స్కీ తో మాట్లాడి ఒప్పిస్తాను అని చెప్పినట్లుగా తెలుస్తున్నది.
1.ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో భాగస్వామి కాదు.
2.2014 లో రిఫరిండం ద్వారా క్రిమియాని స్వాధీనం చేసుకున్నది రష్యా. అది వివాదంలో ఉంది కానీ క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా గుర్తిస్తుంది.
3.ప్రస్తుతం రష్యా సైన్యం అధీనంలో ఉన్న డోంబాస్ ( Donbas) ని రష్యా ఉంచేసుకోవచ్చు. ఇదే డోన్ బాస్ రీజియన్లో డొనేట్స్క్ ( Donetsk), లూహాన్స్క్ ( Luhansk) లు ఉన్నాయి.
4.డోన్ బాస్ రీజియన్ లో ఇప్పటికీ 14% భూమి ఉక్రెయిన్ సైన్యం అదీనంలో వుంది. కానీ ఒప్పందానికి రష్యా అంగీకరిస్తే ఉక్రెయిన్ సైన్యం అ ప్రాంతం నుండి ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోతుంది, అయితే ఆ ప్రాంతాన్ని నిస్సైనిక ప్రాంతంగా గుర్తించి ఖాళీగా ఉంచేయాల్సి ఉంటుంది. రష్యన్ సైన్యం కూడా ఉండడానికి వీలులేదు.
5. దక్షిణ ఉక్రెయిన్ లో ప్రస్తుతం జపోర్జియా ( Zaporizhia), ఖేర్సన్ ( Kheroson) లలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నది. అయితే ఈ ప్రాంతంలో 70% రష్యా అదీనంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలు నల్ల సముద్ర ( Black Sea) తీరంలో ఉన్నాయి కాబట్టి నల్ల సముద్రంతో ఉక్రెయిన్ కి కూడా పని ఉంటుంది కాబట్టి యుద్ధవిరమణ తరువాత చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావచ్చు! ఇక్కడ స్క్రిప్ట్ లో ఒక లాక్ ఉంది అది బ్లాక్ సీ తో ఉక్రెయిన్ కి సంబంధం ఉంది అనడం!
6.ఉక్రెయిన్ లో లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్స్ ని ఉంచకూడదు.
7.ఉక్రెయిన్ సైన్యాన్ని ఇప్పుడున్న సంఖ్య కంటే 40% తగ్గించాలి అంటే యాక్టీవ్, రిజర్వ్ లతో కలిపి నాలుగు లక్షల కంటే ఎక్కువమంది సైనికులని ఉంచకూడదు.
*************
ట్రంప్ ప్రతిపాదించినట్లుగా చెప్తున్న ఈ సంధి ప్రయత్నాల ప్రణాళిక అధికారికంగా వైట్ హౌస్ నుండి వెలువడ్డది కాదు. కొన్ని పత్రికలలో ఫలానా సోర్స్ నుండి వచ్చిన సమాచారం అని పేర్కొంటూ ప్రచురితం అయినవే!
విట్కాఫ్ ట్రంప్ తరుపున జరిపిన రాయబారం విఫలం అవడానికి కారణం గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే!
డోనాల్డ్ ట్రంప్ ఏ సందర్భంలో ఏమన్నాడో చూద్దాం…
“ సెప్టెంబర్ 2023 లో……… ఉక్రెయిన్ యుద్ధంలో తాను కోల్పోయిన భూభాగాలని తిరిగి గెలుచుకుంటుంది నాటో, యూరోపియన్ యూనియన్ సహాయంతో ”
“2024 లో……… అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నేను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల లోపు రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపేస్తాను”
“ఆగస్ట్ 11,2025 న మాట్లాడుతూ……… రష్యా ఉక్రెయిన్ ఎంతో కొంత భూమిని త్యాగం చేసి ఒక ఒప్పందానికి రావాలి. రష్యా ఉక్రెయిన్ లోని ముఖ్యమైన భూభాగాలని ఆక్రమించుకుంది, నేను రష్యా ఆక్రమించుకున్న భూభాగాలలో ఎంతో కొంత తిరిగి ఉక్రెయిన్ కి వచ్చేట్లుగా మాట్లాడి పుతిన్ ని ఒప్పిస్తాను ”
“గత అక్టోబర్ నెలలో……….. ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోకి ఎక్కబోతుండగా విలేఖరులు అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ ఇప్పుడు రష్యా సైన్యం ఎక్కడైతే ఉందో అక్కడి వరకూ సరిహద్దులు నిర్ణయించి యుద్ధం ఆపేసి తరువాత చర్చల ద్వారా ఒక ఒప్పందానికి రావాలి ”
“ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో……… ట్రంప్ ఓవల్ ఆఫీస్ లో జెలెన్స్కీ ని ఎదురుగా కూర్చోబెట్టుకొని నీకు వేరే దారి లేదు, నీ ప్రజలు, సైనికులు చనిపోతున్నారు, ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి కాబట్టి పుతిన్ తో శాంతి ఒప్పందం చేసుకో ”
అమెరికా చరిత్రని పరిశీలిస్తే డోనాల్డ్ ట్రంప్ లాగా పొంతనలేని, అపరిపక్వ, పరిణతి లేని అధ్యక్షుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరూ లేరనే చెప్పుకోవాల్సి ఉంటుంది.
డోనాల్డ్ ది డక్ ట్రంప్ అంటేనే సమంజసంగా ఉంటుంది! బాతుకి అన్నా కొద్దో గొప్పో మెదడు ఉంటుంది!
యూరోపియన్లు పరాన్నభుక్కులు ( ప్యారసైట్స్).
ఉక్రెయిన్ ని నాటోలో భాగస్వామిగా చేసుకోవాలని వేసిన ప్లాన్ వల్లనే పుతిన్ ఫిబ్రవరి 23, 2022 లో స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ ( SMO ) పేరుతో ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలుపెట్టాల్సి వచ్చింది!
ఇక జెలెన్స్కీ కి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఉక్రెనియన్లు యూదులు తలదాచుకున్న ప్రదేశాలని నాజీ సైన్యానికి చూపించి వాళ్ళ మరణానికి కారకులు అయ్యారన్న పగతో ఉక్రెయిన్ నాశనానికి పూనుకున్న ఆధునిక శకుని!
ట్రంప్ జెలెన్స్కీ చేతిలో ఒక పావుగా మారడానికి కారణం ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆస్తులని కొన్నాడు యూరోపులో. ట్రంప్ జెలెన్ స్కీ ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఆస్తులు ఏఏ దేశాలలో కొన్నాడో లిస్ట్ ట్రంప్ దగ్గర ఉంది.
ప్రస్తుతం రష్యా అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ట్రంప్ కి రేర్ ఎర్త్ మినరల్స్ ని వెలికి తీసి వాటిని ప్రాసెస్ చేసి ఇవ్వగల దేశం కావాలి ఇప్పుడు. పుతిన్ తో బేరసారాలు చేయడానికి కారణమ్ ఇదే!
అఫ్కోర్స్! ఇంత జరుగుతున్నా అమెరికా శుద్ధి చేసిన యురేనియంని రష్యా నుండి కొంటూనే ఉన్నది ఇప్పటికీ!
యూరోపు దేశాలు ఇంకా భ్రమలోనే ఉన్నాయి!
ఇంత జరుగుతున్నా డేన్మార్క్, స్వీడన్, నార్వే, నేదర్లాండ్స్ దేశాలు ఉక్రెయిన్ కి మద్దతుగా 1 బిలియన్ డాల్లర్లని విరాళాంగా ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ఈ వన్ బిలియన్ డాలర్లతో అమెరికా నుండి ఆయుధాలు కొని ఉక్రెయిన్ కి ఇస్తాయిట . అవుట్ డేట్ అయిపోయినవి, అప్ గ్రేడ్ కోసం ఎదురుచూస్తున్నవి అమ్ముతుంది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్!
So! Let us welcome Vladimir Putin!
Share this Article