Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దొందూ దొందే…! గ్యాండ్ లీడర్ తరువాత ఎవరికి వారే… దూరం- వైరం..!!

April 2, 2026 by M S R

.

చిరంజీవి పాపులారిటీని ఎక్కడికో తీసుకెళ్లిపోయిన సినిమా గ్యాంగ్ లీడర్ అని ఇంతకుముందు ఓ సమీక్షలో చెప్పుకున్నాం కదా… ఒక వివాదం, తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరో-హీరోయిన్ ఘర్షణ అప్పట్లో పెద్ద చర్చనీయాంశం… ఓసారి చెప్పుకోవచ్చు…

అప్పటికే చిరంజీవి టాప్ స్టార్… వేరే హీరోలందరూ మసకబారిపోయి, చిరంజీవి మాత్రమే వెలిగిపోతున్న కాలం అది… కానీ అప్పటికే విజయశాంతి కూడా ‘కర్తవ్యం’ సినిమాతో ‘లేడీ సూపర్ స్టార్’గా వెలిగిపోతున్నది… తను ఉన్న సినిమా ఏదైనా అది తన వల్లనే ఆడుతోంది అనే బలమైన నమ్మకం, అహం ఆమెలో ఉండేది…

Ads

కానీ ఆమె ఓ రియాలిటీని మరిచిపోయింది… ఇండస్ట్రీ మహిళా తారల్ని ఎలా ట్రీట్ చేస్తుందో తెలుసుకుని ఉండాల్సింది… కానీ ఒకానొక సందర్భంలో ఆమె మాట్లాడుతూ… “నేను చిరంజీవిని ఛాతీతో ఢీకొట్టే (Bumping) సీన్స్ జనానికి బాగా నచ్చాయి, ఆ ఎనర్జీ వల్లే సినిమాకు అంత క్రేజ్ వచ్చింది” అనే అర్థం వచ్చేలా మాట్లాడటం చిరంజీవి అభిమానులకు, అలాగే చిరంజీవికి కూడా కొంత ఇబ్బంది కలిగించింది…

ఇదసలే ఆడదాన్ని ఏమాత్రం సహించని ఇండస్ట్రీ… అలాంటిది ఎంత పాపులర్ హీరోయిన్ అయినా సరే, ఓ సినిమా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటే ఊరుకుంటుందా..? ఆ దెబ్బకు చిరంజీవి, విజయశాంతి నడుమ దూరం పెరిగింది… తరువాత ఘరానా మొగుడు సినిమాలో ఆమె బదులు నగ్మాను సిఫారసు చేశాడు చిరంజీవి…

గ్యాంగ్ లీడర్ సమయంలో విజయశాంతి చిరంజీవితో సమానంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందనీ, పోస్టర్లలో తన ఫోటో కూడా అంతే సైజులో ఉండాలని కోరుకున్నదనీ అప్పట్లో వార్తలు వచ్చాయి… తరువాత విజయశాంతికి మంచి పాత్రలు ఇస్తే చిరంజీవికి కోపం వస్తుందనే భావన ఇండస్ట్రీలో పెరిగిందీ అంటారు… క్రమేపీ విజయశాంతి డౌన్… చివరకు సినిమాలకే దూరమైంది…

నాకేం తక్కువ అనుకుంది… తరువాత చాన్నాళ్లకు, బహుశా 2005లో కావచ్చు, తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది… 2008లో కావచ్చు, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు… ఇద్దరూ ఇద్దరే… కానీ ఆ ఇద్దరూ ఫ్లాప్ రాజకీయాల్లో… ఆమె తన పార్టీని టీఆర్‌ఎస్‌లో నిమజ్జనం చేస్తే… చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేశాడు…

విజయశాంతి తరువాత కాలంలో పలు పార్టీలు మారి, చివరకు కాంగ్రెస్‌లో కనిపిస్తోంది ఇప్పుడు… కానీ ప్రజారాజ్యం ఫ్లాప్ ప్రాజెక్టు తరువాత చిరంజీవి రాజకీయాలకే దూరమై… ఏదో ఆ పాత పాపులారిటీతోనే ఈ 70 ఏళ్ల వయస్సులో కూడా హీరో వేషాలు కొనసాగిస్తున్నాడు… ఈ వయస్సులో అమ్మడూ కుమ్ముడూ వంటి పాటలు… సరే, అది మరో డిబేటబుల్…

(నిజానికి తను కావాలీ అనుకుంటే, పవన్ కల్యాణ్ పట్టుబడితే చిరంజీవికి రాజ్యసభ ప్లస్ కేంద్ర మంత్రి పదవి పెద్ద టాస్క్ ఏమీ కాదు… కానీ చిరంజీవి ప్రజాజీవితంలోకి రాదలుచుకోలేదు… విజయశాంతి మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీ… కాకపోతే పెద్ద యాక్టివ్ కాదు…)

ఆ గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత… చాలా ఏళ్ల వరకు వారిద్దరూ కలిసి నటించలేదు, మళ్ళీ దాదాపు 28 ఏళ్ల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సమయంలోనే వారు ఒక వేదికపై కనిపించారు… పాత కథలన్నీ మరిచి, ఈ ఇద్దరు వృద్ధ సెలబ్రిటీలు ఓ సాన్నిహిత్యాన్ని భలే నటించారు..!! ఇద్దరి నడుమ వయస్సు తేడా పదేళ్లు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!
  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!
  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions