Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ రోత పాటకు రక్షిత విఫల సమర్థన… ఈమె ఎవరో గుర్తుందా మీకు…

March 18, 2026 by M S R

.

కేడీ, ది డెవిల్… రాబోయే ఈ పాన్-ఇండియా (ఒరిజినల్ కన్నడ) సినిమాలోని ’సర్కే చునార్ తేరీ సర్కే’ అనే బూతు పాట మీద వివాదం తెలిసిందే కదా… మంగ్లీ పాడిన ఈ పాటను హిందీలో నేను రాయలేదని రైటర్ తప్పించుకున్నాడు, యూట్యూబ్ నుంచి పాట తీసేయాల్సి వచ్చింది… దేశవ్యాప్తంగా నెటిజనం నిర్మాత, కంపోజర్, దర్శకుడు, గాయక రచయితలను బూతులు తిడుతున్నారు…

ఈ తిట్లకు ప్రధానంగా గురవుతున్నది ఇద్దరు… నిర్మాత – దర్శకుడు… దర్శకుడు ప్రేమ్, నిర్మాతల్లో ఒకరు ఈ ప్రేమ్ భార్య రక్షిత… అవును, రక్షితే… గుర్తుంది కదా… ఇడియెట్, శివమణి వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే… ఇప్పుడు అందరి తిట్లూ ఆమెవైపే, ఏమనీ అంటే..? ఓ ఆడదానివై ఉండి, ఆ పరమ రోత పాట ఏమిటి? 

Ads

అఫ్‌కోర్స్, పాడిందీ, నర్తించింది కూడా ఆడవాళ్లే… ఈ సినిమాను నిర్మిస్తున్నది కేవీఎన్ ప్రొడక్షన్స్ (ఓనర్ వెంకట్ నారాయణ, ప్రిస్టేజ్ గ్రూప్ మాజీ సీఈవో)… నిజానికి రక్షితకు వేరే సినిమా నిర్మాణ సంస్థ ఉంది (రక్షితాస్ ఫిలిమ్ ఫ్యాక్టరీ) దీని కింద రెండు మూడు సినిమాలు కూడా నిర్మించింది… ఈ కేడీ సినిమాకు సంబంధించి మాత్రం రక్షిత సహ- నిర్మాతగా ఉంది…

ఒకవైపు కేవీఎన్ ప్రొడక్షన్స్ తాజా సినిమాల్లో విజయ్ నటించిన ఆఖరి చిత్రం జననాయకన్ ఆగిపోయింది, అదెప్పుడో రిలీజ్ అవుతుందో తెలియదు… ఈ నిర్మాతే తీసిన మరో సినిమా టాక్సిక్… ఈ కేడీ సినిమా పాటలాగే ఆ టాక్సిస్ టీజర్‌లోని బోల్డ్ సీన్లపైనా దుమారం రేగుతోంది… అన్నట్టు ఈ టాక్సిస్‌ సినిమాకు దర్శకత్వం కూడా ఓ లేడీయే, పేరు గీతూ మోహన్ దాస్… (మలయాళ మాజీ నటి)…

కేజీఎఫ్ తరువాత యష్ నటిస్తున్న స్టార్ సినిమా ఇది… యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి తదితరులు నటిస్తుండటంతో భారీ ఖర్చు పెట్టారు, గ్లోబల్ రిలీజ్ అనుకున్నారు, కానీ గల్ఫ్ యుద్ధం కారణంగా అదీ అనిశ్చితిలో పడిపోయింది… ఈలోపు ఇదుగో ఈ కేడీ, ది డెవిల్ సినిమా వివాదం కూడా చుట్టుముట్టింది… ఈ సినిమాల ఓటీటీ అగ్రిమెంట్స్ కూడా కొలిక్కిరాక, కేవీఎన్ అంతులేని చిక్కుల్లో ఉంది…

అన్నట్టు… రక్షిత గురించి చెప్పుకుంటున్నాం కదా… తను ప్రేమ్‌ను పెళ్లాడాక సినిమాలు మానేసి, నిర్మాతగా మారింది, తరువాత అదీ బంద్ పెట్టి, రాజకీయాల్లో చేరింది… రెండు పార్టీలు, రెండింట్లోనూ ఇమడలేదు… టీవీ షోలలో కనిపిస్తూ, ప్రేమ్ సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరిస్తూ కాలం గడుపుతోంది… బాగా లావైంది, హఠాత్తుగా చూస్తే ఇడియట్ సినిమా రక్షితకూ, ఇప్పటి రక్షితకూ పోల్చుకుంటే జీర్ణం కావడం కష్టం…

రక్షిత

అందరూ దూషిస్తుండేసరికి, ఇక ఆమె తెరపైకి వచ్చి, భర్తకు సపోర్టుగా నిలబడుతోంది… ‘‘కావాలని వివాదం చేస్తున్నారు, ఒక్క పాటతో ఇంతగా తిట్టాలా’’ అని ఏదో ఓ విఫల సమర్థన… ఐతే ఆమె ప్రస్తావిస్తున్నది ‘‘పీలింగ్స్, డ్రీమమ్ వేకపమ్, ఛోళీకే పీచే వంటి పాటల మాటేమిటి అని… అవును, వాటినీ జనం తిట్టిపోశారు కదా… గుర్తులేనట్టుంది…

అంతేకాదు, ఈ బూతు, రోత పాటల ధోరణి తెలుగులో కూడా ఏనాటి నుంచో ఉన్నదే… చల్లగా లేస్తోంది వంటి పాటలకు ఎన్టీయార్ వంటి నటుడే యాక్ట్ చేశాడు… అంతెందుకు, ఈమధ్య రవితేజ కూడా నీయమ్మ, నీయక్క వంటి రోత పాటకు డాన్స్ చేశాడు… ఎటొచ్చీ వాటిపై వ్యతిరేకత వస్తున్నప్పుడు సమర్థించుకోవాలని చూడటం మరింత వ్యతిరేకతను మూటగట్టుకోవడమే… ప్రస్తుతం రక్షిత పరిస్థితి ఇదే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గులాబీ సెల్ఫ్ గోల్స్… KTR Vs Harish..? కేసీయార్ గైర్హాజరీ ఎఫెక్ట్..!!
  • ఆ రోత పాటకు రక్షిత విఫల సమర్థన… ఈమె ఎవరో గుర్తుందా మీకు…
  • ఈ ఐదు అంశాలే బీజేపీ Vs మమత పోరులో కీలకం… ఇదీ ప్రజెంట్ పిక్చర్…
  • 100 కోట్ల శ్రీదేవి చెన్నై ఆస్తిపై… జాన్వి, ఖుషీ కపూర్ ఇంట్రస్టింగ్ ఫైట్..!!
  • కోమటిరెడ్డి, జీవన్‌రెడ్డి… తెలంగాణ కాంగ్రెస్‌లో తాటాకు చప్పుళ్లు…
  • వాడెవడో ఏదో కూశాడట..! రాహుల్ గాంధీ డప్పు కొడుతున్నాడు..! ప్చ్, పిటీ..!!
  • హవ్వ మంగ్లీ..? నీ నోట ఈ బూతు పాటేంటి..? యూట్యూబ్‌లో మాయం..!!
  • భద్రాచలానికి ఇక కొత్త కళ… కేసీయార్ నిర్లక్ష్యానికి రేవంత్ దిద్దుబాటు…
  • ఈ సినిమాలో అందరికన్నా మెచ్చుకోవలసింది సత్యనారాయణనే
  • సాయం కోరుతూ కన్నీళ్లు, విన్నపాలు… ఇదోరకం మోసం, జాగ్రత్త…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions