Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హిందీ రాముడికన్నా మన తెలుగు రాముడే బాగున్నాడు..!!

April 3, 2026 by M S R

.

మొన్న ఓ పాట గురించి చెప్పుకున్నాం కదా… చందామామ, చందామామ కిందకు చూడమ్మా, నేల మీద నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా… మామూలుగా మన పెళ్లిళ్లలో వధూవరులను సీతారాముల్లా చూస్తాం కదా… ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అంటే..? తెలుగు రాముడు బాగున్నాడా..? హిందీ రాముడు బాగున్నాడా..? అనే చర్చ సాగుతోంది కాబట్టి…

హిందీలో రణబీర్ కపూర్ రాముడిగా ఒక రామాయణం షూట్ సాగుతోంది… అందులో మన తెలుగు సీత అలియాస్ సాయిపల్లవి, కన్నడ రావణుడు అలియాస్ యశ్… దర్శకుడు నితేష్ తివారీ… ఖర్చు 4 వేల కోట్లు, రెండు భాగాలు… అందరికీ తెలిసిన రాముడి కథనే కొత్తగా ఎలా చూపిస్తారనేది ఆసక్తికరం…

Ads

హనుమజ్జయంతి సందర్భంగా ఓ టీజర్ వదిలారు కదా… ఆ హిందీ రాముడెలా ఉన్నాడు..? కాస్త నలభై దాటేసినట్టుగా… ఏదో తెలియని వెలితి… గతంలో టీవీ రామాయణంలో రాముడిగా చేసిన అరుణ్ గోవిల్‌ను చూసినట్టు కూడా అనిపించలేదు… ఎందుకోగానీ రాముడు ఉత్తరాది రాజే అయినా సరే, ఈ ఉత్తరాది నటులు ఆ పాత్రకు అస్సలు సూట్ కాలేదనిపిస్తుంది…

రాముడైనా, రావణుడైనా మన సౌత్ ఇండియన్ నటులే నప్పారు… జనానికి నచ్చారు… మెప్పించారు… పాటలైనా, మాటలైనా, యుద్ధాలైనా, ఉద్వేగాలైనా మనవాళ్లే రాముడి కథలను గొప్పగా చెప్పారు, చూపించారు… మన దక్షిణ సినిమాలే ఆ పాత్రలకు పట్టాభిషేకం చేశాయి… ఏ పౌరాణికం తీయాలన్నా మనమే, అందులోనూ తెలుగు వాళ్లే…

ఇప్పుడూ అదే ఫీల్… రాజమౌళి తీస్తున్న వారణాసి సినిమాలో కూడా రాముడి పాత్ర ఉంది… సరే, ఈ కథ వేరు… అసలు కథలో రాముడి కథ చిన్న ఉపకథ… కానీ రాముడిగా మహేశ్ బాబు బాగున్నాడు… పైగా మన తెలుగుజనం ప్రేమించే మహేశుడు కదా, ఇంకాస్త ఎక్కువ నచ్చుతాడు మనకు… (మళ్లీ ఇక్కడ మీసాలు, గడ్డాల రాముడు…, రాముడు మాంసం తినేవాడా అనే చర్చ అనవసరం…)

రాముడు

మీసాల్లేని హిందీ రాముడికన్నా… లైట్‌గా మీసాలు, గడ్డాలున్నా సరే మన మహేశుడే ముద్దుగున్నాడు… పైన మనం చెప్పుకున్న నేలమీద నెలరాజు టైపులో… హిందీ రాముడికన్నా తెలుగు రాముడే ఏజ్ తక్కువ కనిపిస్తున్నాడు… (అఫ్ కోర్స్… హిందీ రాముడు తెలుగులో కనిపిస్తాడు, తెలుగు రాముడు హిందీలోనూ కనిపిస్తాడు… పాన్ ఇండియా రాముళ్లు కదా)…

ఐతే హిందీ రాముడి టీజర్ చూశాక చాలామందిలో రాముడి లుక్కుకన్నా గ్రాఫిక్సే డామినేట్ చేసి అసంతృప్తిని కలిగించాయి… అఫ్‌కోర్స్, రాజమౌళి రాముడూ అంతే… హిందీ రామాయణం టీజర్‌లో టెక్నికల్ స్టాండర్డ్స్ బాగున్నా ఏదో వెలితి ఉంది… ఏమో, మనం చూసే దృష్టిలోనే తేడా ఉందేమో కూడా…

prabhas

ఆదిపురుష్ సినిమాలో కూడా మన తెలుగు రాముడు… మంచి లుక్కుతో ప్రభాస్ మరో రాముడిలా అలరించి ఉండాల్సింది… కేలండర్లలో, ఫోటోల్లో, విగ్రహాల్లో, చిత్రాల్లో రాముడు క్లీన్ షేవ్ విగ్రహం కదా… కానీ మన తెలుగు హీరోలు అంగీకరించరు… (ఇప్పుడంటే బాలీవుడ్ హీరోలకు కూడా గడ్డం ఓ ట్రెండ్… అది పురుషత్వానికి చిహ్నంగా భావిస్తున్నారు పాపం)…

ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ సినిమాను మరీ ఓ గ్రాఫిక్ సినిమాగా మార్చి, అడ్డదిడ్డంగా చిత్రీకరించేసి వదిలాడు… ఫస్ట్ బాధితుడు ప్రభాసే… ఆ రాముడి ఆహార్యం, వర్ణం కూడా కృత్రిమంగా… ఓ గంభీర విగ్రహంలాగా గాకుండా ఇందులో కూడా ప్రభాస్ ఓ యాక్షన్ హీరో టైపు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!
  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions