.
సినిమా ఇండస్ట్రీ అంటే అంతే… అణిగి మణిచి, అడిగినచోటల్లా ఒదిగి… దాదాపు ఓ ఆడసరుకులా ట్రీట్ చేస్తుంది ఇండస్ట్రీ… లైంగిక దోపిడీ, దోపిడీలపై అనేక విమర్శలు… కాస్త తలెత్తి, ఆత్మాభిమానం చూపిస్తే ఇక తొక్కడమే రకరకాలుగా…
శాండల్‌వుడ్, అంటే కన్నడ ఇండస్ట్రీ ఏమన్నా తక్కువా..? ఎక్కువే..? ఏమాత్రం అభిమానం చూపించినా సరే, ఎదిగినా సరే, పొగరు అని ముద్రేసి తొక్కేయడానికి ప్రయత్నిస్తుంది… తోడుగా మీడియా ఉండనే ఉంది… తెలంగాణ కోడలు రష్మిక మందాన్నా మీద ఎనిమిదేళ్లుగా కక్ష సాధిస్తున్న శెట్టి సర్కిల్ అండ్ అస్మదీయ మీడియా మళ్లీ కొత్త ట్రోలింగుకు దిగాయి…
Ads
విజయ్ దేవరకొండతో పెళ్లి, భారీ రిసెప్షన్, జాతీయ స్థాయిలో ప్రచారం, ఆశీస్సులు చూసి ఆ శెట్టి సర్కిల్ కళ్లల్లో నిప్పులు పోసుకుంది… అసలే ఎనిమిదేళ్లుగా ఎంత తొక్కాలనుకున్నా ఆమె టాలీవుడ్ చేరి, నిలదొక్కుకుని, ఇప్పుడు ఏకంగా నేషనల్ క్రష్ దాకా ఎదిగి… ఇప్పుడు ఓ ఇంటి కోడలైంది… అన్నింటికీ మించి ఈ శెట్టి సర్కిల్‌ను అస్సలు దేకలేదు, పట్టించుకోలేదు, ఎహెపొండిరా అని ధిక్కరించింది, అదీ కోపం…
తాజాగా తనపై సాగుతున్న సోషల్ మీడియా, మీడియా వార్తలపై రష్మిక భగ్గుమంది, ఇన్నాళ్లూ సహించాను, ఇక ఊరుకోను, కోర్టులకు లాగుతా అని బెదిరిస్తోంది… ఎందుకు..? ఏమిటి ఆ తాజా ట్రోలింగు..? అప్పట్లో కిరిక్ పార్టీ అని ఓ సినిమా… అప్పటికి హీరోయిన్ రష్మిక, హీరో రక్షిత్ శెట్టి పేరున్న నటులేమీ కాదు, ఉత్త తుప్పాస్ బ్యాచే…
ఆ సినిమా తరువాత లవ్వు గివ్వు మొదలై… 2017లో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది… తరువాత ఏడాదికే బ్రేకప్… పెళ్లి జరగలేదు… కంపాటిబులిటీ ఇష్యూస్ అని చెప్పుకున్నారు… అప్పట్లో ఆమె తల్లి సుమన్ మందాన్నా ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ ఎంగేజ్‌మెంట్ రద్దుకు కొన్ని కారణాలు చెప్పిందట… ఆమె పాత ఇంటర్వ్యూలోని ఆడియోను ముక్కలు చేసి, నానా బాష్యాలు చెబుతూ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు… దీని వెనుక శెట్టి సర్కిల్ ఉందని కన్నడ ఇండస్ట్రీ గుసగుస…
‘‘రష్మిక పెళ్లి తరువాత నటించకూడదు, ఒకవేళ నటించినా సరే కిస్ సీన్లు, రొమాంటిక్ ఇంటిమేట్ సీన్లు చేయవద్దు’’ వంటి చాలా ఆంక్షలు పెట్టారట రక్షిత్ శెట్టి ఫ్యామిలీ… ఎంగేజ్‌మెంట్ తరువాత చేసిన ఓ సినిమాలో రష్మిక కిస్ సీన్ (గీతగోవిందం?) ఉందట, దాంతో రక్షిత్ శెట్టి ఫ్యామిలీ మండిపడిందట… రష్మిక ఫ్యామిలీ సారీ చెప్పాలని డిమాండ్ చేశారట… గొడవలకు దిగారట…
‘‘నా బిడ్డ చిన్న వయస్సుది, ఐనా 35 ఏళ్ల మనిషికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్దపడ్డాను, ఇంత గొడవ జరుగుతుంటే రక్షిత్ సైలెంటుగా ఉన్నాడు… సో, ఇలాంటి సంబంధం కొనసాగడంకన్నా ఇక్కడే ఆగిపోతే బెటర్ అని మేమూ అనుకున్నాం’’ ఇదీ ఆమె తల్లి వెర్షన్ ఆ ఆడియోలో…
ఇక సినిమాలు చేయబోను అని మీడియాలో ప్రకటన ఇవ్వాలన్న రక్షిత్ శెట్టి కుటుంబం డిమాండ్ విన్నాక, ఇక కెరీర్‌పైనే ప్రేమ, కాన్సంట్రేషన్ ఉన్న రష్మిక ఈ ఆంక్షలకు అంగీకరించలేదు, దాంతో బ్రేకప్… రష్మిక తల్లి చెప్పిందీ అదే ఆ ఆడియోలో… దాన్నిప్పుడు తవ్వి తీసి ట్రోల్ చేస్తుండటం రష్మికకు నచ్చలేదు, అందుకే లీగల్ యాక్షన్ అది బెదిరిస్తోంది… అదీ కథ… ఆ కిస్ సీన్ నుంచే విజయ్‌తో రష్మిక బంధం బలపడసాగింది, చివరకు ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిందని కన్నడ మీడియా కథనాలు…
“ఇది మా కుటుంబానికి సంబంధించిన ప్రైవేట్ విషయం… ఇలా బయటకు తీయడం సరైంది కాదు’’ అంటోంది ఆమె… కానీ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చిన ఆడియో కదా అది… ఇప్పుడు ప్రైవేటు విషయం ఎలా అవుతుంది..? కానీ అసలు కోపకారణం అది కాదు… తనంతట తాను బతుకుతున్నా, ఈరోజుకూ రకరకాల వేధిస్తూనే ఉన్న సదరు శెట్టి సర్కిల్ ఇప్పుడు తను పెళ్లి చేసుకుని పచ్చగా కనిపిస్తే ఓర్వలేకపోతున్నారని ఆమె కోపం…
నిజానికి సోకాల్డ్ శెట్టి సర్కిల్ (శాండల్‌వుడ్‌లో Rakshit Shetty, Rishab Shetty, Raj B. Shetty చుట్టూ ఉన్న వర్గాన్ని కొందరు “శెట్టి సర్కిల్” అని పిలుస్తారు) ఒకప్పుడు నథింగ్… కానీ కాంతారా హిట్టయి, కాంతారా-1 సూపర్ హిట్టయి, హొంబలె ఫిల్మ్స్ అండ దొరికాక, రక్షిత్ శెట్టి ఏదో చార్లి సినిమా కూడా హిట్టయ్యేసరికి బలంగా పాతుకుపోయారు… రష్మికపై కక్ష కొనసాగిస్తూనే ఉన్నారు…
‘‘తల్లిలాంటి కన్నడ ఇండస్ట్రీని వదిలేసింది, రూట్స్ మరిచిపోయింది’’ దగ్గర నుంచి ఆమె సినిమాల కన్నడ వెర్షన్లను బ్యాన్ చేయాలనే నినాదాల దాకా ఎప్పుడూ దుమారం లేవదీస్తుంది ఈ శెట్టి గ్యాంగ్… ఇన్నేళ్లయింది, ఆమె పాన్ ఇండియా స్టార్ అయింది… అదే రక్షిత్ శెట్టికి ఇప్పటికీ మళ్లీ పెళ్లీపెటాకులు లేవు… ఆ గ్యాంగ్ కాంతారా తప్ప కన్నడ సరిహద్దులు దాటిందీ లేదు…
ఇలా రష్మికను చూస్తే వాళ్లకు మండుతూనే ఉంది… నిజానికి సినిమా తారల్ని పెళ్లి చేసుకునేవాళ్లు మళ్లీ సినిమాల్లో నటించవద్దని ఆంక్షలు పెట్టడం, తరువాత కొంతకాలానికి తారలు రీఎంట్రీ ఇవ్వడం, పాత బంధాలు పెటాకులు కావడం ఇండస్ట్రీలో బోలెడు ఉదాహరణలు… కానీ రక్షిత్, రష్మిక బ్రేకప్ తరువాత చాలా దూరం వెళ్లిపోయారు తమ తమ సొంత జీవితాల్లో… మళ్లీ ఎందుకు పాతవన్నీ తవ్వి ఆమెపై ఈ దాడి..?
విజయ్‌తో ప్రేమ, పెళ్లి విషయంలో ఆమె చేసిన తప్పేముందని..? అందరికీ చెప్పి, అందరి ఎదుట, అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు… అదుగో అదే శెట్టి సర్కిల్ సహించలేకపోతున్నది…!!
Share this Article