.
బెంగాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి… ఆమె దేశవ్యతిరేక, జాతివ్యతిరేక పోకడలు చాలామందికి నచ్చకపోవచ్చుగాక… కానీ ఆమె బెంగాల్ పాలిటిక్సులో గుడ్ ప్లేయర్, గుడ్ ఫైటర్… లెఫ్ట్‌ను పాతాళానికి తొక్కిపడేయడమే కాదు, బీజేపీ ఎంతగా విశ్వప్రయత్నం చేస్తున్నా ఈరోజుకూ కొరుకుడుపడటం లేదు…
పొలిటికల్ కోణంలో నిన్న ఆమె తీసుకున్న నిర్ణయం విశేషం… 75 మంది, అంటే తన సిట్టింగుల్లో మూడో వంతు మందికి ఈసారి టికెట్లు నిరాకరించింది… అది నిరంకుశం కాదు, వాళ్లంతా ఫీల్డులో పార్టీని భ్రష్టుపట్టించిన బాపతు… వాళ్ల మీద ప్రజల వ్యతిరేకత మొత్తంగా తన పార్టీని ముంచేయకుండా కాపాడుకునే ఎత్తుగడ…
Ads
సిట్టింగులు… గుర్తుంది కదా… తెలంగాణలో అరాచకానికి మారుపేరుగా మారిన సిట్టింగులకు కూడా కేసీయార్ మళ్లీ టికెట్లు ఇచ్చి, అంతిమంగా తనే మునిగిపోయాడు… ఆ సిట్టింగుల మీద జనంలో ఉన్న వ్యతిరేకత తన టైటానిక్‌కు ముంచేసింది… యాంటీ ఇన్‌కంబెన్సీని బాగా తగ్గించుకునే పద్ధతుల్లో ఒకటి, ప్రజావ్యతిరేక సిట్టింగులను దూరం పెట్టడం… అది కేసీయార్‌కు చేతకాలేదు, మమత చేసి చూపించింది… గెలుపో ఓటమో జానేదేవ్… అది మాత్రం సరైన నిర్ణయమే రాజకీయంగా…
సీటు మారింది… తనే నందిగ్రామ్‌లో ఓడిపోయింది కదా సువేందు చేతిలో… ఈసారి భవానీపుర సీటుకు మారింది తెలివిగా… ఎందుకంటే..? అక్కడ అక్రమ వలసదారుల వోట్లు ఎక్కువ… కానీ బీజేపీ ఓ సవాల్‌గా సువేందు అధికారిని మళ్లీ మమతపైనే పోటీపడాల్సిందిగా భవానీపురలో నిలబెడుతోంది… ఇదీ ఇంట్రస్టింగు… (ఈయన గతంలో మమత పార్టీయే, బయటికొచ్చాడు, ఏకు మేకుగా మారాడు… బీజేపీ సీఎం కేండిడేట్…)
భవానీపుర సవాల్… బీజేపీ కూడా సై అంటోంది భవానీపురలో… ఇక్కడ సర్ ప్రక్రియ తరువాత అక్రమ వలసదార్ల ఓట్లను భారీగా ఏరివేశారు, నార్త్ ఇండియన్ సమూహాల వోట్లున్నాయి, వాళ్లంతా బీజేపీ వైపే… గతంలో పోలీసులు మమత పార్టీకి కార్యకర్తల్లా పనిచేశారు, ఈసారి ఈసీ పోలీస్ కమిషనర్‌ను మార్చేసింది, పైగా దాదాపు 2000- 2500 కంపెనీల కేంద్ర బలగాలను నియమిస్తోంది…
మ్యాట్రిజ్ సర్వే… మ్యాట్రిజ్-ఐఏఎన్ఎస్ (Matrize-IANS) ఓపినీయన్ పోల్ ప్రకారం అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీల మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం కేవలం 2 నుంచి 4% మాత్రమే ఉంది… ఈ తేడాతో టీఎంసీ 155 నుంచి 170 సీట్లు గెలుచుకుని నాలుగోసారి అధికారంలోకి వస్తుందని దాని అంచనా… కానీ బీజేపీ తన సీట్లను 100 నుంచి 115 వరకు గెలుచుకోవచ్చునట… ఈ స్వల్పతేడాను తగ్గించేందుకు ‘ఫైవ్ పాయింట్’ ఫార్ములా ప్రయోగిస్తోంది బీజేపీ… తద్వారా మహారాష్ట్రలాగే అనూహ్య స్వింగ్ వస్తుందని పార్టీ ఆశ…
1. ఓటర్ల జాబితా ప్రక్షాళన (SIR)…: లక్షలాది మంది అనర్హులు, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు ద్వారా ఓటర్ల జాబితా క్లీన్ అయింది. ఇది గతంలో ఈ ‘ఓట్ల బ్యాంక్’పై ఆధారపడ్డ అధికార పార్టీకి గట్టి దెబ్బ…
2. ప్రభుత్వ వ్యతిరేకత…: 15 ఏళ్ల నిరంతర పాలన తర్వాత టీఎంసీ ప్రభుత్వంపై ప్రజల్లో సహజంగానే కొంత అసంతృప్తి కనిపిస్తోంది… స్థానిక నేతల అవినీతి, ఉద్యోగ నియామకాల్లో కుంభకోణాలు గ్రామీణ బెంగాల్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి… (మమత సిట్టింగుల మార్పు దీన్ని తగ్గించేందుకే…)
3. ఆరెస్సెస్ (RSS) నిశ్శబ్ద వ్యూహం…: మహారాష్ట్రలో సక్సెస్ అయిన ‘హౌస్-టు-హౌస్’ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌ను (గృహ సంపర్క్) ఆరెస్సెస్ బెంగాల్‌లో యుద్ధప్రతిపాదికన అమలు చేస్తోంది… వేలాది కొత్త శాఖలు ఏర్పాటు చేసి, ప్రతి 10-15 ఇళ్లకు ఒక గ్రూపుగా (Toli) విడిపోయి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు… రెండేళ్లలో ఆర్ఎస్ఎస్ శాఖలు 6000 నుంచి 12 వేలకు పెరిగిందని ఓ అంచనా…
4. ఎన్నికల సంఘం (ECI) దూకుడు…: షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బెంగాల్ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ, పోలీస్ కమీషనర్‌లను ఈసీ మార్చివేయడం ఒక పెద్ద నిర్ణయం… గతంలో వేలాది మంది ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై టీఎంసీ దాడులు, రౌడీయిజం… ఎన్నికల తరువాత టీఎంసీ హింసతో ఇతర రాష్ట్రాలకు వలసలు కూడా చూశాం కదా… ఈసారి భారీగా కేంద్ర బలగాలు…
5. మారుతున్న డెమోగ్రఫీ…: సరిహద్దు జిల్లాల్లో జనాభా నిష్పత్తి వేగంగా మారిపోవడం పట్ల స్థానిక హిందూ ఓటర్లలో తీవ్ర భయాందోళనలు ఉన్నాయి… తమ సంస్కృతి, అస్తిత్వం ప్రమాదంలో పడుతోందని భావిస్తున్న వర్గాలు ఈసారి సంఘటితమై బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉంది… ‘సిలిగురి కారిడార్’ ప్రచారం చేస్తోంది బీజేపీ… (చికెన్ నెక్‌ను కేంద్రం చేతుల్లోకి తీసుకోవడం)…
చివరగా… సువేందు అధికారికి పార్టీ బలమే తన బలం… అందుకే సర్వేల్లో తనకు భావి సీఎంగా పడే వోట్లు 15 శాతం, కానీ మమత బలమే తన పార్టీకి బలం… ఆమెను మళ్లీ సీఎంగా చూడాలనుకునే వోట్లు 49 శాతం… అందుకే ఈసారి బెంగాల్ పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది..!!
Share this Article