Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘స్వాతిముత్యపు జల్లులలో….’’ ఈ పాటొక్కటే సినిమాలో చూడబుల్…

March 11, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. నిన్న ప్రేమ ఖైదీ సినిమా తర్వాత ఈరోజు మరో అందమైన ప్రేమ కధ ఈ ప్రేమ యుధ్ధం . సినిమా అంతా యుధ్ధమే . ప్రేమ యుధ్ధమే . దూకుడు సినిమాలో అనుకుంటా సమంత అన్నట్లు ప్రేమించిన అమ్మాయి దక్కాలంటే యుధ్ధాలు చేయాలి , సాహసాలు చేయాలి పాతాళభైరవి లోని డింభకుడి లాగా .

అనుపమ ఆర్ట్స్ బేనరుపై తెలుగు , కన్నడ భాషల్లో ఒకే సారి నిర్మించబడిన ఈ సినిమా తెలుగులో నాగార్జున , అమల ప్రేమ జంటగా నటిస్తే కన్నడంలో రవిచంద్రన్ , అమల నటించారు . దేవరాజ్ కూడా రెండు భాషల్లో విలనుగా నటించాడు . అతనికి తెలుగులో ఫుల్ లెంగ్త్ విలన్ పాత్ర ఇదే మొదటిది అనుకుంటా .

Ads

రెండు భాషల్లోనూ యస్ వి రాజేంద్ర సింగ్ బాబే దర్శకత్వం వహించారు . బేసిగ్గా ఆయన కన్నడ దర్శకుడు .
అందుకనే తెలుగు సినిమాలో కూడా కాస్త కన్నడ వాసన కనిపిస్తుంది . ముఖ్యంగా సాంకేతిక వర్గం ,‌ కొందరు నటీనటులు . హంసలేఖ పేరుతో సంగీత దర్శకుడిగా పాపులర్ అయిన గంగరాజు కూడా బేసిగ్గా కన్నడ సినిమాల సంగీత దర్శకుడే .

భారతి కూడా ప్రధానంగా కన్నడ నటీమణే . అన్ని దక్షిణాది భాషల్లోనూ నటించింది . ఈమె తన ఈ పాత్రను రెండు భాషల్లోనూ నటించింది . సినిమా షూటింగ్ కూడా ఎక్కువగా బెంగళూరులో జరిగినట్లుగా ఉంది .
ఈ సినిమా పేరు చెప్పగానే సినిమా ప్రియులకు , సంగీత ప్రేమికులకు గుర్తుకొచ్చే సుమధుర గీతం స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో పాటే .

బెంగుళూరు క్రికెట్ స్టేడియంలో కృత్రిమ వర్షంతో తొమ్మిది రోజులు షూటింగ్ జరిపారట ఈ పాటకి . ఎంత మధురంగా ఉంటుందంటే సినిమాలో చాలా సీన్లలో ఈ పాట మ్యూజిక్కే బేక్ గ్రౌండ్లో వస్తూ ఉంటుంది . థియేటర్లో నుంచి బయటకొచ్చాక కూడా ఈ పాట మ్యూజిక్ చెవుల్లో గింగురుమంటూ ఉంటుంది . హం చేసుకుంటూ వస్తారు .

ఈ దృశ్య శ్రవణ ప్రేమ కావ్యం కధ టూకీగా ఏందంటే మోహన్ బాబు కళా వ్యాపారి . అతని ట్రూపులో భారతి డాన్సర్ . తన వందో ప్రదర్శనలో తాను వివాహం చేసుకోబోతున్నానని , అందువలన నృత్యాలకు వీడ్కోలు చెపుతున్నానని ప్రేక్షకులకు ప్రకటిస్తుంది . ఆ ప్రకటనకు కోపం వచ్చిన మోహన్ బాబు నాట్యం చేయకుండా ఎలా బతుకుతావో చూస్తానని సవాలు విసిరి , ఆమె భర్త గిరిబాబుని అతని తాగుడు , ఇతర బలహీనతల ఆధారంగా దిగజారుస్తాడు .

వారిద్దరి కొడుకు నాగార్జున మంచి డాన్సర్ , గాయకుడు . అతనికి పోటీదారుడు విలన్ దేవరాజ్ . ఇరువురికి కళా స్పర్ధ . ఇద్దరికీ మిత్ర బృందం . చక్కగా కొట్టుకుంటూ ఉంటారు . దేవరాజ్ చెల్లెలు అమల నాగార్జునకు వీరాభిమాని . ఆ అభిమానం ప్రేమగా మారుతుంది .

వీళ్ళిద్దరి ప్రేమకు భంగం కలిగించటమే దేవరాజ్ పని . నాగార్జునని చంపుతానని చెల్లెల్ని బెదిరించి బొంబాయి తీసుకుని పోయి పెద్ద డాన్సర్ని చేస్తాడు . కొద్ది కాలం తర్వాత వెనక్కు తిరిగొచ్చిన అమల నాగార్జునని తిరస్కరిస్తుంది .

ఇద్దరూ మోహన్ బాబు ట్రూపులో డాన్సర్లు అవుతారు . నాగార్జున వాణీ విశ్వనాధుని ప్రేమిస్తున్నట్లు నటిస్తూ అమలకు స్పర్ధను సృష్టిస్తాడు . స్పర్ధయా వర్ధతే ప్రేమా . అమల మరలా నాగార్జున ప్రేమను కోరుకుంటుంది .
ఇద్దరూ దగ్గరయ్యాక కలిసి ఢిల్లీ వెళ్ళిపోతారు .

నాగార్జున

అక్కడ టాక్సీ డ్రైవరుగా అంజాద్ ఖాన్ తారసపడతాడు . వాళ్ళను కాశ్మీర్ కూడా తీసుకుని వెళతాడు . అక్కడ దేవరాజ్ , మోహన్ బాబు విడదీయటానికి విఫల ప్రయత్నం చేస్తారు . చివరకు ప్రేమ యుధ్ధంలో ప్రేమికులు విజయులు అవటంతో , విలన్లు పరాజితులు అవటంతో సినిమా శుభాంతం అవుతుంది .

కధ చాలా రొటీనే . ఇద్దరు ప్రేమికులు , ఓ ఆటంకవాది . ఆ ఆటంకాలను అధిగమించి ఒకటవటం . ఆ రొటీన్ కధ చుట్టూ శ్రావ్యమైన పాటల్ని , అందమైన నృత్యాలను కూర్చటమే ఈ సినిమా బాగుండటానికి కారణం . ఆ క్రెడిట్ హంసలేఖతో పాటు ఆత్రేయ , వేటూరిలకు ; వాటిని శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యం , జానకమ్మ , మనోలకు , అందమైన నృత్యాలను కంపోజ్ చేసిన సుందరం , సురేఖ , ప్రకాష్ లకు చెందుతుంది .

హే నేనేరా యువ హీరో అంటూ నాగార్జున , దేవరాజుల మీద పాట , డాన్స్ డాన్స్ డాన్స్ బేబీ డాన్స్ డాన్స్ అనే డ్యూయెట్ నాగార్జున , అమల మీద ఉంటాయి . యోగా యోగ యోగా యోగ ప్రేమ యుధ్ధం ఏడు ప్రాణాల ప్రేమ యుధ్ధం నాగార్జున , వాణీ విశ్వనాధుల మీద చాలా హాటుగా ఉంటుంది .

కాశ్మీర్లో నాగార్జున , అమల మీద బొంబాట్ బొంబాట్ అంటూ సాగే డ్యూయెట్లో అంజాద్ ఖాన్ కూడా గెంతులేస్తాడు కాసేపు . ప్రేమా గీమా జానేదో మాయాలోకంలో ప్రేమే శరణం గఛ్ఛామి అనే నిస్పృహ పాట నాగార్జున మీద బాగానే ఉంటుంది . ఈ పాటలో అమల మీద కొన్ని డాన్స్ షాట్స్ కూడా అందంగా ఉంటాయి .

నాలుగు కోట్ల భారీ వ్యయంతో తీయబడిందట ఈ సినిమా . తెలుగు , కన్నడ భాషల్లో ఏకకాలంలో తీయబడిన ఈ సినిమాకు తెలుగులో డైలాగులను సాయినాథ్ వ్రాసారు . ఒకనాటి హీరోయిన్ భారతి మంచి పాత్రలో కనిపిస్తుంది .

తెలుగు సినిమా తమిళం , హిందీ భాషల్లోకి డబ్బింగ్ చేయబడింది . సినిమాలో అంజాద్ ఖాన్ నటించటం విశేషమే అయినా ఆయన పాత్రను అతి హాస్యంతో అపహాస్యం చేసారు . సినిమా యూట్యూబులో ఉంది . చూడతగ్గ సినిమా . సంగీత ప్రియులకు , రస హృదయులకు , నాగార్జున అమల అభిమానులకు బాగా నచ్చుతుంది . It’s a good audio visual splendour .

#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘స్వాతిముత్యపు జల్లులలో….’’ ఈ పాటొక్కటే సినిమాలో చూడబుల్…
  • ‘నీ దుకాణం మూసుకుంటావా’… నమస్తే తెలంగాణకు బిగ్‌ టీవీ సవాల్…
  • సిందూర్ దెబ్బ… రిపేర్లూ కష్టమై ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ కూల్చివేత…
  • కక్కు- కిక్కు…! సర్కారు సారా Vs చీప్ లిక్కర్…! ఏ భూతం తక్కువ డేంజర్…?!
  • మళ్లీ ఏదో కూశాడు… ఇక మారడు, సైకియాట్రిస్టులే శరణ్యం…
  • జ్యోతిష నామ ధూర్తత్వం సమాజానికి కీడు చేస్తోంది… జాగ్రత్త సుమీ…
  • నేపాలీ సెన్సేషన్… ఓ ఆయుర్వేద డాక్టర్ కొడుకు, ఓ ర్యాపర్… ఎవరితను..?!
  • తర్జుమాలే ఉద్యమంగా! … Tribute to Mukthavaram Pardhasaaradhi ….
  • అసలెవరు ఈ ఆండీ పైక్రాఫ్ట్..? పాకిస్థాన్ పుండు మీద కారం..!!
  • అమెరికా, ఇజ్రాయిల్‌లతో యుద్ధం చేస్తున్నది చైనా- రష్యాలే…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions