.
మూడున్నర గంటల ధురంధర్ సినిమా ఎడిటింగ్ ఎలా ఉండకూడదో చెప్పింది… కాగా బీజీఎం అంటే ఎలా ఉండాలో ఓ మలయాళ సినిమా చూపించింది… ఈ సినిమా పేరు డీఎస్ ఈరే… మన నందమూరి థమన్ ఖచ్చితంగా చూాడాల్సిన సినిమా…
సౌండ్ బాక్సులు పగిలితే అది తన బీజీఎం ఘనత అనుకుంటాడు… ఎక్కువ డెసిబిల్స్ ఎక్కువ మెరిట్ అనుకుంటాడు తను… అఫ్‌కోర్స్, తనే కాదు, చాలామంది సంగీత దర్శకులు ఇటీవల ఈ శబ్దతీవ్రత భ్రమల్లోనే ఉన్నారు… కానీ శబ్దంకన్నా నిశ్శబ్దం ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కొన్నిసార్లు…
Ads
సాధారణంగా హారర్ సినిమాలలో, హఠాత్తుగా వచ్చే బిగ్గరైన, ‘ఢమ ఢమ’ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) లేదా జంప్ స్కేర్స్ (Jump Scares) ద్వారా భయాన్ని కలిగిస్తారు… కానీ, ‘డీయస్ ఈరే’ సినిమా విషయంలో దర్శకుడు రాహుల్ సదాశివన్ ఆ రొటీన్‌ను పక్కనపెట్టాడు…
ఈ సినిమాలో వారు ఉపయోగించిన పద్ధతి…
-
సటిల్ సౌండ్ డిజైన్…: ఈ సినిమా పూర్తిగా సటిల్ (సూక్ష్మమైన), రియలిస్టిక్ (వాస్తవిక) సౌండ్ డిజైన్ మీద ఆధారపడింది…
-
నిశ్శబ్దం (Silence) ధ్వని…: ఒక గదిలోని నిశ్శబ్దం, గోడల పగుళ్లు, నేలపై ఆకులు, కిటికీ శబ్దాలు, నెమ్మదిగా నడిచే అడుగుల చప్పుడు, తలుపులు మెల్లగా తెరుచుకునే ధ్వని వంటి అతి చిన్న, సహజమైన శబ్దాలను చాలా ఎక్కువ వాల్యూమ్‌తో, స్పష్టంగా రికార్డ్ చేశారు…. ఆప్ట్ సీన్లలో అవి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి…
-
సైకలాజికల్ హారర్…: ఈ సహజ శబ్దాలే సైకలాజికల్ హారర్‌ను పెంచాయి. బీజీఎమ్ కన్నా కూడా, ఆ ఇంట్లో ఏదో జరుగుతోందనే భయాన్ని ఈ ధ్వనులు ప్రేక్షకుడి మనసులో బలంగా నాటుతాయి…
-
ఒళ్ళు జలదరించే అనుభూతి..: ఈ సౌండ్ డిజైన్ కారణంగా, ప్రేక్షకులకు ఆ శబ్దాలు తమ చుట్టూ జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది… ఇది నిజంగా థియేటర్/హెడ్‌ఫోన్స్ అనుభవాన్ని ఒళ్ళు జలదరించేలా మార్చింది…
- ఈ సినిమా ఆకర్షణల్లో ఇదీ ఒకటి… సినిమా హీరో విషయానికి వద్దాం.,. మలయాళ స్టార్ మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్… పర్లేదు, తండ్రికి తగిన కొడుకే… ఏడేళ్లయింది ఫీల్డుకు వచ్చి, కొన్ని మంచి సినిమాలు పడ్డాయి… కాకపోతే మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ ఇంకా ముందుగానే ఫీల్డ్‌కు వచ్చి, పాతుకుపోయాడు… తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా పేరు తెచ్చుకున్నాడు… ప్రణవ్ ఇంకా ఈ భాషా వైవిధ్యంపై దృష్టి పెట్టలేదు… ప్రణవ్, దుల్కర్ ఇద్దరిదీ వారసత్వ ఎంట్రీలే ఐనా సరే, సొంత మెరిట్ ఉంది…
‘డీయస్ ఈరే’ అనేది మలయాళంలో రూపొంది, తెలుగులో కూడా విడుదలైన ఒక హారర్ థ్రిల్లర్ చిత్రం… మలయాళంలో భారీ వసూళ్లు సాధించడంతో తెలుగులోకి డబ్ చేశారు… దీనికి ‘భూతకాలం’, ‘భ్రమయుగం’ వంటి విభిన్నమైన హారర్ సినిమాలను అందించిన రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు… అందుకే దీనిపై ఆసక్తి… భ్రమయుగం బాపతు ప్రభావం చూపించలేకపోయినా ఈ సినిమా కూడా పర్లేదు…
రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) అనే ఆర్కిటెక్ట్ తన స్నేహితురాలు కణి ఆత్మహత్య గురించి తెలుసుకుంటాడు… ఆమె కుటుంబాన్ని పరామర్శించి, ఆమె గుర్తుగా ఓ హెయిర్ పిన్ పట్టుకొస్తాడు… తరువాత రోహన్‌కు తన ఇంట్లో విచిత్రమైన, భయపెట్టే అనుభవాలు ఎదురవుతాయి… మొదట్లో అది కణి ఆత్మ అని భావించినా, అది వేరే ఆత్మ అని తెలుసుకుంటాడు… అసలు ఆ ఆత్మ ఎవరు? అది రోహన్‌ను ఎందుకు వెంటాడుతోంది? కణి ఆత్మహత్యకు, ఆ ఆత్మకు సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం వెతకడమే మిగిలిన కథ…
పాజిటివ్ అంశాలు (Pros)
-
టెక్నికల్ వాల్యూస్ & సౌండ్ డిజైన్..: ముందే చెప్పుకున్నట్టు ఈ సినిమాకు అతిపెద్ద బలం సౌండ్ డిజైన్… అనవసరమైన శబ్దాలు లేకుండా, ప్రేక్షకులను భయపెట్టే విధంగా, ఒళ్ళు జలదరించేలా శబ్దాలను ఉపయోగించిన విధానం చాలా కొత్తగా ఉంది… సినిమాటోగ్రఫీ కూడా దృశ్యాలను ఆకట్టుకునేలా ఉంది…
-
దర్శకత్వం & మేకింగ్…: దర్శకుడు రాహుల్ సదాశివన్ రొటీన్ కథాంశాన్ని తీసుకున్నప్పటికీ, దాన్ని విభిన్నమైన, శక్తివంతమైన మేకింగ్‌తో హారర్ అంశాలను పూర్తి స్థాయిలో చూపించడంలో సక్సెస్ అయ్యాడు… అనవసరమైన ఫ్లాష్‌బ్యాక్‌లు లేకుండా కథను పాత్రల బిహేవియర్ ద్వారా నడిపించిన తీరు బాగుంది… తక్కువ పాత్రలే…
-
సెకండాఫ్ & క్లైమాక్స్…: మొదటి భాగంలో కాస్త నెమ్మదిగా ఉన్నా, సెకండాఫ్, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఉత్కంఠగా, థ్రిల్లింగ్‌గా ఉంటాయి… ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది…
-
నటీనటుల నటన…: ప్రణవ్ మోహన్ లాల్ తన పాత్రలో సటిల్డ్‌గా నటించాడు… భయాన్ని వ్యక్తపరిచే సన్నివేశాల్లో ఆయన నటన మెప్పిస్తుంది… ఇతర ముఖ్యపాత్రల నటన కూడా ఆకట్టుకుంటుంది…
నెగెటివ్ అంశాలు (Cons)
-
నెమ్మదించిన ఫస్టాఫ్…: హారర్ థ్రిల్లర్ వేగం ఆశించే వారికి, మొదటి భాగం, ముఖ్యంగా తొలి 20 నిమిషాలు కొంచెం నెమ్మదిగా సాగినట్లు అనిపించవచ్చు…
-
రొటీన్ పాయింట్…: కథాంశం (దెయ్యం వెంటాడటం, ఫ్లాష్‌బ్యాక్) అనేది కొత్తదేమీ కాకపోయినా, దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది…
-
టైటిల్…: ‘Diés Iraé’ అనేది లాటిన్ పదం… దీనికి అర్థం ‘ద డే ఆఫ్ రాత్’ (Day Of Wrath (కోపం చూపించే రోజు) అని… తెలుగు ప్రేక్షకులకు ఈ టైటిల్ అంత సులువుగా అర్థం కాకపోవడం కొంత మైనస్…
‘డీయస్ ఈరే’ ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి, ముఖ్యంగా టెక్నికల్ అంశాలు, సౌండ్ డిజైన్‌ను ఎక్కువగా ఇష్టపడేవారికి తప్పకుండా నచ్చుతుంది… రొటీన్ హారర్ సినిమాలకు భిన్నంగా, పూర్తిగా భయపెట్టే అంశాలపైనే దృష్టి పెట్టిన ఈ చిత్రం మంచి థియేటర్ అనుభూతిని ఇస్తుంది…
Share this Article
