Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేవుళ్లు ఎవరి గుప్పిట్లో ఉన్నారు..? అసలు విముక్తికి ఏమిటీ మార్గం..?!

February 12, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta ….. ఏదన్నా ఘటన జరగగానే దేవాలయాలు ప్రభుత్వాల పెత్తనం నుండి వెళ్ళాలి అంటే తెలివిగా టాపిక్ ను కేంద్రం వైపుకు తిప్పుతున్నారు. దేవాలయాల ప్రభుత్వాల పెత్తవం నుండి వెళ్ళాలి అంటే కేంద్రం దేశం మొత్తానికి చట్టం చేస్తే పోతుందా అని మాట్లాడేస్తుంటారు.

దేవాలయాలు ప్రభుత్వాల పెత్తనం నుంచి బయటకు రావాలి అంటే – నినాదాలు కాదు, చట్టపరమైన నిజాలు మాట్లాడాలి.
కొన్ని నిజాలు చూద్దాం.

Ads

ముందుగా ఒక క్లియర్ పాయింట్ భారతదేశంలో దేవాలయాలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో లేవు. అవి పూర్తిగా రాష్ట్రాల దేవాదాయ , ధర్మాదాయ చట్టాల ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి ఈ అంశాన్ని “దేశం మొత్తం – కేంద్రం” అంటూ తిప్పడం చర్చను పక్కదారి పట్టించే రాజకీయ ప్రయత్నమే.

చట్టపరమైన వాస్తవం భారత రాజ్యాంగం ప్రకారం దేవాలయాల నిర్వహణ, ధార్మిక సంస్థల పరిపాలన , ఆలయ భూములు, ఆదాయం ఇవన్నీ రాష్ట్ర జాబితా (State List) పరిధిలోకి వస్తాయి.
ఎందుకంటే దేవాలయ భూముల రికార్డులు రెవెన్యూ వారి వద్ద, దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో వుంటాయి.

ఇది దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్న పచ్చి నిజం. దీనిలో కేంద్రానికి అజమాయిషీ లేదు, పెత్తనం అంత కంటే లేదు.
అంటే – కేంద్రం చట్టం చేయలేదు, కేంద్రం తీసేయలేదు, కేంద్రం ఇవ్వలేదు
రాష్ట్ర అసెంబ్లీ చట్టం చేస్తేనే మార్పు సాధ్యం



ఇప్పటికే చేసిన రాష్ట్రాలు (ఉదాహరణలతో)
🔹 ఉత్తరాఖండ్…. ఇది మాటల్లో కాదు – చర్యల్లో చూపించిన రాష్ట్రం. చార్‌ధామ్ యాత్ర ప్రాంతంలోని అనేక ఆలయాలు. స్థానిక, సంప్రదాయ దేవాలయాలు. ప్రభుత్వ నియంత్రణ నుంచి తీసి, స్థానిక హిందూ ట్రస్టులు / పూజారి కుటుంబాలకు అప్పగించారు.
ప్రభుత్వ పాత్ర ఏమిటంటే భద్రత, రోడ్లు, సదుపాయాలు, యాత్రికుల నిర్వహణ.
ప్రభుత్వం పని హుండీ ఆదాయం కాదు, ఆచారాల జోక్యం కాదు. అంటే State can step back అన్నది ప్రాక్టికల్‌గా చూపించారు.

🔹 కర్ణాటక… ఇక్కడ పూర్తిగా కాకపోయినా, పాక్షిక ప్రక్షాళన జరిగింది. “ముజ్రాయి” చట్టం పరిధిలో ఉన్న చిన్న & మధ్య స్థాయి దేవాలయాలు గ్రామస్థాయి హిందూ ట్రస్టులకు బదిలీ చేశారు
పెద్ద ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతోంది అయినా – కావాలంటే వదిలేయవచ్చు అని రాష్ట్రం అంగీకరించినట్టే

🔹 మహారాష్ట్ర
మహారాష్ట్ర మోడల్ చాలా కీలకం. ఇక్కడ చాలా దేవాలయాలు అసలు ప్రభుత్వ ఎండోమెంట్ చట్టాల పరిధిలోకే రావు
అవి కుటుంబ ట్రస్టులు, పబ్లిక్ హిందూ ట్రస్టులు, గ్రామ కమిటీలు అధ్వర్యంలోనే ఉంటాయి.
ప్రభుత్వం ఆదాయం తీసుకోదు, నిర్వహణలో జోక్యం చేయదు

🔹 గుజరాత్
ఇక్కడ కూడా పరిస్థితి స్పష్టంగా ఉంటుంది. దేవాలయాలు ఎక్కువగాపబ్లిక్ హిందూ ట్రస్టుల ఆధీనంలోనే
ప్రభుత్వం నియంత్రకుడు కాదు, అవసరమైనప్పుడు సహాయకుడు మాత్రమే

🔹 ఉత్తరప్రదేశ్‌
ఉత్తరప్రదేశ్ లో ఒక ముఖ్యమైన వాస్తవం చాలామందికి తెలియదు – అక్కడ ప్రముఖమైన, ఆదాయం ఎక్కువగా ఉన్న చాలా దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలోనే లేవు. ఉదాహరణకు కాశీ విశ్వనాథ ఆలయాన్ని శ్రీ కాశీ విశ్వనాథ ట్రస్ట్ నిర్వహిస్తుంది; ప్రభుత్వం కారిడార్, భద్రత, సదుపాయాల వరకే పరిమితం, హుండీ లేదా పూజల్లో జోక్యం లేదు.

బృందావన్‌లోని బాంకే బిహారి ఆలయం గోస్వామి వంశీయ ట్రస్ట్ ఆధీనంలోనే ఉంది; అలాగే ప్రేమ మందిర్, ఇస్కాన్ బృందావన్ పూర్తిగా హిందూ ధార్మిక ట్రస్టుల చేతిలోనే ఉన్నాయి. మథురలోని ద్వారకాధీశ్ ఆలయం, వారణాసిలోని సంకట్ మోచన్ హనుమాన్ ఆలయం కూడా కుటుంబ/ పబ్లిక్ హిందూ ట్రస్టుల ఆధీనంలోనే కొనసాగుతున్నాయి.

అసలు కీలకమైన విషయం ఏమిటంటే, ఉత్తరప్రదేశ్‌లో తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్‌లా దేవాలయాలను సమూహంగా స్వాధీనం చేసుకునే HR & CE, ఎండోమెంట్ తరహా చట్టమే లేదు; అందుకే అక్కడ ఆలయాలు సహజంగానే ట్రస్టులు, మహంత్ పరంపరల ఆధీనంలో ఉంటాయి – ప్రభుత్వం దూరంగా, భక్తి- పరిపాలన ట్రస్టుల చేతిలోనే.

🔴 ఇంకా చేయని రాష్ట్రాలు (నిజాయితీగా)
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ మొదలగునవి.
ఇక్కడ దేవాలయాలు, భూములు, హుండీ ఆదాయం అన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే.
ఉదాహరణగా తిరుమల తిరుపతి దేవస్థానాలు పేరుకు autonomous body కానీ – పాలక మండలి, నియామకాలు, నిర్ణయాలు అన్నీ రాష్ట్రం చేతిలోనే. దీన్ని మార్చాలంటే రాష్ట్ర అసెంబ్లీ చట్టం తప్పనిసరి.

🔴 ఆంధ్రప్రదేశ్ విషయంలో అసలు పాయింట్
1989కి ముందు దేవాలయాలు ట్రస్టుల ఆధీనంలోనే. 1989 ఎండోమెంట్ చట్టం ద్వారా రాష్ట్రం స్వాధీనం చేసుకుంది.
ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేస్తే సరిపోతుంది. ప్రస్తుత ప్రభుత్వానికి అసెంబ్లీలో బలమైన మెజారిటీ ఉంది. ఇది అసాధ్యమైన పని కాదు – 10 నిమిషాల చట్టపరమైన ప్రక్రియ. చేస్తే దేశానికి ఆదర్శం, చర్చకు ముగింపు. నిజమైన సంస్కరణ.
వుండాల్సింది అల్లా చేయాలి అనే చిత్తశుద్ధి. అంతే.

సారాంశం…. దేవాలయాల అంశం కేంద్రం చేతిలో లేదు, కోర్టు ఒక్కటే పూర్తి పరిష్కారం కాదు, రాష్ట్ర అసెంబ్లీ చట్టం చేస్తేనే మార్పు సాధ్యం. కావలసింది చట్టపరం అయిన లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ మార్పు.
ఉత్తరాఖండ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర , ఉత్తర ప్రదేశ్ చిత్తశుద్ధి ఉంటే చాలా చోట్ల సాధ్యమే అని ఇప్పటికే నిరూపించాయి.

కాబట్టి రోజూ దేవాలయాల అంశాన్ని దేశం మొత్తం అంటూ పక్కదారి పట్టించకుండా, రాజకీయ బురద కోసం వాడకుండా ముందు రాష్ట్రంలో చట్టం చేయమని అడగండి. కనీసం క్యాబినెట్ లో చర్చకు పెట్టమనండి,
అప్పుడే నిజమైన ప్రక్షాళన జరుగుతుంది.

పొద్దున లేస్తే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటానికి, ఎదురు దాడికి. పాలన మీద వ్యతిరేకం పెరుగుతోంది అన్నప్పుడల్లా భావోద్వేగాలకు కాదు వాడాల్సింది. చిత్తశుద్ధితో ప్రయత్నించాలి…. హిందూ దేశంలో హిందూ గుళ్లకు ఈ దురవస్థ ఏమిటని ఒక్కసారి ఆలోచిస్తే చాలు — ఉపద్రష్ట పార్ధసారధి

#TempleFreedom #StateRights #HinduTrusts #EndowmentAct #DevadayaReforms #PardhaTalks

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దేవుళ్లు ఎవరి గుప్పిట్లో ఉన్నారు..? అసలు విముక్తికి ఏమిటీ మార్గం..?!
  • కౌంటర్ నెరేటివ్స్..! ఆ లడ్డూ నెయ్యికీ, ఈ పెరుగుకూ లింకేమిటి..?
  • బెడిసికొట్టిన పాము కుబుసం ప్లాన్… టీవీ సీరియళ్లు తెగ చూసేదేమో…
  • సమాజ హిత కథనమే… కానీ పెద్దగా పదును లేని కృష్ణ ఆయుధం …
  • మార్పేమీ లేదు… భద్రతామండలి సభ్యత్వంపై ఇప్పటికీ చైనా మోకాలడ్డు..!!
  • అవిశ్వాసం, ఆ పుస్తకం… ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు తప్పు ఎవరిది..?
  • జంట నగరాలు కావు… ఈ విశ్వనగరం ఇప్పుడు చతుర్నగరి… క్వాడ్ సిటీ…
  • పూర్తి వందేమాతర గీతం తప్పనిసరి… ఇదుగో తెలుగు అనువాదం…
  • పాపం, మనం అర్థం చేసుకోలేం గానీ… కోటీశ్వరులకూ కోటి కష్టాలు…
  • నాటి బేబీ షామిలి… తెరపై ‘అంజలి’… నిజజీవితంలో ‘చిత్రలేఖిని’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions