.
కేటీయార్ మహిళా దినోత్సవం సందర్భంగా నాలుగు మంచి మాటలు చెప్పాలనుకున్నాడు… కానీ వెంటనే ఓ కౌంటర్ పరోక్షంగా, బలంగా పడుతుందని అనుకుని ఉండడు… అదీ తన సోదరి కవిత నుంచి…
విషయం ఏమిటంటే..? తను ఎక్స్‌లో ఓ పోస్ట్‌లో ‘‘మహిళలను కేవలం తల్లి, చెల్లెలు, కుమార్తె కోణంలో మాత్రమే చూడటం సరికాదు, తోటి మనుషులుగా గుర్తించాలి, గౌరవించాలి, సమాన హక్కులు ఉంటాయనీ తెలుసుకోవాలి,,. మహిళల పట్ల వివక్ష లేని సమాజం కావాలి… వారి ఎదుగుదలకు అవసరమైన తోడ్పాటు ఇవ్వడం సామాజిక అవసరం… స్త్రీలను ప్రోత్సహించినప్పుడే నిజమైన సాధికారత’’ అని పేర్కొన్నాడు…
Ads
మామూలు స్థితిలో తన అభిప్రాయాలు, వ్యక్తీకరణ గుడ్… కానీ కొంతకాలంగా కేటీయార్ మీద ఉన్న విమర్శ వేరు కదా… సొంత చెల్లెలు కవిత నుంచి కుటుంబానికీ, పార్టీకి దూరం చేశారని కదా… సో, ఈ పోస్టునూ, కవిత పట్ల ఆ కుటుంబం ప్రదర్శించిన వివక్షా ధోరణిని, ఆమెపై బీఆర్ఎస్ నేతల విమర్శల్ని జనం పోల్చుకోవడం ప్రారంభించారు…

మరోవైపు కవిత ‘‘ఏ ఇంట్లో జన్మించినా మహిళలకెు వివక్ష తప్పడం లేదు… తండ్రి, అన్న, భర్త వంటివారు కూడా మహిళలను చిన్నచూపు చూస్తున్నారు… మహిళా దినోత్సవం రోజున మాత్రమే కాదు, ప్రతి రోజూ స్త్రీ గౌరవాన్ని, ప్రాధాన్యాన్ని గుర్తించాలి… మహిళలు రాజకీయాల్లోకి రావాలి, నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి, సమాజంలో మహిళల పాత్రను తక్కువ అంచనా వేయకూడదు’’ అని పేర్కొంది…
ఎస్, తను నేరుగా కేటీయార్‌కు కౌంటర్ ఇవ్వలేదు, కానీ ఏ ఇంట్లో జన్మించినా వివక్ష తప్పడం లేదు, మహిళలకు గౌరవం, ప్రాధాన్యం ఇంటి నుంచే ప్రారంభం కావాలనేలా ఉన్న ఆమె వ్యాఖ్యలు పర్‌ఫెక్ట్‌గా కేటీయార్ మాటలకు, కేసీయార్ కుటుంబం తన పట్ల ప్రదర్శిస్తున్న వివక్షకు కౌంటర్ అన్నట్టుగానే ఉన్నాయి…
అసలే ఒకవైపు హరీష్ రావు రోజుకు నాలుగైదు ఇష్యూస్‌పై రేవంత్ రెడ్డి మీద అటాక్ చేస్తున్నాడు… చిన్నాచితకా ఇష్యూస్ దగ్గర నుంచి అవసర, అనవసర అంశాల దాకా… ప్రతిదీ మాట్లాడుతున్నాడు… సరే, వాటిల్లో ఉన్న పంచ్ మాటెలా ఉన్నా… కేటీయార్‌కు ఏమీ మిగల్చడం లేదు… గతంలో జగదీష్ రెడ్డి వంటి నేతలు ఒకటీ అరా స్పందించేవాళ్లు, ఇప్పుడదీ లేదు…
ఈ స్థితిలో ఏదో ఓ జనరల్ అంశంపై పోస్టు పెట్టినా, ఇదుగో ఇలా సొంత చెల్లెలి నుంచి కూడా కౌంటరే ప్రాప్తిస్తోంది… హరీష్ రావుకు, కేటీయార్‌కు నడుమ సంబంధాలు ఎలా ఉన్నాయో తెలియదు గానీ… హరీష్ రావు కాస్త తగ్గి, కేటీయార్‌కు కూడా ఏమైనా అంశాల్లో స్పందించడమో, విమర్శించడమో చాన్స్ ఇవ్వాలి నాయకా..?!
Share this Article