Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చేతికందిన మక్క పంట కాలిపోయి..! సీఎం స్పందన భేష్..!

April 30, 2026 by M S R

.

పాలకుడికి మానవతా ధోరణి ఉండాలి… అది ప్రభుత్వ తప్పిదం కావచ్చు, ప్రకృతి విపత్తు కావచ్చు… ఎవరికైనా నష్టం వాటిల్లితే వెంటనే స్పందించి ఆదుకునే హృదయం ఉండాలి…. రేవంత్ రెడ్డి దాన్ని చాటుకున్నాడు… అది అవసరం కూడా…

ఎందుకంటే..? ఇలాంటి సందర్భాల్లో, ప్రత్యేకించి రైతులు పంటల్ని తమ తప్పిదం లేకుండా నష్టపోయే సందర్భాల్లో వెంటనే ప్రభుత్వం అండగా ఉంటుందనే సంకేతాన్ని ప్రజలకు, అధికారులకు ఇవ్వడానికి పాలకుడి స్పందన ఉపకరిస్తుంది… అది అధికారగణానికి ఓ డైరెక్షన్…

Ads

విషయం ఏమిటంటే… నిర్మల్ మండలంలో షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్ని ఎకరాల్లో వరి, ప్రత్యేకించి మొక్కజొన్న పొలాలు అక్షరాలా కాలిపోయాయి… కాలిపోయిన మక్క కంకుల్ని ఏరుకుంటూ మహిళలు ఏడుస్తున్న సీన్లు పొద్దుణ్నుంచీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి… నిజంగా చేతికొచ్చిన పంట కాలిపోతే అంతకన్నా విషాదం ఏముంటుంది..? అన్నదాతకు తనకు తోడుగా ఉన్న పశువులైనా, చేతికొచ్చిన పంటయినా బిడ్డలతో సమానం కదా…

అవి రేవంత్ రెడ్డి కంటబడ్డాయి… టైమ్‌కు తమ దృష్టికి తీసుకుపోయిన తన టీమ్‌ను మెచ్చుకోవాలి… వెంటనే ఆ రైతుల నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, తగిన పరిహారాలు, ఆర్థికసాయం అందించేలా సదరు జిల్లా కలెక్టర్‌తో కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించాడు… గుడ్…

ముందే చెప్పినట్టు… ఇలాంటివి ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తాయి… సమయానికి స్పందిండిరా బాబూ అని అధికారగణానికి ఇలాంటివి ఆదేశాలు కావు, శాసనాలు… అంతేకాదు, ఆ లోకల్ నాయకులకూ ‘ఇలాంటి విపత్తుల్లో జిల్లా యంత్రాంగంతో కోఆర్డినేట్ చేసుకుని, రిలీఫ్ ఇప్పించండి’ అనే సంకేతాల్ని ఇచ్చినట్టు లెక్క..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చేతికందిన మక్క పంట కాలిపోయి..! సీఎం స్పందన భేష్..!
  • ‘కర’… ఉత్త సోది… ధనుష్ ఎందుకిలాంటి సినిమాలు చేస్తాడు…?
  • TRS… కవిత పార్టీ పేరులో మరో ట్విస్టు… రాష్ట్ర సేన కాదు, రక్షణ సేన..!!
  • ఆ అసందర్శపు, అసంగత ప్రశ్నకూ… ఆమె పరిణత జవాబు సూపర్…
  • ఆపద్బాంధవుడు… కాసిన్ని కాసులు… బోలెడన్ని చప్పట్లు- అవార్డులు…
  • తుమ్మిడిహట్టిపై రేవంత్‌రెడ్డి తెలివైన ‘ఎత్తు’గడ… బీజేపీని లాగాడు…
  • రాజీవ్ హంతకుడు ఇప్పుడు లాయర్ వృత్తిలోకి..! మళ్లీ ఓ చిక్కుముడి..!!
  • అంబానీ ఐపీఎల్ జట్టుకు ఇక సెలవు… కొత్త ఆటగాళ్లే శరణ్యం…
  • అనామకంగా ఆ భక్తిమాధుర్యం… అది అపురూప స్వరసంగమం…
  • 250 + 250 + టార్గెట్స్..? నో ప్రాబ్లం… సరదాగా కొట్టేద్దాం… ఇదేం ఆటరా బాబోయ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions