Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ సినిమాలో అందరికన్నా మెచ్చుకోవలసింది సత్యనారాయణనే

March 17, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మితిమీరిన ఆవేశం వలన యువకుల జీవితాలు ఎలా నాశనమవుతాయో సందేశాత్మకంగా చెప్పే సినిమా 1990 లో వచ్చిన ఈ రౌడీయిజం నశించాలి . రాముడు మంచి బాలుడు టైప్ హీరో రాజశేఖర్ . అతని తండ్రి హెడ్ కానిస్టేబుల్ . సినిమాలో పాత్ర పేరు అచ్యుతరామయ్య . రాముడు లాగే ఉదాత్తుడు . విధి నిర్వహణకు , నిజాయితీకి మారు పేరు .

ఆయన జీవిత కాల కోరిక కొడుకుని సబ్ ఇనస్పెక్టర్ని చేయటం . తండ్రి కోరికను సఫలం చేయటమే లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి ప్రిపేర్ అవుతుంటాడు కొడుకు . అనూహ్యంగా ఆ ఊళ్ళో జనకంటకుడు అయిన ఓ రౌడీని ఎదుర్కొంటాడు హీరో రాజశేఖర్ .

Ads

చినుకు చినికి గాలివాన అయినట్లు ఆ రౌడీకి హీరోకి మధ్య వైరం చివరికి ఆ రౌడీని చంపటంతో ముగుస్తుంది . SI సెలక్షన్లలో రెండో రేంక్ వచ్చి కూడా చివరకు ఆ ఉద్యోగాన్ని కోల్పోవలసి వస్తుంది . ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మేనమామ కూతురిని పెళ్లి చేసుకోలేకపోతాడు . తన జీవితం , కుటుంబం అంతా చిందరవందర అయిపోతుంది .

మంచి సినిమా . Sentiment, emotion, drama, action . దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నింటినీ కలబోసి చక్కగా తీసారు . చక్కని దర్శకత్వంతో పాటు పాటల్ని కూడా ప్రేక్షకరంజకంగా చిత్రీకరించారు . మళయాళంలో హిట్టయిన కిరీడం అనే సినిమాకు రీమేకే మన తెలుగు సినిమా . మళయాళంలో మోహన్ లాల్ , పార్వతి , తిలకన్ , మోహన్ రాజ్  తదితరులు నటించారు .

ఈ సినిమాలో అందరి కన్నా ముందు మెచ్చుకోవలసింది సత్యనారాయణనే . ఎమోషన్స్ , సెంటిమెంట్లను బ్రహ్మాండంగా చూపారు . అతనికి దీటుగా అన్నపూర్ణమ్మ కూడా బాగా నటించింది . రాజశేఖర్ మొదట మంచి బాలుడిగా , సమాంతరంగా ఆవేశపరుడిగా , అంతకు మించి తండ్రి మీద అపార గౌరవం కల కొడుకుగా బాగా నటించాడు . ప్రేయసిగా వాణీ విశ్వనాథ్ గ్లామరస్సుగా నటించింది . పాటల్లో హాటుగా నటించింది .

విలనుగా మోహన్ రాజుకి తెలుగులో ఇదే మొదటి సినిమా . 1990 లో ఇది కాకుండా లారీ డ్రైవర్ , ఇద్దరూ ఇద్దరేలో కూడా నటించాడు . లారీ డ్రైవర్లోని పాత్ర గుడివాడ రౌడీ బాగా హిట్టయింది కూడా . ఇతర పాత్రల్లో బ్రహ్మానందం , శ్రీలక్ష్మి , రమణారెడ్డి , అరుణ్ కుమార్ , నిర్మలమ్మ , అల్లు రామలింగయ్య , రాళ్ళపల్లి  తదితరులు నటించారు . ప్రసాద్ బాబుకి మంచి పాత్ర లభించింది . తన నటనను చూపగల పాత్ర లభించింది . బాగా చేసాడు కూడా .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ వేటూరే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , జానకమ్మ , సరళారాణి పాడారు .‌ గుచ్చి గుచ్చి అందం , జుమ్మంది ముద్దు , ఓ రామచిలకా అంటూ సాగే డ్యూయెట్లు బాగుంటాయి . గణేష్ పాత్రో డైలాగులు బాగుంటాయి . కె యస్ రామారావు సమర్పణలో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . కాస్త స్లోగా సాగినా చూడతగ్గ సినిమాయే .

#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మ మంగ్లీ..? నీ నోట ఈ బూతు పాటేంటి..? యూట్యూబ్‌లో మాయం..!!
  • భద్రాచలానికి ఇక కొత్త కళ… కేసీయార్ నిర్లక్ష్యానికి రేవంత్ దిద్దుబాటు…
  • ఈ సినిమాలో అందరికన్నా మెచ్చుకోవలసింది సత్యనారాయణనే
  • సాయం కోరుతూ కన్నీళ్లు, విన్నపాలు… ఇదోరకం మోసం, జాగ్రత్త…
  • ఆస్కార్ జ్యూరీని ఎందుకు ఈ సినిమా అంతగా ఇంప్రెస్ చేసింది..?!
  • పాత కేసీయార్ ఫ్యాన్… ధాటిగా ఆ పొలిటికల్ అనైతికతపై ప్రశ్నలు…
  • దిష్టి వ్యాఖ్యలు, వెక్కిరింపుల్ని తొక్కిపడేస్తూ… తెలంగాణ పరుగులు…
  • పేరుకే BRS- TDP వైరం… *యవ్వారాల్లో* జాన్‌జిగ్రీలే… ఏమంటావ్ బాపూ..?!
  • గుండమ్మ కథ రీమేక్..! అసాధ్యం… ఎస్వీఆర్, సూర్యకాంతం కావాలి కదా..!!
  • నేను ఎందుకు రాసుకుంటున్నాను ఇవన్నీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions