.
రాజేంద్ర ప్రసాద్ గొప్ప నటుడా, గొప్ప కమెడియనా, నాలుగైదు తరాల నటుడా… మనిషా..? ఇవన్నీ సగటు తెలుగు ప్రేక్షకుడికి దేనికి..? వర్తమానంలో తను ఏమిటి అనేదే ముఖ్యం…
వేదిక ఎక్కితే చాలు, తుచ్ఛమైన పదాలు… బూతులు… ఎవరిని పడితే వారిని కించపరిచే కూతలు… అసలు ఏమైంది ..? ఎవరో కుటుంబసభ్యులు చనిపోయాక మైండ్ దెబ్బతిని ఇలా అయ్యాడు అని ఏదో విఫల సమర్థనలు కనిపిస్తుంటాయి మీడియాలో… కానీ..?
Ads
మరి అలా మతితప్పిన మనిషిని ఎందుకు పిలుస్తున్నారు..? ఎందుకు ఈ పిచ్చి కూతలు..? వ్యక్తి ప్రతిభ ఎంత గొప్పదైనా కావచ్చుగాక… పిచ్చి కూతలతో తనంతటతనే భ్రష్టుపట్టిపోతుంటే ఎవడికైనా ఎందుకు సానుభూతి ఉండాలి.., మైండ్ సరిలేకపోతే ఇంట్లో ఉండాలి…
తాజా ఉద్దారకం ఏమిటీ అంటే..? తనకు కత్తి కాంతారావు అని పురస్కారం ఏదో ఇచ్చారట ఎవరో… ఇంకేం, అక్కడే… ఆ సందర్భంగా మైకు పట్టుకుని పిచ్చి కూతలకు దిగాడు… ఇది ఓసారి చూడండి…
కాంతారావు వేసే జానపద హీరో వేషాలు చూసి ఎంజీఆర్ వంటి సూపర్ స్టార్ కూడా ఉచ్చ పోసుకునేవాడు, భయపడిపోయేవాడు అని ఏదో కూశాడు… కాంతారావును మెచ్చుకోవాలంటే తమిళ జనం ఆరాధించే ఎంజీఆర్ మీద ఆ బజారు భాష ఏమిటి..?
ప్రైవేటు సంభాషణల్లో ఎవరి మీదో ఇంకెవరో ఏదో అంటారు, అవి బయటికి రావు… కానీ బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు ఓ సభాసంస్కారం అవసరం… సరైన భాష అవసరం… ఒక విజ్ఞత, ఒక పరిణతి, ఒక హుందాతనం అవసరం… ఈ రాజేంద్ర ప్రసాద్‌కు అవేవీ లేవు… కొన్నాళ్లుగా చూస్తున్నాం కదా…
కనీసం క్షమాపణలు చెప్పే సంస్కారం కూడా లేదు … మరి పిలిచి బిరుదులు ఇచ్చి, భుజకీర్తులు తొడిగి, కిరిటాలు పెట్టి మరీ మైకు ఇచ్చేవాళ్లకు ఎందుకు లేదు అంటారా..? అదేకదా అసలు విషాదం…
ఎంజీఆర్… గొప్ప నటుడా కాదానేది పక్కన పెడదాం… ఇదే రాజేంద్ర ప్రసాద్ ఈరోజుకూ గొప్పగా ఆరాధించే ఎన్టీఆర్ చరిత్రే తమిళనాట ఎంజీఆర్ చరిత్ర… ఈరోజుకూ కోట్ల మంది ప్రేమిస్తారు తనను… మరి ఇంత చీపుగా ఎలా తీసిపడేశాడు సదరు రాజేంద్ర ప్రసాదుడు…
ప్చ్, ఏదో నాలుగు తరాల సీనియర్ నటుడు కదా అని మర్యాదకు పిలిస్తే, మైక్ ఇస్తే… ఏం వాగుతాడోనని నిర్వాహకులు ఉచ్చ పోసుకునే సిట్యుయేషన్‌లోకి జారిపోతున్నాడు… కాదు, జారిపోయాడు..!!
Share this Article