.
సై అనుకుంటా… దర్శకుడు రాజమౌళి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని రగ్బీ ఆటను చూపెట్టాడు… కాలేజీలో గ్రూపుల వైరం ప్రధాన కథే అయినా… విలన్ మరీ ముదురు పోకడలతో ఉన్నా… రగ్బీ ఆటను రక్తికట్టించాడు రాజమౌళి… కారణం, కథాకథనాలు, ప్రజెంటేషన్ పోకడ…
ఇప్పుడు శర్వానంద్ హీరోగా బైకర్ అనే సినిమా రిలీజైంది… ఇందులో మోటోక్రాస్ రేసింగు చూపించారు… సాధారణంగా ఇండియన్ ప్రేక్షకుడికి క్రికెట్ తప్ప మరో ఆట ఎక్కదు… కాకపోతే తెలుగు దర్శకులు అప్పుడప్పుడూ కబడ్డీని, బాక్సింగును చూపిస్తుంటారు అప్పుడప్పుడూ… మరి ఓ మోటోక్రాస్ రేసింగును దర్శకుడు మెప్పించాడా…?
Ads
-
నూతనత్వం…: తెలుగు తెరపై ఇప్పటివరకు రాని ‘మోటోక్రాస్’ (Dirt Bike Racing) నేపథ్యాన్ని ఎంచుకోవడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్… బైక్ రేసింగ్ అంటే కేవలం వేగం మాత్రమే కాదు, అందులో ఉండే టెక్నికాలిటీస్, బాడీ లాంగ్వేజ్, రిస్క్ ఫ్యాక్టర్లను చాలా నిజాయితీగా చూపించారు… నిజంగానే ఓ రేసింగ్ చూస్తున్నట్టుగా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్…
-
శర్వానంద్ మేకోవర్…: శర్వానంద్ ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టాడని చెప్పొచ్చు… ఒక ప్రొఫెషనల్ అథ్లెట్‌కు ఉండాల్సిన ఫిజిక్, ఆ రేసింగ్ సూట్‌లో తను పలికించిన హావభావాలు చాలా సహజంగా ఉన్నాయి… కానీ ఓ పక్కింటి కుర్రాడు, కాస్త కామెడీ, కాసిన్ని ఎమోషన్స్ ఆశిస్తుంటాం కదా తన నుంచి… ఇది పూర్తిగా కంట్రాస్టు…
-
రాజశేఖర్ పెర్ఫార్మెన్స్…: హీరో పాత్రల నుంచి ఇతర పాత్రలకు మళ్లాడు కదా రాజశేఖర్… ఇందులో ఓ తండ్రి పాత్రలో రాజశేఖర్ పర్లేదు, బాగానే చేశాడు… కొడుకు లక్ష్యానికి, తండ్రి ఆందోళనకు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా పెద్దగా పండలేదు గానీ… ఉన్నంతలో బాగానే చేశాడు…
-
మేకింగ్ వాల్యూస్…: సినిమాటోగ్రఫీ బాగుంది… ముఖ్యంగా రేసింగ్ ట్రాక్ మీద కెమెరా యాంగిల్స్ ప్రేక్షకుడిని కూడా రేసులో ఉన్నామా అన్న అనుభూతిని కలిగిస్తాయి… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రేసింగ్ సీన్లలో వేగాన్ని పెంచింది…

మైనస్ పాయింట్స్ (బలహీనతలు)… రెగ్యులర్ డ్రామా: క్రీడ కొత్తదైనప్పటికీ, కథా గమనం (Screenplay) కొంతవరకు పాత ఫార్మాట్‌లోనే సాగుతుంది… ఒక సాధారణ యువకుడు కష్టాలను ఎదుర్కొని ఛాంపియన్ అవ్వడం అనే పాయింట్ మనం గతంలో చాలా స్పోర్ట్స్ సినిమాల్లో చూసిందే…
తను ఎందుకు రేసింగ్ మానేశాడు, మళ్లీ ఎందుకొచ్చాడు, హీరోయిన్ పాత్ర ఏమిటి..? తండ్రీకొడుకుల నడుమ బంధం తదితరాంశాలు బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు, అదొక్కటే ఈ సినిమాలో లోపం…
-
నిడివి…: సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి… ముఖ్యంగా రేసింగ్ ప్రాక్టీస్ సీన్లు మరికొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది…
-
ప్రేక్షకులకు అవగాహన…: మోటోక్రాస్ గురించి కనీస అవగాహన లేని సామాన్య ప్రేక్షకులకు, కొన్ని సాంకేతిక పదాలు లేదా రేసింగ్ రూల్స్ అర్థం కావడం కొంచెం కష్టం కావచ్చు…
తుది తీర్పు (Final Verdict): మీరు కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చూస్తే ఈ సినిమా కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు… కానీ, ఒక కొత్త తరహా క్రీడను, అందులోని ఉద్వేగాలను చూడాలనుకుంటే మాత్రం ‘బైకర్’ ఖచ్చితంగా వోకే… గొప్పగా ఏమీ లేదు, తీసిపారేసేదీ కాదు…
Share this Article