.
( పొట్లూరి పార్థసారథి ) …. అమెరికా vs రష్యా, చైనా part -3 … రష్యా, చైనా దేశాల వ్యూహత్మక తప్పిదాలు! ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ అనేది అమెరికా vs రష్యా, చైనా ఎందుకు అనాల్సివచ్చింది అంటే వెనిజులా సైన్యం వాడుతున్న ఆయుధాలు రష్యన్, చైనా తయారీ కనుక!
అమెరికా వెనెజులా మీద డిసెంబర్ 25న దాడి చేయడానికి ప్లాన్ చేసింది! కానీ ట్రంప్ మాత్రం క్రిస్మస్ రోజున నైజీరియా లోని ISIS టార్గెట్ల మీద దాడి చేసి బాంబులని క్రిస్మస్ కానుకగా ఇవ్వాలని నిర్ణయించడంతో డిసెంబర్ 25 కాస్త జనవరి 3 వ తేదీకి వాయిదా పడ్డది!
Ads
ఈ విషయం ఇటు పుతిన్ కి కానీ అటు జీ జిన్ పింగ్ కి కానీ తెలియదు అని అనుకోవడం పిచ్చితనం! వెనిజులా రాజధాని కారకాస్ లో రష్యా, చైనా రాయబార కార్యాలయాలు ఉన్నాయి కానీ అమెరికా దాడి గురుంచి అధ్యక్షుడు నికోలస్ మదురో కి సూచనలు, సలహాలు ఇవ్వలేకపోయాయి.
పోనీ అమెరికా హఠాత్తుగా జనవరి 3న దాడి చేసిందా?
2025 ఆగస్ట్ లో వెనిజులా నుండి డ్రగ్స్ సరఫరాని అడ్డుకోవడానికి అంటూ usa నావీ కారియర్ స్ట్రైక్స్ గ్రూప్ ని దక్షిణ కరేబియన్ సముద్రంలో మొదటిసారిగా మొహరించింది. అఫ్కోర్స్! ఫ్రాన్స్ కూడా తన విమాన వాహక యుద్ధ నౌక చార్లెస్ డి గల్లే ( Charles De Gaulle) ని కూడా కరేబియన్ సముద్ర తీరానికి పంపించింది. ఒకేసారి కొద్ది రోజుల గ్యాప్ లో రెండు విమానవాహక యుద్ధ నౌకలు వెనిజులా తీరంలో మొహరించడం అనేది డ్రగ్స్ సరఫరా అడ్డుకోవడానికా?
డ్రగ్స్ సరఫరా అనేది చిన్న చిన్న స్పీడ్ బోట్స్, ఆటానమస్ సబ్ మెరైన్ల ద్వారా జరుగుతుంది. వీటిని అడ్డుకొని వాటిని సరఫరా చేసే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఫ్రీగేట్స్ తో పాటు హెలికాప్టర్ గన్ షిప్స్ సరిపోతాయి! ఏకంగా కారియర్ స్ట్రైక్స్ గ్రూపుని పంపించడం అనేది అమెరికా వెనిజులా మీద దాడి చేసి స్వాధీనం చేసుకోవడానికే అన్నది తెలుసుకోవడానికి పెద్ద యుద్ధ వ్యూహకర్తలు కానవసరం లేదు. సామాన్య ప్రజలు కూడా అర్ధం చేస్కోగలరు.
వెనిజులాని కాపాడుకోవాలి అని అనుకుంటే రష్యా, చైనాలకి పెద్ద పని కాదు కానీ ఆ పనిచేయలేదు రెండు దేశాలు కూడా! రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్ తో యుద్ధం వలన తన యుద్ధ నౌకలని పంపలేదు కానీ చైనా ఆ పని చేయగలదు కానీ చేయలేదు!
వెనిజులా భౌగొళికంగా అమెరికాకి దగ్గరలో ఉంది రష్యా చైనాలకంటే. పోర్ట్ రికో( Puerto Rico )లో అమెరికాకి నావల్ బేస్ తో పాటు ఎయిర్ బేస్ కూడా ఉంది. పోర్ట్ రికో నుండి సముద్రం ద్వారా వెనిజులా 800 km దూరంలో ఉంది, అదే విమానం ద్వారా రెండుగంటల్లో చేరుకోవచ్చు! అఫ్కోర్స్! పోర్ట్ రికోలో స్థానిక ప్రభుత్వం ఉంటుంది కానీ ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ రంగాలు మాత్రం అమెరికా చూసుకుంటుంది, అమెరికన్ రాజ్యాంగం ని పోర్ట్ రికో ఆమోదించి అమలు చేస్తుంది.
వెనిజులా విషయంలో అమెరికాకి ఇన్ని అనుకూలతలు ఉండగా రష్యా, చైనాలు తమ మిత్ర దేశం విషయంలో ఉదాసీనంగా వ్యవహరించి లాటిన్ అమెరికాలో తమ పట్టుని కోల్పోయాయి!
******
ఎక్కడైనా ఒకటే! ఓడిన ప్రతీ దేశం ఆ దేశపు ద్వారాలు శత్రువుల కోసం తెరవబడ్డవి అంటే అదే దేశపు ద్రోహుల వల్లనే!
వెనిజులా అధ్యక్షుడిని అమెరికా అంత తేలికగా కిడ్నాప్ చేయగలిగింది అంటే అది ఆ దేశ రాజకీయ నాయకులు, సైనిక అధికారులు అమెరికన్ డాలర్లకి అమ్ముడుబోవడం వల్లనే!
ముందు చైనా చేసిన నిర్వాకం ఏమిటో చూద్దాం: అమెరికా దగ్గర స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి కాబట్టి తమ రాడార్లు కొంటే ముందే హెచ్చరిక చేస్తుంది అని చెప్పి చైనా గొప్పగా చెప్పుకొని JY-27V లో ఫ్రీక్వెన్సీ రాడార్ల ( Low Frequency Ground Radar) ని వెనిజులా కి అమ్మింది.
అయితే JY-27V లోఫ్రీక్వెన్సీ రాడార్ F-35 లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్ ని గుర్తించలేకపోయింది!
డిజిటల్ వాయిడ్ ( Digital Void)
డిజిటల్ వాయిడ్ అనే పదం జెనరల్గా మిలిటరీ పరిభాషలో ఉండదు లేదా వాడరు. డిజిటల్ వాయిడ్ అనే పదం డిఫెన్స్ కి సంబంధించిన నిపుణులు, డిఫెన్స్ కి సంబంధించి విశ్లేషణలు, వార్తలు అందించే వెబ్సైటు లు వాడతాయి. డిజిటల్ వాయిడ్ అంటే శత్రుదేశపు కమ్యూనికేషన్ వ్యవస్థ ని పనిచేయకుండా చేయడం లేదా స్థంబింప చేయడం.
ALQ-218,AN/ALQ-99 టాక్టికల్ జామింగ్ పాడ్,AN/ALQ -249 NGJ -MB ( NGJ- MB అంటే New Generation Jamming- Medium Band) EA-18G GROWLER జెట్ తనతో పాటు ALQ-218 డిజిటల్ జామింగ్ పాడ్తో పాటు న్యూ జెనరేషన్ AN/ALQ-249 NGJ-MB ని కూడా ఉపయోగించాయి.
కారకాస్ లో ఉన్న అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలని జామ్ చేసింది. ఒక్క కమ్యూనికేషన్ వ్యవస్థలనే కాదు అన్ని రాడార్లని జామ్ చేసింది ALQ-218.
మియామి స్ట్రెటజిక్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ ( Miami Strategic Intelligence Institute) ఇచ్చిన నివేదిక ప్రకారం వెనిజులా మీద అమెరికా చేసిన దాడి ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ విషయంలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
ఏ దేశం అయినా అమెరికాని ఎదుర్కోవాలి అంటే F-22, F-35 లని కాదు EA-18G గ్రోలర్ జెట్ ని ఎదుర్కొని ముందు కూల్చేయాలి, లేకపోతే ఓటమి తప్పదు! అయితే EA-18G గ్రోలర్ కి అమర్చిన ALQ-218 జామింగ్ పాడ్ అమెరికా దగ్గర ఉన్న ఒక అరడజను జామింగ్ పాడ్ లలో ఒకటీ మాత్రమే! మరో అయిదు రకాల జామింగ్ పాడ్ లు కూడా ఉన్నాయి కానీ తాము దాడి చేయబోయే దేశ రక్షణ వ్యవస్థ ని బట్టి జామింగ్ పాడ్ ల మోడల్స్ ని మారుస్తూ ఉంటుంది.
మియామి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటెలిజెన్స్ మరో విషయం కూడా బయట పెట్టింది అది: చైనా రాడార్లు అయిన JYL-1,JY-11లతోపాటు స్టెల్త్ జెట్స్ ని కనిపెట్టగలదు అని ప్రచారం చేసుకున్న JY-27V రాడార్లు కూడా పనిచేయలేదు.
EA-18G గ్రోలర్ జెట్ తన ALQ-218 జామింగ్ పాడ్ తో కరకాస్ లో ఉన్న అన్ని రాడార్ల ని జామ్ చేసింది.
2025 ఆగస్టు నెల నుండి కరేబియన్ సముద్రంలోనే తిష్ట వేసిన అమెరికన్ కారియర్ స్ట్రైక్స్ గ్రూప్ చైనా, రష్యా రాడార్లు ఏ ఫ్రీక్వెన్సీ ని ఉపయోగిస్తున్నాయో రహస్యంగా రికార్డ్ చేశాయి.
రికార్డ్ చేసిన ఫ్రీక్వెన్సీలని ఎలా జామ్ చేయవచ్చో ప్రయోగాలు చేసి ALQ-218 జామింగ్ పాడ్ లో అమర్చి వాడారు!
ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ విజేత EA-18G Growler. ఈ జెట్ రాడార్లని విజయవంతంగా జామ్ చేయకపోయి ఉంటే ఆపరేషన్ లో పాల్గొన్న 150 విమానాలు, హెలికాప్టర్ల లో కనీసం 10 అన్నా కూలిపోయి ఉండేవి!
మియామి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటెలిజెన్స్ మరో ముఖ్యమైన విషయం రివీల్ చేసింది అది: వెనిజులాలో చైనా రాడార్లని వెనిజులా ఆపరేటర్స్ తోపాటు చైనా వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తున్నారు.
ఎప్పుడైతే విద్యుత్ సరఫరా ఆగిపోయి కారకాస్ చీకట్లో ఉండిపోయిందో EA-18G గ్రోలర్ జెట్స్ రాడార్లని జామ్ చేసి స్పూఫింగ్ చేయడం మొదలుపెట్టింది. స్పూఫింగ్ అంటే EA-18G గ్రోలర్ జెట్ సెకండ్ లో 10 వవంతు సేపు జామింగ్ ని ఆపేసి మళ్ళీ జామింగ్ చేస్తుంది అన్నమాట.
ఇలా చేయడం వల్ల చైనా రాడార్ ఆపరేటర్లకి వాళ్ళ రాడార్ స్క్రీన్ మీద జెట్ సిగ్నేచర్ కనపడి వేంటనే మాయం అయిపోయి, మళ్ళీ ప్రత్యక్ష్యం అవుతుంది కానీ రెండోసారి కనపడినప్పుడు వేరే చోట ఉంటుంది జెట్ సిగ్నేచర్. దీనికి కారణం ఏమిటంటే EA-18G గ్రోలర్ కంటిన్యూస్ గా ఎగురుతూనే ఉంటుంది కాబట్టి జామింగ్ ఆపినప్పుడు హెలికాప్టర్లు, ఇతర జెట్ ఫైటర్స్ వాటి సిగ్నేచర్స్ రాడార్ స్క్రీన్ మీద ప్రత్యక్ష్యం అయి వెంటనే మాయం అయిపోయి మళ్ళీ వేరే చోట ప్రత్యక్ష్యం అవడం జరుగుతుంది.
ఈ టెక్నీక్ ని అర్ధం చేసుకోకుండా చైనా ఆపరేటర్లు రాడర్ పవర్ ని పెంచేశారు. ఎప్పుడైతే రాడార్ పవర్ పెంచారో అంతరిక్షంలో అమెరికన్ నిఘా ఉపగ్రహాలు రాడార్ల నుండి వెలువడుతున్న రేడియేషన్ ని పసిగట్టి వెంటనే లొకేషన్ వివరాలని F-35 లైట్నింగ్ II కి ఇవ్వడం, F-35 లు AGM-88 HARM (Highspeed Anti Radiation Missile) లని ప్రయోగించి రాడార్ లని పేల్చివేయడం జరిగింది.
చైనా రాడార్ ఆపరేటర్లకి అనుభవం లేకపోవడం ఒక ఎత్తయితే మీరు రాడార్ పవర్ పెంచవద్దు అని ఎవరన్నా చెప్పాలని అనుకున్నా వైర్లెస్, మొబైల్, చివరికి ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పని చెయ్యట్లేదు ఆ సమయంలో!
Share this Article