.
ఖుష్బూ కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ… తమిళంలో కాదు, మలయాళంలో! మరో సర్‌ప్రైజ్ – సరిత రీఎంట్రీ
దక్షిణాది సినీ ప్రపంచంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన Khushbu Sundar కుటుంబం నుంచి మరో కొత్త హీరోయిన్ రాబోతోంది… ఖుష్బూ–Sundar C దంపతుల కుమార్తె Avantika Sundar త్వరలో సినిమాల్లోకి అడుగుపెట్టనుంది… అయితే ఆశ్చర్యకరంగా ఆమె తొలి సినిమా తమిళంలో కాకుండా మలయాళంలో ఉండటం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది…
Ads
అవంతిక నటిస్తున్న తొలి చిత్రం Aarambham… ఈ చిత్రంతో Sujesh Annie Eapen దర్శకుడిగా పరిచయం అవుతున్నారు… కథను Joselet Joseph, Ajoy Thampi రచించారు…
తల్లిదండ్రుల బ్యానర్‌లో లాంచ్ చేయలేదెందుకు? ఖుష్బూ చెప్పిన మాట ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది… తాము ఓ నిర్మాణ సంస్థ నడుపుతున్నా సరే… తమ బ్యానర్‌లోనే కూతురిని లాంచ్ చేయాలని ప్రయత్నించలేదని ఆమె వెల్లడించింది…
“మేము అనుకుంటే మా బ్యానర్‌లో అవంతికను పరిచయం చేయడం చాలా ఈజీ… కానీ ఆమె తనదైన దారిని తానే ఎంచుకోవాలి అనుకున్నాం” అని ఖుష్బూ చెబుతోంది… స్క్రిప్ట్ వినడం నుంచి సినిమా ఎంపిక వరకు చివరి నిర్ణయం పూర్తిగా అవంతికదేనని అంటోంది ఆమె…
మలయాళం ఎందుకు? సాధారణ “మసాలా హీరోయిన్” పాత్రల కంటే కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని అవంతిక కోరుకుంటోందట… ప్రస్తుతం కంటెంట్ పరంగా బలమైన సినిమాలు వస్తున్న ఇండస్ట్రీగా మలయాళ సినీ ప్రపంచాన్ని భావించి, అదే రంగంలో తన ప్రయాణం ప్రారంభించాలని నిర్ణయించుకుందట…
సరిత రీఎంట్రీ ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా ఉంది… ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో అగ్రనటిగా నిలిచిన Saritha చాలా ఏళ్ల విరామం తరువాత ఈ చిత్రంతో మళ్లీ తెరపై కనిపించనున్నారు… దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది…
కథ ఏమిటంటే… ఆరంభం సినిమా తల్లి– కూతురు సంబంధం చుట్టూ తిరిగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది… ఇందులో అవంతిక “ఆరతి” అనే యువతి పాత్రలో కనిపించనుంది… జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులు, కుటుంబ బంధాలు, ముఖ్యంగా తల్లి– కూతురు మధ్య ఉండే భావోద్వేగ అనుబంధం కథలో ప్రధానంగా ఉండబోతుందని సమాచారం…
కూతురు షూటింగ్‌కు వెళ్లని ఖుష్బూ … ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే… అవంతిక తొలి సినిమా షూటింగ్‌కు ఖుష్బూ వెళ్లనేలేదట… పూజ కార్యక్రమానికి కూడా హాజరు కాలేదని ఆమె చెప్పింది… “ఆమె తన ప్రయాణాన్ని తానే ప్రారంభించాలి… నేను ఉంటే ఆమెపై ఒత్తిడి పెరుగుతుంది” అని ఖుష్బూ చెప్పింది…
భారీ తారాగణం… ఈ చిత్రంలో Althaf Salim, Indrans, Vijayaraghavan, Krishna Sankar, Kalabhavan Shajohn, Sunil Sugatha, Noby Marcose, Rajesh Sharma తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు…
సినిమా కుటుంబంలో పుట్టినా… తల్లిదండ్రుల పేరుతో కాకుండా తన ప్రతిభతో గుర్తింపు సంపాదించాలని అవంతిక ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది… అందుకే తమిళం కాకుండా మలయాళంతో కెరీర్ ప్రారంభించడం కూడా ఆమె తీసుకున్న సమాలోచిత నిర్ణయంగా చెప్పొచ్చు…
Share this Article